Hair Growth: జుట్టు తెగ రాలిపోతుందా? ఈ అలవాట్లతో చెక్ పెట్టండి!
health-life Jun 08 2025
Author: Rajesh K Image Credits:unsplash
Telugu
తరచుగా తలస్నానం
తరచుగా తలస్నానం చేస్తే నెత్తిపై ఉండే సహజ నూనెలు తొలగిపోతాయి, దీనివల్ల నెత్తి చర్మం పొడిబారి జుట్టు రాలిపోతుంది.
Image credits: pinterest
Telugu
ఆహార అలవాట్లు
తగినంత ప్రోటీన్ లేకపోవడం వల్ల జుట్టు పెళుసుగా మారి, రాలిపోతుంది. ఐరన్ లోపం వల్ల జుట్టు పల్చబడుతుంది. బయోటిన్, విటమిన్ డి, జింక్ వంటి ముఖ్యమైన విటమిన్లు జుట్టు ఆరోగ్యం కోసం అవసరం.
Image credits: pinterest
Telugu
తడి జుట్టును దువ్వడం
తడి జుట్టు దువ్వడం సరైన పద్దతి కాదు. పొడి జుట్టు కంటే తడి జట్టు సులభంగా విరిగిపోతుంది. నీరు జుట్టు ప్రోటీన్ నిర్మాణాన్ని బలహీనపరుస్తుంది. దీనివల్ల జుట్టు మరింత పెళుసుగా మారుతుంది.
Image credits: pinterest
Telugu
జుట్టును గట్టిగా ఉంచడం
చాలా మంది స్టైల్ కోసం జుట్టును గట్టిగా బంధించి ఉంచుతారు. ఇది పెద్ద పొరపాటు. జుట్టు గట్టిగా బంధించడం వల్ల తగిన రక్తప్రసరణ అందదు. దీంతో, జుట్టు బలహీనంగా మారి రాలిపోతుంది.
Image credits: pinterest
Telugu
హీట్ స్టైలింగ్
హెయిర్ స్ట్రెయిట్నెర్ వాడటం వల్ల జుట్టు బలహీనపడుతుంది. వేడి చేయడం వల్ల జుట్టులోని ప్రోటీన్ బంధాలు విచ్ఛిన్నమవుతాయి. జుట్టు పొడిబారి, విరిగిపోయేలా చేస్తాయి.