MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Apple: కట్ చేసిన యాపిల్ రంగు మారకుండా ఉండాలంటే ఈ చిన్న పని చేస్తే చాలు!

Apple: కట్ చేసిన యాపిల్ రంగు మారకుండా ఉండాలంటే ఈ చిన్న పని చేస్తే చాలు!

Apple: సాధారణంగా యాపిల్‌ను కట్ చేసి కాసేపు పక్కన పెట్టగానే గోధుమ రంగులోకి మారిపోతుంటుంది. వాటిని తినాలన్నా, పిల్లలకు బాక్సులో పెట్టాలన్నా ఇబ్బందిగా అనిపిస్తుంది. మరి యాపిల్ రంగు మారకుండా ఉండాలంటే పాటించాల్సిన టిప్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Oct 12 2026, 03:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
యాపిల్ ముక్కలు రంగు మారకుండా ఉండే చిట్కాలు
Image Credit : social media

యాపిల్ ముక్కలు రంగు మారకుండా ఉండే చిట్కాలు

యాపిల్ ఆరోగ్యానికి ఎంత మంచిదో మనకు తెలుసు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అందుకే చాలామంది ప్రతిరోజూ యాపిల్‌ను తినడానికి ఇష్టపడతారు. పిల్లలకు స్నాక్స్‌గా ఇవ్వడం దగ్గరి నుంచి ఆఫీసులకు బాక్సులో తీసుకెళ్లడం వరకు యాపిల్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే యాపిల్‌ను ముక్కలుగా కోసిన కొద్దిసేపటికే అది గోధుమ రంగులోకి మారుతుంది. నిజానికి యాపిల్ ముక్కలు రంగు మారడం వెనుక ఉన్న కారణం ఏంటి? అలా కాకుండా ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
యాపిల్ రంగు ఎందుకు మారుతుంది?
Image Credit : our own

యాపిల్ రంగు ఎందుకు మారుతుంది?

యాపిల్‌ను కోసినప్పుడు దానిలోని పాలీఫెనాల్ ఆక్సిడేజ్ అనే ఎంజైమ్ గాలిలోని ఆక్సిజన్‌తో చర్య జరిపి రంగు మారడానికి కారణమవుతుంది. ఈ ప్రక్రియను ఎంజైమాటిక్ బ్రౌనింగ్ అంటారు. అందువల్ల యాపిల్ ముక్కలు కొద్దిసేపటికే గోధుమ రంగులోకి మారతాయి. ఇలా రంగు మారినంత మాత్రాన యాపిల్ వెంటనే పాడైపోయిందని అర్థం కాదు. అయితే దాని రూపం, తాజాదనం తగ్గినట్లు కనిపించవచ్చు. అందుకే యాపిల్ ముక్కలను కోసిన తర్వాత సరైన పద్ధతిలో నిల్వ చేయడం మంచిది.

37
నిమ్మరసం ఉపయోగించడం
Image Credit : AI Image

నిమ్మరసం ఉపయోగించడం

నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ యాపిల్‌పై జరిగే బ్రౌనింగ్ ప్రక్రియను స్లో చేయడంలో సహాయపడుతుంది. ఇందుకోసం ఒక గిన్నెలో కొద్దిగా చల్లని నీటిని తీసుకుని అందులో ఒకటి లేదా రెండు టీస్పూన్ల నిమ్మరసం కలపాలి. యాపిల్ ముక్కలను ఈ నీటిలో కొద్దిసేపు ఉంచి, ఆ తర్వాత బయటకు తీసి నీటిని తొలగించాలి. ఇలా చేయడం వల్ల యాపిల్ ముక్కలు ఎక్కువసేపు తాజాగా కనిపిస్తాయి.

47
ఉప్పు నీటిలో నానబెట్టడం
Image Credit : stockPhoto

ఉప్పు నీటిలో నానబెట్టడం

యాపిల్ ముక్కలు రంగు మారకుండా ఉండటానికి ఉప్పు నీరు కూడా ఉపయోగపడుతుంది. ఒక కప్పు నీటిలో అర టీస్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ నీటిలో యాపిల్ ముక్కలను మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత వాటిని బయటకు తీసి శుభ్రమైన నీటితో లైట్ గా కడగాలి.

57
తేనె కలిపిన నీటితో..
Image Credit : istockphoto.com

తేనె కలిపిన నీటితో..

ఒక కప్పు నీటిలో ఒకటి నుంచి రెండు టీస్పూన్ల తేనె కలిపి, అందులో యాపిల్ ముక్కలను కొన్ని నిమిషాల పాటు ఉంచాలి. తేనెలో ఉండే కొన్ని యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు బ్రౌనింగ్ ప్రక్రియను తగ్గించడంలో సహాయపడతాయి. అయితే ఈ పద్ధతిలో యాపిల్‌కు అదనపు చక్కెర చేరుతుందనే విషయం మర్చిపోవద్దు.

67
చల్లని నీటిని ఉపయోగించడం
Image Credit : Getty

చల్లని నీటిని ఉపయోగించడం

యాపిల్ ముక్కలను కొద్దిసేపు చల్లని నీటిలో ఉంచడం ద్వారా రంగు మారే వేగం తగ్గవచ్చు. అయితే నీటిలో ఉంచడం ఒక్కటే బ్రౌనింగ్‌ను పూర్తిగా ఆపదు. యాపిల్ ముక్కలను నీటిలో కాసేపు ఉంచి తర్వాత బయటకు తీసి శుభ్రమైన పాత్రలో నిల్వ చేయడం మంచిది.

77
గాలి చొరబడని డబ్బాలో..
Image Credit : Pinterest

గాలి చొరబడని డబ్బాలో..

యాపిల్ ముక్కలను కోసిన వెంటనే గాలి చొరబడని డబ్బాలో పెట్టడం మంచిది. గాలితో సంబంధం తగ్గడం వల్ల యాపిల్ రంగు మారే ప్రక్రియ నెమ్మదిస్తుంది. వీలైతే ముక్కలను శుభ్రమైన, మూత బిగుతుగా ఉండే డబ్బాలో పెట్టి రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయాలి. లేదంటే యాపిల్ ని తినేముందు కట్ చేసుకోవడం ఉత్తమం.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
చిట్కాలు మరియు ఉపాయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles Set: ఎంత చూసినా తనివితీరని యాంటిక్ గాజుల కలెక్షన్
Recommended image2
Dosa Batter: దోశ పిండి మిగిలిపోతే ఈ వంటకాలన్నీ చేసేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు
Recommended image3
Moringa Halwa : ఈ హల్వా తింటే చాలు..నీరసం కూడా నీరులా కరిగిపోతుంది
Related Stories
Recommended image1
Amazon: ఆఫర్స్ ఉన్నా లేకున్నా అమెజాన్‌లో చీప్‌గా దొరికే 5 వస్తువులు ఇవే!
Recommended image2
Paneer vs Chicken: పనీర్, చికెన్.. ప్రోటీన్ లో కింగ్ ఎవరు? బరువు తగ్గేందుకు ఏది బెస్ట్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved