MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Periods: పీరియడ్స్ సమయానికి రావడం లేదా? మందులు వాడకుండా ఇలా సహజంగా వచ్చేలా చేయచ్చు

Periods: పీరియడ్స్ సమయానికి రావడం లేదా? మందులు వాడకుండా ఇలా సహజంగా వచ్చేలా చేయచ్చు

Periods: కొన్నిసార్లు పీరియడ్స్ సమయానికి రావు. దీనివల్ల మహిళలకు ఇబ్బందిగా అనిపిస్తుంది. ప్రతిసారీ మందులు వాడాల్సిన అవసరం లేకుండా చిన్న ఇంటి చిట్కాల ద్వారా సమయానికి పీరియడ్స్ వచ్చేలా చేయవచ్చు. 

2 Min read
Author : Haritha Chappa
Published : Oct 24 2025, 01:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పీరియడ్స్ ముందే రావాలంటే...
Image Credit : Pixabay

పీరియడ్స్ ముందే రావాలంటే...

సాధారణంగా ప్రతి స్త్రీకి 28 రోజుల నుండి 35 రోజుల మధ్య పీరియడ్స్ వస్తూ ఉంటాయి. అయితే ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, ఆహారంలో తీవ్ర మార్పులు వంటివి పీరియడ్స్ ను ఆలస్యం చేస్తాయి. ఇలా పీరియడ్స్ ఆలస్యమైనప్పుడల్లా స్త్రీలు కంగారు పడతారు. కొన్నిసార్లు ప్రయాణాలు ఉన్నా, పండుగలు ఉన్నా ముందే పీరియడ్స్ వస్తే మంచిదని కోరుకుంటారు. అలాంటివారు మందులు వాడాల్సిన అవసరం లేకుండా పీరియడ్స్ ను సమయానికి లేదా వీలైనంత ముందుకు వచ్చేలా చేయవచ్చు. ఇందుకోసం చిట్కాలను ఇక్కడ ఇచ్చాము.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పచ్చి బొప్పాయి తింటే
Image Credit : Pixabay

పచ్చి బొప్పాయి తింటే

పీరియడ్స్ రావాలని కోరుకుంటే మీరు పొత్తికడుపుపై హీటింగ్ ప్యాడ్ ఉంచి రక్తప్రసరణను పెంచండి. గోరువెచ్చని నీటిలో వస్త్రాన్ని ముంచి దాన్ని పొత్తికడుపు పై ఉంచినా సరిపోతుంది. దీనివల్ల అక్కడ రక్తప్రసరణ వేగవంతం అవుతుంది. గర్భాశయ కండరాలను సడలించి రుతుస్రావం త్వరగా వచ్చేలా చేస్తాయి. అలాగే పచ్చి బొప్పాయి తినడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. పచ్చి బొప్పాయి గర్భాశయాన్ని ప్రేరేపిస్తుంది. గర్భాశయంలోని ఎంజైమ్‌లు.. హార్మోన్ల సమతుల్యతను కాపాడేందుకు సహాయపడతాయి. రోజుకు రెండుసార్లు పచ్చి బొప్పాయి తినేందుకు ప్రయత్నిస్తే త్వరగా పీరియడ్స్ వచ్చేస్తాయి.

Related Articles

Related image1
కందిపప్పుతో అప్పటికప్పుడు రుచికరమైన పచ్చడి ఇలా చేసేయండి, స్పైసీగా అదిరిపోతుంది
Related image2
అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు గూగుల్ లో ఎక్కువగా ఏం సెర్చ్ చేస్తారో తెలుసా?
35
బెల్లం కషాయం
Image Credit : Pixabay

బెల్లం కషాయం

ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూను సెలెరీ వేయండి. అందులో కొద్దిగా బెల్లం వేసి మరిగించండి. ఉదయాన లేచాక ఖాళీ పొట్టతో తాగేందుకు ప్రయత్నించండి. ఇది ఋతుచక్రం త్వరగా మొదలయ్యేలా చేస్తుంది. అలాగే అల్లం టీ లేదా తులసి టీని కూడా ప్రయత్నించవచ్చు. అల్లం తినడం వల్ల రక్త ప్రవాహం శరీరంలో పెరుగుతుంది. తులసి కూడా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడకుండా కాపాడుతుంది. అల్లం, తులసి రెండూ కలిపి టీ చేసుకొని తాగితే పీరియడ్స్ సమయానికి వస్తాయి. కొన్నిసార్లు ముందే రావచ్చు.

45
విటమిన్ సి పండ్లు
Image Credit : Pixabay

విటమిన్ సి పండ్లు

విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు కూడా పీరియడ్స్ వచ్చేందుకు ఉపయోగపడతాయి. నారింజ, నిమ్మ, జామ వంటి పనులు అధికంగా తినండి. విటమిన్ సి శరీరంలో చేరాక ఈస్ట్రోజన్ స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల గర్భాశయ లైనింగ్ వేగంగా తొలగిపోతుంది. అప్పుడు వెంటనే పీరియడ్స్ మొదలవుతాయి. శారీరక శ్రమ అనేది కూడా పీరియడ్స్ రాకను పెంచుతుంది. ఎందుకంటే వ్యాయామం అనేది రక్తప్రసరణ శరీరంలో వేగవంతం చేస్తుంది. హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతుంది. ఇవన్నీ కూడా రుతు చక్రాన్ని ప్రారంభించేలా చేస్తాయి.

55
ఒత్తిడి లేకుండా
Image Credit : Pixabay

ఒత్తిడి లేకుండా

ఒత్తిడి వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. కాబట్టి యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల మీరు ఒత్తిడిని అధిగమించవచ్చు. మానసిక ప్రశాంతతను పొందవచ్చు. ఇది మీ రుతు చక్రాన్ని క్రమంలో ఉంచుతుంది. అయితే ప్రతినెలా సమయానికి రుతుస్రావం కాకపోయినా, ప్రతినెలా ఆలస్యంగా వస్తున్నా.. అది ఏదైనా వైద్య పరిస్థితికి కారణం కావచ్చు. పీసీఓడీ, థైరాయిడ్ వంటివి వాటి వల్ల కూడా సమయానికి పీరియడ్స్ రావు. కాబట్టి వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Travel Tips: కారు, బస్సు ప్రయాణం పడడం లేదా? వాంతులు అవుతుంటే ఈ చిన్న పని చేయండి
Recommended image2
Mangalsutra Bracelet: నేటి మగువల మనసు దోచే మంగళసూత్ర బ్రేస్‌లెట్స్
Recommended image3
Butterfly Rings: ఒక్కసారైనా ఈ బ్యూటిఫుల్ బటర్ ఫ్లై రింగ్స్ ట్రై చేయాలి
Related Stories
Recommended image1
కందిపప్పుతో అప్పటికప్పుడు రుచికరమైన పచ్చడి ఇలా చేసేయండి, స్పైసీగా అదిరిపోతుంది
Recommended image2
అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు గూగుల్ లో ఎక్కువగా ఏం సెర్చ్ చేస్తారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved