Google: గూగుల్ అందరికీ అందుబాటులో ఉండే సెర్చ్ ఇంజిన్. అమ్మాయిలు తాము ఒంటరిగా ఉన్నప్పుడు గూగుల్ ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? ఏం తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు? వంటివి తెలుసుకునేందుకు  ఒక సర్వే జరిగింది. ఆ నివేదిక వివరాలు ఇవిగో.

ఇది ఇంటర్నెట్ యుగం. జెనరేషన్ జెడ్ కాలం ఇది. అమ్మాయిలు ఇంటర్నెట్ ను అధికంగానే ఉపయోగిస్తున్నారు. అమ్మాయిలు అధికంగా గూగుల్ లో ఏం వెతుకుతారు? ఈ సందేహం మీకు కూడా ఉందా? ఆ విషయం తెలుసుకోవడానికి ఒక సర్వే చేశారు. ఆ సర్వే తాలుకు నివేదిక వచ్చింది. అందులో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. 

మన దేశంలో ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారి సంఖ్య 15 కోట్ల పైమాటే. వారిలో దాదాపు 6 కోట్ల మంది మహిళలే ఉన్నారు. వారు ఆన్ లైన్ లోనే అధికంగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఈ మహిళలు తమ రోజువారీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి గూగుల్ ను ఉపయోగించుకుంటున్నారు. ఇంతకీ అమ్మాయిలు ఇంటర్నెట్‌లో ఏం వెతుకుతారు? ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి.

గూగుల్ సెర్చ్ ఫలితాలు

గూగుల్ చెప్పిన నివేదిక ప్రకారం మహిళలు ఇంటర్నెట్ వాడకంపై ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నారు. ఆ నివేదిక ప్రకారం మన దేశంలోని 15 కోట్ల ఇంటర్నెట్ వినియోగదారులలో దాదాపు 6 కోట్ల మంది మహిళలే ఉన్నారు. 2022 డేటా ప్రకారం ఇంటర్నెట్ వాడే మహిళల్లో 75 శాతం మంది కేవలం 15 నుంచి 34 ఏళ్ల మధ్య వారే. అంటే ఎక్కువగా యువతరమే ఉన్నారు. మహిళలు కూడా మగవారితో సమానంగా డిజిటల్ ప్రపంచంలో పోటీపడుతున్నట్టు తెలుస్తోంది. 

ఏం వెతుకుతున్నారు?

అమ్మాయిలు గూగుల్‌లో ఏం వెతుకుతారో తెలుసా? తాము ఒంటరిగా ఉన్నప్పుడు గూగుల్ ను తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. అలాగే ఆరోగ్య సలహాలు, బ్యూటీ టిప్స్, వంటల రెసిపీలు, ఫ్యాషన్ ట్రెండ్స్, ఉద్యోగావకాశాలు, విద్యా సమాచారం, పిల్లల పెంపకం, కుటుంబ నిర్వహణ గురించి అడుగుతూ ఉంటారు. సమాజంలో జరుగుతున్న విషయాల గురించి కూడ వెతుకుతూ ఉంటారు. కళలు, సాహిత్యం, నవ్వించే విషయాలకు సంబంధించిన కూడ వెతుకుతూ ఉంటారు. వారు ఒంటరిగా ఉన్నా, లేక పదిమందిలో ఉన్నా కూడా వెతికే విషయాలు అధికంగా ఇవే. 

తమ వ్యక్తిగత విషయాలపై సలహా అడిగేందుకు కూడా మహిళలు ఆసక్తి చూపిస్తారు. తమ సమస్యల గురించి తమ మొబైల్ ఫోన్లలో ప్రైవేట్‌గా వెతికి సమాధానాలు తెలుసుకుంటారు. అమ్మాయిలు ఎవరికీ చెప్పుకోలేన విషయాలను గూగుల్ నే అడుగుతూ ఉంటారు. ఇంటర్నెట్, గూగుల్ అనేవి అమ్మాయిల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయాయి. తమ జ్ఞానాన్ని పెంచుకోవడానికి, రోజువారీ సవాళ్లను ఎదుర్కోవడానికి కూడా గూగుల్ సాయాన్ని తీసుకుంటారు.