Kitchen Hacks: రోటీలు ఎన్ని గంటలైనా మెత్తగా ఉండాలా? ఈ ట్రిక్ వాడితే చాలు..!
పిండి కలిపే సమయంలో కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఫాలో అయితే.. ఉదయం చేసిన చపాతీ అయినా సాయంత్రానికి మెత్తగా ఉంటాయి.

రోటీలు మెత్తగా రావాలంటే..
ఇండియన్స్ అన్నం ఎంత ఎక్కువగా తింటారో... రోటీలు కూడా అంతే ఎక్కువగా తింటారు. చాలా మందికి రోజూ రోటీ తినకుండా కడుపు నిండదు. ప్రతి ఒక్కరూ ఇంట్లో గోధుమ పిండితో చేసిన రోటీలు తింటూ ఉంటారు. అయితే.. రోటీలు చేసిన వెంటనే వేడి వేడిగా తింటే చాలా రుచిగా, టేస్టీగా ఉంటాయి. కానీ, కాసేపటి తర్వాత చూస్తే గట్టిగా ఎండిపోయి.. అప్పడాల్లాగా తయారౌతాయి. ఇవి తినడానికి ఏ మాత్రం రుచిగా ఉండవు. అలా కాకుండా.. ఎన్ని గంటలు అయినా రోటీలు మెత్తగా ఉండాలంటే కొన్ని సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు. పిండి కలిపే సమయంలో కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఫాలో అయితే.. ఉదయం చేసిన చపాతీ అయినా సాయంత్రానికి మెత్తగా ఉంటాయి. మరి, అవేంటో చూద్దామా...
పిండి ఎలా కలుపుకోవాలి?
రోటీలు చేయడానికి కావాల్సిన పదార్థాలు...
గోధుమపిండి.. రెండు కప్పులు, రుచికి సరపడా ఉప్పు, నీళ్లు తగినంత, నూనె.. ఒకటి నుంచి రెండు టీ స్పూన్లు
పిండి కలిపే విధానం...
చపాతీలు మృదువుగా రావాలంటే.. పిండి కలిపే విధానంలోనే అసలు విషయం ఉంటుంది. దీనికోసం ఒక గిన్నెలో 2 కప్పుల గోధుమ పిండి లో రుచికి తగినంత ఉప్పు వేసి కలపాలి. తర్వాత కొద్ది కొద్దిగా నీరు పోస్తూ బాగా కలపాలి. పూరీ పిండి కంటే మెత్తగా చపాతీ పిండిని కలపాలి. పిండి మొత్తం కలిపిన తర్వాత రెండు స్పూన్ల నూనె కూడా వేసి మీ మణికట్టుతో మరోసారి కలపాలి. కనీసం 5 నిమిషాల పాటు నూనె వేసి తర్వాత కూడా కలపాలి. ఇలా కలిపిన తర్వాత పిండిని కాసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత చపాతీలు చేసుకుంటే.. కచ్చితంగా రోటీలు మెత్తగా వస్తాయి. ఎన్ని గంటలు అయినా.. ఎండిపోకుండా మెత్తగా వస్తాయి.
రోటీ చేసే విధానం..
ఇప్పుడు పిండిని తడి వస్త్రంతో కప్పి 10 నిమిషాలు పక్కన పెట్టండి.తరువాత, పిండిని పిసికిన పిండి నుండి కొద్దిగా పిండిని తీసుకొని బంతులుగా ఆకృతి చేయండి. ఇప్పుడు ఈ బంతులపై కొంచెం పొడి పిండిని చల్లి గుండ్రంగా చుట్టండి.చుట్టిన చపాతీకి ఒక వైపు కొద్దిగా నూనె రాసి మధ్యలో మడవండి. చుట్టిన చపాతీకి ఒక వైపు నూనె రాసి, మధ్యలో మడిచి.. మళ్లీ చేయాలి. ఇలా చుట్టి చుట్టి చేయడం వల్ల రోటీలు మంచిగా పొరలు పొరలుగా మెత్తగా వస్తాయి. ఇలా పొరలు పొరలుగా చేసి రోటీ చేసినప్పుడు... పూరీ పొంగినట్లుగా రోటీ పొంగుతుంది. చాలా రుచిగా , టేస్టీగా కూడా ఉంటాయి.
ఎలా నిల్వ చేయాలి?
తరువాత, చపాతీ పాన్‌ను స్టవ్ మీద ఉంచి వేడి చేయండి. పాన్ వేడెక్కినప్పుడు, ఇప్పటికే తయారుచేసిన చపాతీని అందులో వేసి పది సెకన్ల పాటు కాల్చాలి, తిప్పి, కొంచెం నూనె రాసి, మరోవైపు కూడా కాల్చాలి. స్టవ్ సిమ్ లో పెట్టి.. నెమ్మదిగా కాలిస్తే.. మెత్తగా ఉంటాయి. రోటీలను చేసిన వెంటనే హాట్ బాక్స్ లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది.
పిండిలో ఇది కూడా కలపాలి?
రోటీ కోసం పిండి కలపే సమయంలో రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసి కలుపుకోవచ్చు. నెయ్యి చేర్చడం వల్ల కూడా రోటీలు చాలా రుచిగా వస్తాయి. మెత్తగా కూడా వస్తాయి. ఎన్ని గంటలు అయినా గట్టిపడవు.

