Recipes: చింత తొక్కుతో చేపల ఫ్రై.. చిరు స్టైల్ లో చేద్దాం!
Recipes: మెగాస్టార్ చిరంజీవి తన తల్లి కోసం చేసిన చేపల ఫ్రై . దాన్ని ఎలా తయారు చేయాలో కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు చిరంజీవి. అందుకే మనం కూడా తయారు చేద్దాం.
ఈమధ్య సినిమా హీరోలు ఒకరిని చూసి ఒకరు వంట పోస్టులు తెగ పెట్టేస్తున్నారు అందులో చిరంజీవి కూడా తల్లి కోసం చేసిన చేపల ఫ్రై ఒకటి సోషల్ మీడియాలో పెట్టారు. దాన్ని ఎలా తయారు చేయాలో దానికి కావలసిన ఇంగ్రిడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు మూడు లేదా నాలుగు వాటికి ఉండే పులుపును బట్టి చింతకాయలు, చిన్న చేపలు ఆరు, కారం వన్ టేబుల్ స్పూన్, పసుపు తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర హాఫ్ టీ స్పూన్..
ఉల్లిపాయ ఒకటి, గరం మసాలా పొడి వన్ టీ స్పూన్. ఇప్పుడు దీనిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఉల్లిపాయలు పేస్టులాగా చేసుకోవాలి, కడిగి పెట్టుకున్న చేపలను ఒక బాణలిలో వేసి అందులోనే ఈ ఉల్లిపాయ పేస్ట్..
తర్వాత చింతకాయలను తొక్కు మాదిరిగా తయారు చేసుకుని దానిని కూడా ఆ చేపలతో బాగా కలపాలి. ఇందులోనే రెండు స్పూన్లు నూనె, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేయాలి. ఆ తర్వాత పసుపు కూడా వేయాలి.
తర్వాత మరొక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టాలి. దానిపై కొద్దిగా నూనె వేయాలి, ఎందుకంటే అవి అడుగు పెట్టకుండా ఉండడానికి. దానిమీద మంట లెవెల్ చూసుకుని దానిమీద ఈ చేపల మిశ్రమాన్ని పెట్టుకోవాలి. అడుగు మాడకుండా చూసుకోవాలి.
కానీ చిన్న అడుగుపట్టినా కూడా అది చాలా రుచిగా ఉంటుంది. అలా అని ఎక్కువ అడుగుపెట్టేలాగా చూడకండి. ఆ ముక్కలు వేగుతున్నప్పుడు డ్రైగా అనిపిస్తే మరి కొంచెం నూనె వేసి బాగా కాలేలాగా చూసుకోండి. ఆపై రెండో వైపు కూడా కాల్చుకోండి. ఇంకేముంది కమ్మనైన చింత తొక్కు చేపల ఫ్రై రెడీ.