MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Pressure Cooker: ఈ 5 తప్పులు చేస్తే మీ ప్రెషర్ కుక్కర్ పేలే ప్రమాదం ఎక్కువ

Pressure Cooker: ఈ 5 తప్పులు చేస్తే మీ ప్రెషర్ కుక్కర్ పేలే ప్రమాదం ఎక్కువ

Pressure Cooker: ప్రెషర్ కుక్కర్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లే కుక్కర్ పేలే ప్రమాదాన్ని పెంచేస్తాయి.  చిన్న చిన్న పొరపాట్లు, నిర్లక్ష్యం వల్ల కుక్కర్ బాంబులా పేలిపోయే ముప్పు ఉంటుంది. 

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 29 2026, 08:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ప్రెషర్ కుక్కర్ తో జాగ్రత్త
Image Credit : stockPhoto

ప్రెషర్ కుక్కర్ తో జాగ్రత్త

ఇప్పుడు ప్రతిఒక్కరి ఇంట్లోనూ ప్రెషర్ కుక్కర్ కచ్చితంగా ఉంటుంది. తక్కువ టైమ్‌లో వంట పూర్తి చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. కానీ దాని వాడకం విషయంలో చిన్న చిన్న తప్పులు చేసినా, కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా అది బాంబులా పేలి ప్రాణాలకే ముప్పు తెస్తుంది. కుక్కర్ పేలిన సంఘటనలు మీరు ఎన్నో వినే ఉంటారు. కొన్ని సాధారణ తప్పులే ఈ ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. అలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే కింద చెప్పిన తప్పులు చేయకూడదు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
కుక్కర్‌ను పూర్తిగా నింపకండి
Image Credit : Youtube

కుక్కర్‌ను పూర్తిగా నింపకండి

కుక్కర్ వాడడం వల్ల సమయంతో పాటూ గ్యాస్  కూడా ఆదా అవుతుంది.  కానీ, దాన్ని అజాగ్రత్తగా వాడితే ప్రాణాలకే ప్రమాదం. చాలామంది వంట తొందరగా అవ్వాలని కుక్కర్ నిండా పదార్థాలు వేసేస్తారు. కానీ, కుక్కర్ సామర్థ్యంలో 2/3 వంతుకు మించి నింపకూడదు. ముఖ్యంగా పప్పు, బియ్యం వంటివి ఉడికేటప్పుడు పొంగుతాయి. కాబట్టి వాటిని సగం వరకు మాత్రమే నింపడం సేఫ్.

Related Articles

Related image1
Wealth Yogam: చంద్రదశ యోగం ఉంటే ఈ 3 రాశుల వారు చిన్న వయసులోనే కోటీశ్వరులవుతారు
Related image2
Kitchen Tips: పంచదార డబ్బాలో ఈ ఒక్క వస్తువు పెడితే చాలు చీమలు పట్టవు
36
గ్యాస్కెట్ (రబ్బర్) నాణ్యత
Image Credit : stockPhoto

గ్యాస్కెట్ (రబ్బర్) నాణ్యత

కుక్కర్ మూతకు ఉండే రబ్బర్ (గ్యాస్కెట్) లూజ్‌గా అయినా, పగుళ్లు వచ్చినా వెంటనే మార్చేయాలి. సరిగ్గా లేని గ్యాస్కెట్ వల్ల ఆవిరి (Steam) పక్కనుంచి లీక్ అవుతుంది. దీనివల్ల లోపల సరైన ప్రెజర్ ఏర్పడదు, పైగా అది ప్రమాదకరంగా మారొచ్చు. 

46
నీటి పరిమాణం
Image Credit : instagram

నీటి పరిమాణం

కుక్కర్‌లో సరిపడా నీళ్లు వేయకుండా స్టవ్ మీద పెట్టడం చాలా ప్రమాదకరం. నీళ్లు లేకపోతే కుక్కర్ అడుగుభాగం మరీ ఎక్కువగా వేడెక్కి 'సేఫ్టీ వాల్వ్' పేలిపోవడానికి కారణమవుతుంది. అందుకే వండే పదార్థాన్ని బట్టి సరైన మోతాదులో నీళ్లు పోయడం చాలా ముఖ్యం.

56
వెంట్ పైప్ శుభ్రత
Image Credit : stockPhoto

వెంట్ పైప్ శుభ్రత

ప్రెషర్ కుక్కర్ మూతపైన ఉండే వెంట్ పైప్ (విజిల్ కింద ఉండే రంధ్రం) ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. అందులో ఆహార పదార్థాల ముక్కలు ఇరుక్కుంటే, లోపల ఏర్పడిన ఆవిరి బయటకు వెళ్లలేదు. దీనివల్ల లోపల విపరీతమైన ఒత్తిడి పెరిగి కుక్కర్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది.

66
బలవంతంగా మూత తీయకండి
Image Credit : Youtube

బలవంతంగా మూత తీయకండి

కుక్కర్‌లోని ప్రెషర్ పూర్తిగా తగ్గిన తరువాత పైన మూత తీయాలి. అలా తగ్గకుండా మూతను బలవంతంగా తీయడానికి ప్రయత్నించకూడదు. విజిల్ తీసినా లోపల ఇంకా కొద్దిగా ఆవిరి ఉండే అవకాశం ఉంది. ఒత్తిడి పూర్తిగా తగ్గిందని నిర్ధారించుకున్న తర్వాతే మూతను తీయాలి. బలవంతంగా తీస్తే కుక్కర్ పేలే అవకాశాలు ఎక్కువ.  ఈ ఐదు జాగ్రత్తలు పాటించడం ద్వారా మీరు సురక్షితంగా వంట చేయవచ్చు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Natural Cooling Foods: ఎండలు మండిపోతున్నాయ్.. బాడీని కూల్‌గా ఉంచే 5 అద్భుతమైన ఆహారాలు ఇవే !
Recommended image2
పాత బ‌ట్ట‌లను ఏం చేయాలో అర్థంకావ‌డం లేదా.? ఇలా చేస్తే ఇంటి అందం మార‌డం ఖాయం
Recommended image3
Curd: ఇడ్లీ, దోశ కాదు.. పరగడుపున పెరుగున్నం తింటే ఏమౌతుంది..?
Related Stories
Recommended image1
Wealth Yogam: చంద్రదశ యోగం ఉంటే ఈ 3 రాశుల వారు చిన్న వయసులోనే కోటీశ్వరులవుతారు
Recommended image2
Kitchen Tips: పంచదార డబ్బాలో ఈ ఒక్క వస్తువు పెడితే చాలు చీమలు పట్టవు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved