business
పింక్ సిటీగా పేరొందిన జైపూర్ లో రాజపుత్, మొఘల్ నిర్మాణ శైలి స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ అంబర్ కోట, హవా మహల్, సిటీ ప్యాలెస్ చూడదగినవి.
ఖజురహో శిల్పాలు ప్రపంచ ప్రసిద్ధి గాంచినవి. ఈ గుడుల్లోని శృంగార శిల్పాలు చాందేల రాజుల కళా నైపుణ్యాన్ని తెలియజేస్తాయి.
ప్రేమకు చిహ్నంగా నిలిచే ఈ పాలరాతి కట్టడం మొఘల్ నిర్మాణ శైలికి గొప్ప ఉదాహరణ. దీన్ని సూర్యోదయం, సూర్యాస్తమయం వేళ చూస్తే చాలా బాగుంటుంది.
పటాన్‌లోని ఈ మెట్ల బావి అద్భుతమైన నిర్మాణం. దీనిపై పురాణాలు, దేవతల బొమ్మలు చెక్కబడి ఉన్నాయి.
వన్యప్రాణులను ఇష్టపడేవారికి ఇది చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ ఒక కొమ్ముగల ఖడ్గమృగాలు, పులులు, ఏనుగులు, అరుదైన పక్షులు ఉంటాయి.
విజయనగర సామ్రాజ్యపు రాజధానిగా ఒకప్పుడు వెలుగొందిన హంపిలో పురాతన దేవాలయాలు, రాతి రథాలు, శిథిలాలు ఎన్నో ఉన్నాయి.
13వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం ఎన్నో వింతలకు నెలవు. రథం ఆకారంలో ఉండే ఈ గుడిలో ఎన్నో అద్భుతమైన శిల్పాలు, అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి.