ఇలా ప్రవర్తిస్తే మీ భాగస్వామి సెక్స్ కి అడిక్ట్ అయినట్టే ..!
వయసుతో పాటుగా సెక్స్ పై కోరికలు తగ్గినా.. దీనిపై అపుడప్పుడు కోరికలు పుట్టడం చాలా కామన్ విషయం. కానీ కొంతమంది అబ్బాయిలు కావొచ్చు, అమ్మాయిలు కావొచ్చు ఎప్పుడూ సెక్స్ గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. హస్తప్రయోగం చేస్తుంటారు. ముఖ్యంగా అశ్లీల చిత్రాలను తరచుగా చూస్తుంటారు. కానీ ఇవన్నీ మీరు సెక్స్ కు అడిక్ట్ అయ్యారని చెప్పే సంకేతాలు తెలుసా?
లైంగిక వ్యసనం అనేది మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది ఎదుర్కొనే సమస్య. సెక్స్ వ్యసనం అంటే సెక్స్ గురించి ఎక్కువగా ఆలోచించడం, ఫాంటసీలు, విభిన్న ప్రవర్తనను కలిగి ఉండటం. ఇలాంటి వారికి రోజూ లేదా తరచుగా సెక్స్ లో పాల్గొనాలనిపిస్తుంది. అలాగే భాగస్వామి పట్ల కఠినంగా ప్రవర్తిస్తారు. కానీ సెక్స్ వ్యసనం ఒక వ్యక్తి వ్యక్తిగత, వృత్తిపరమైన, సామాజిక జీవితాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఏదేమైనా ఈ లైంగిక ప్రవర్తన, కోరికలు వ్యక్తికి వ్యక్తికి చాలా భిన్నంగా ఉంటాయి. వీటిని ఒక వ్యక్తి సమస్యగా భావిస్తే.. వేరొకరికి ఇలా ఉండకపోవచ్చు. మాటల్లో చెప్పడ కష్టమే కానీ.. మీ భాగస్వామి సెక్స్ కు అడిక్ట్ అయ్యారో లేదో ఇట్టే తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
బలవంతం చేయడం
మీ భాగస్వామి తరచుగా హస్తప్రయోగం చేయడం, బలవంతపు అశ్లీల వీడియోలను చూడటం, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడడం వంటి ఎక్కువ లైంగిక కార్యకలాపాలలో పాల్గొంటే.. అది ఖచ్చితంగా లైంగిక వ్యసనానికి సంకేతం కావచ్చు.
అబద్ధం, రహస్యం
మీ భాగస్వామి తన లైంగిక కార్యకలాపాల గురించి అబద్ధం చెబితే లేదా వాటిని దాచడానికి ప్రయత్నిస్తే.. లైంగిక వ్యసనంతో పోరాడుతున్నారని అర్థం చేసుకోండి. సెక్స్ కు అడిక్ట్ అయినవారే ఇలా ప్రవర్తించే అవకాశం ఉంది.
నియంత్రణ లేకపోవడం
మీ భాగస్వామి వారి లైంగిక ప్రేరణలు లేదా ప్రవర్తనలను నియంత్రించలేకపోతే అది వారి జీవితంలో ఎన్నో సమస్యలను కలిగిస్తుందని తెలిసినప్పటికీ దానిని కంట్రోల్ చేయకపోవడం. ఇది కూడా వ్యసనానికి సంకేతం కావొచ్చు.
సహనం ఎక్కువ కావడం
మీ భాగస్వామి ఎక్కువ సంతృప్తిని పొందడానికి తీవ్రమైన లేదా ప్రమాదకరమైన సెక్స్ పొజీషన్ లో పొల్గొంటుంటే కూడా అనుమానించాల్సిందే. ఎందుకంటే ఇది కూడా సెక్స్ వ్యసనానికి సంకేతం కాబట్టి.
బాధ్యతలను విస్మరించి..
లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి మీ భాగస్వామి పని, కుటుంబం, ఇతర కట్టుబాట్లు వంటి వారి బాధ్యతలను విస్మరిస్తే అది ఖచ్చితంగా సెక్స్ వ్యసనానికి సంకేతం కావొచ్చు.
లైంగిక ఉద్దీపన కోసం నిరంతర అన్వేషణ
డిఫరెంట్ పొజీషన్ లో సెక్స్ ను ఆస్వాదించాలనుకోవడంలో తప్పు లేదు కానీ.. ఎప్పుడూ అదే పనిమీద ఉండటం అంత మంచిది కాదు. ఇలా మీరు ఆలోచిస్తున్నారంటే ఖచ్చితంగా సెక్స్ కు అడిక్ట్ అయినట్టే. మీ భాగస్వామి నిరంతరం కొత్త లైంగిక అనుభవాల కోసం చూస్తున్నట్టైతే ఇది వారి ఆరోగ్యం, సంబంధాలు, ఉద్యోగాన్ని ప్రమాదంలో నెట్టేస్తాయి.
లైంగిక వ్యసనంతో ప్రతి ఒక్కరి అనుభవాలు ప్రత్యేకమైనవని గుర్తుంచుకోవడం ముఖ్యం. లక్షణాలు, సంకేతాలు వ్యక్తి వ్యక్తికి చాలా భిన్నంగా ఉంటాయి. మీ భాగస్వామి లైంగిక ప్రవర్తన గురించి మీరు ఆందోళన చెందుతుంటే.. వారితో ప్రేమగా మాట్లాడండి. వారి మాటలను వినండి. దానినుంచి బయటపడటానికి నిపుణుల సలహా తీసుకోమని ప్రోత్సహించండి. వారికి ధైర్యాన్ని ఇవ్వండి.