MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Kitchen Tips: పంచదార డబ్బాలో ఈ ఒక్క వస్తువు పెడితే చాలు చీమలు పట్టవు

Kitchen Tips: పంచదార డబ్బాలో ఈ ఒక్క వస్తువు పెడితే చాలు చీమలు పట్టవు

Kitchen Tips: వంటగదిలో పంచదార డబ్బాకు చీమలు పట్టేస్తాయి. ముఖ్యంగా వేడి లేదా తేమ పెరిగినప్పుడు పంచదారకు ఎక్కువగా దాడి చేస్తాయి. పంచదార డబ్బాలోకి చీమలు రాకుండా ఉండాలంటే చిన్న చిట్కా పాటిస్తే చాలు. 

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 27 2026, 02:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పంచదారకు చీమలు పట్టకుండా...
Image Credit : Getty

పంచదారకు చీమలు పట్టకుండా...

వంటగదిలో ఎక్కడ పంచదార ఉన్నా కూడా చీమలు వెతుక్కుంటూ వెళ్లిపోతాయి. వాటికి పంచదార అంటే చాలా ఇష్టం. పంచదార డబ్బా ఎక్కడ పెట్టినా కూడా చీమలు పట్టేసి ఇబ్బంది పెడతాయి. వాటిని తరిమికొట్టడం కష్టం. మీ ఇంట్లో కూడా చీమల బెడద ఎక్కువగా ఉంటే చిన్న చిట్కా పాటించండి. పంచదార డబ్బాలోకి చీమలు రాకుండా ఉండాలంటే మీరు లవంగాలను వాడొచ్చు. ఐదారు లవంగాలను నేరుగా పంచదార డబ్బాలో వేయండి. ఓ శుభ్రమైన వస్త్రంలో నాలుగైదు లవంగాలను కట్టి, ఆ మూటను పంచదార డబ్బాలో పెట్టినా చాలు. చీమలు పంచదార జోలికి రాకుండా ఉంటాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
ఈ చిట్కా ఎలా పనిచేస్తుంది?
Image Credit : Getty

ఈ చిట్కా ఎలా పనిచేస్తుంది?

చీమలకు ఘాటైన వాసనలు నచ్చవు. ముఖ్యంగా లవంగాల నుంచి వచ్చే వాసన అస్సలు నచ్చవు. లవంగాలలో 'యూజెనాల్' అనే సహజ సమ్మేళనం ఉంటుంది. దీని నుంచి వాసన మనకు నచ్చినా చీమల వంటి చిన్న కీటకాలకు నచ్చదు. అందుకే ఆ వాసన రాగానే దూరంగా వెళ్లిపోతాయి.

Related Articles

Related image1
Wealth Yogam: చంద్రదశ యోగం ఉంటే ఈ 3 రాశుల వారు చిన్న వయసులోనే కోటీశ్వరులవుతారు
Related image2
Face Tan: ఈ పండు గుజ్జుతో రుద్దారంటే ముఖంపై ఉన్న ట్యాన్ మొత్తం మాయం
34
ఇలా చేయండి
Image Credit : Getty

ఇలా చేయండి

ముందుగా పంచదార డబ్బాను శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టండి. నీటి తేమ లేకుండా చూసుకోండి. తేమ ఉంటే పంచదార అతుక్కుపోతుంది. తర్వాత ఒక వస్త్రంలో లవంగాలను కట్టి డబ్బాలో పెట్టండి. లవంగాల వాసన బయటకు రావాలి కానీ, అవి పంచదారలో కలిసిపోకూడదు. ప్రతి నాలుగు, ఐదు వారాలకు ఒకసారి ఈ లవంగాలను మారుస్తూ ఉండాలి.

44
ఇవి కూడా వాడి చూడండి
Image Credit : Getty

ఇవి కూడా వాడి చూడండి

మీ ఇంట్లో లవంగాలు లేకపోతే వేరే వస్తువులను కూడా వాడొచ్చు. వేపాకులు లేదా దాల్చినచెక్కను ఉపయోగించవచ్చు. వేపాకులు, దాల్చినచెక్క వాసనను కూడా చీమలు ఇష్టపడవు. అయితే, వీటిని పంచదార డబ్బాలో వేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి పంచదారలో కలిసిపోకుండా చూసుకోవాలి పంచదార డబ్బాకే కాకుండా ఇంట్లో వేరే చోట్ల కూడా చీమలు వస్తుంటే, వెనిగర్ వాడొచ్చు. చీమలు వచ్చే చోట వెనిగర్‌ను స్ప్రే చేస్తే అవి రావు. నీటిలో వెనిగర్ కలిపి స్ప్రే చేయాలి. మిరియాలను కూడా వాడొచ్చు. చీమల గుంపు ఉన్నచోట మిరియాల పొడి చల్లండి. నిమ్మ తొక్కలను చీమలు వచ్చే చోట పెట్టినా, ఆ పుల్లటి వాసనకు అవి ఇంట్లోకి రావు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఆహారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
White Dress: వేసవిలో ఈ వైట్ డ్రెస్సులు ఆఫీసులకు అందంగా ఉంటాయి
Recommended image2
Snake Plant: ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచితే ఎన్ని లాభాలో తెలుసా?
Recommended image3
Broiler Chicken: బ్రాయిలర్ కోళ్లు అంత ఫాస్ట్ గా ఎలా పెరుగుతాయి?
Related Stories
Recommended image1
Wealth Yogam: చంద్రదశ యోగం ఉంటే ఈ 3 రాశుల వారు చిన్న వయసులోనే కోటీశ్వరులవుతారు
Recommended image2
Face Tan: ఈ పండు గుజ్జుతో రుద్దారంటే ముఖంపై ఉన్న ట్యాన్ మొత్తం మాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved