Monsoon : వర్షాకాలంలో ఈ బట్టలను అస్సలు ధరించకూడదు.. ఎందుకంటే..?
Comfortable clothes For Monsoon: ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం, వ్యాయామం ఎంత ముఖ్యమో దుస్తులు కూడా అంతే ముఖ్యం. వర్షాకాలంలో కొన్నిదుస్తులు ధరిస్తే చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్లు రావొచ్చు. అయితే.. వర్షాకాలంలో ఎలాంటి దుస్తువులు వాడాలో ? ఏ దుస్తువులు వాడకూడదో ?

పాలిస్టర్ (Polyester)
పాలిస్టర్ అనేది తేమను నిలుపుకోని సింథటిక్ ఫాబ్రిక్. ఇది కూడా వర్షాకాలంలో ధరించడానికి అనువైనది. తడిస్తే చాలా త్వరగా ఆరిపోతాయి. అయితే.. పాలిస్టర్ వేడిని బయటకు పోనివ్వకుండా శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. దీంతో చెమట ఆవిరి కాదు.ఇలా తేమ, వేడి కలిసి వల్ల బ్యాక్టీరియా, జెర్మ్స్ వేగంగా పెరిగి దుర్వాసన వస్తుంది. అలాగే కొంతమందిలో అలెర్జీలు, దురద వంటి చర్మ సమస్యలు రావొచ్చు.
నైలాన్ (Nylon)
నైలాన్.. పాలిస్టర్ లాగానే ఉంటుంది. ఈ దుస్తులు కూడా గాలి లోపలికి పోనివ్వవు. ఎక్కువగా చెమట పట్టేవారు నైలాన్ దుస్తులను ఉపయోగించకూడదు. అలాంటి వారిలో అలెర్జీ, దురద వంటి సమస్యలు వస్తాయి. ఈ రకమైన దుస్తులలో కొన్నిసార్లు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఏర్పడి షాక్ కొట్టినట్లుగా అనిపిస్తుంది.
అక్రిలిక్ (Acrylic)
అక్రిలిక్ అనేది సహజమైన ఉన్నిని పోలి ఉండే ఒక సింథటిక్ ఫైబర్. ఇది శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచలేదు. అక్రిలిక్ దుస్తుల నాణ్యత సరిగా ఉండదు. ఇవి త్వరగా క్షీణించి పాడవుతాయి. వీటిని ఉతకడం వల్ల మైక్రోప్లాస్టిక్ విడుదలవుతాయి. ఇవి మనకు, పర్యావరణానికి హానికరం.
వినైల్ లేదా PVC దుస్తులు
వినైల్ లేదా PVC దుస్తులు.. వీటిని ప్లాస్టిక్ పాలీ వినైల్ క్లోరైడ్ (PVC) నుండి తయారు చేస్తారు. PVC ప్లాస్టిక్ ని వినైల్ అని పిలుస్తారు. ఈ రకమైన దుస్తులు చర్మానికి హానికరం. వీటిని ధరించడం వల్ల అలెర్జీ, దురద వంటి సమస్యలు రావచ్చు. అందుకే వీటిని ఎక్కువసేపు ధరించకూడదు.
రేయాన్ (Rayon)
తక్కువ నాణ్యత గల రేయాన్ దుస్తులలో ఎక్కువ రసాయనాలు ఉంటాయి. ఇవి త్వరగా ముడుచుకుపోతాయి. తర్వాత వీటి నాణ్యత తగ్గిపోతుంది. ఈ రకమైన దుస్తులను ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే ధరించవచ్చు. చౌకైన ధరకు లభించే దుస్తులు రేయాన్ రకానికి చెందినవి. ఇవి శరీరానికి హానికరం, నాణ్యత కూడా తక్కువ.
లైక్రా
లైక్రా ఫాబ్రిక్ నే స్పాండెక్స్ అని కూడా పిలుస్తారు, ఇది సాగే గుణం కలిగి ఉంటుంది. కాబట్టి ఈ దుస్తులు సౌకర్యవంతంగా ఉంటాయి. అయితే, చాలా బిగుతుగా ఉండే లైక్రా దుస్తులు ధరించడం వల్ల రక్త ప్రసరణకు అంతరాయం కలగవచ్చు, ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చొని లేదా నిలబడి ఉన్నప్పుడు.. గాలి చొరబడని ఈ ఫాబ్రిక్ శరీరానికి మంచిది కాదు.
శరీరానికి మంచి దుస్తులు ఏవి?
పట్టు: పట్టు వస్త్రాలు చర్మానికి మృదువుగా, హాయిగా ఉంటాయి. పట్టు వస్త్రాలు చర్మానికి రాపిడిని తగ్గిస్తాయి, ముడతలను నివారిస్తాయి. చర్మంపై స్లీప్ లైన్లు, మడతలు ఏర్పడకుండా చేస్తాయి. పట్టు వస్త్రాలకు నీటిని పీల్చుకునే గుణం ఉంటుంది. ఇది చర్మాన్ని చల్లగా, పొడిగా ఉంచడంలో సహాయపడుతుంది.
మెరినో వూల్: మెరినో ఉన్ని మృదువుగా ఉంటుంది. ఇది అన్ని రకాల వాతావరణాలకు అనుకూలమైనది. దుర్వాసనను నిరోధిస్తుంది. ఈ ఉన్ని తేమను గ్రహించి, చెమట నుండి వచ్చే దుర్వాసనను తగ్గిస్తుంది. మెరినో ఉన్ని సహజంగానే బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించే లక్షణాన్ని కలిగి ఉంటుంది, ఇది దుర్వాసనను నిరోధించడంలో సహాయపడుతుంది.
Bamboo: వెదురు మొక్కల నుండి తయారైన మెటీరియల్ ఇది. ఇది పర్యావరణానికి, చర్మానికి చాలా మంచిది. ఇందులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల బ్యాక్టీరియా, జెర్మ్స్‌ను ఎదుర్కొంటుంది. వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంచుతుంది. ఇది సహజంగానే UV కిరణాల నుండి రక్షణ కల్పిస్తుంది. దీనివల్ల సూర్యుడి వేడి నుండి మనల్ని కాపాడుతుంది.
లెనిన్: ఈ బట్టలు వేడి వాతావరణానికి అనుకూలంగా ఉంటాయి. అవి తేలికగా, శ్వాసక్రియకు అనుకూలంగా ఉంటాయి, ఇది చెమటను గ్రహించి వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. వీటి ధర ఎక్కువైనప్పటికీ చాలా మంది వీటిని ధరించడానికి ఇష్టపడుతారు.
కాటన్ : కాటన్ దుస్తువులను ఏ కాలంలోనైనా వేసుకోవచ్చు. వీటిని ఉతికే కొద్దీ మృదువుగా మారుతాయి. కానీ ఉతికిన వెంటనే ముడుచుకుపోతాయి. సున్నితమైన చర్మం, అలెర్జీ చర్మం ఉన్నవారికి ప్రత్తి దుస్తులే ఉత్తమం. అయితే, కల్తీ పత్తి లేదా ప్లాస్టిక్ కలిసిన ప్రత్తి దుస్తులకు దూరంగా ఉండాలి.

