MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Food
  • Milk Storage: వేడి పాలు ఫ్రిడ్జ్ లో ఎందుకు పెట్టకూడదు, పెడితే ఏం అవుతుంది?

Milk Storage: వేడి పాలు ఫ్రిడ్జ్ లో ఎందుకు పెట్టకూడదు, పెడితే ఏం అవుతుంది?

Milk Storage: ఇంట్లో చాలాసార్లు పాలు మురిగించిన వెంటనే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తుంటారు. అయితే ఇది సరైన పద్ధతి కాదు. వేడి పాలను నేరుగా ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు ఆరోగ్యానికి, అలాగే ఫ్రిడ్జ్ పనితీరుకూ ప్రభావం చూపుతాయి.

2 Min read
Author : Nandini Arava
Published : Mar 03 2026, 02:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వేడి పాలను ఫ్రిడ్జ్ లో పెడుతున్నారా?
Image Credit : Getty

వేడి పాలను ఫ్రిడ్జ్ లో పెడుతున్నారా?

చాలా మందికి పాలు మరిగించిన వెంటనే వాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టేయడం అలవాటు. అలా చేస్తే త్వరగా చల్లారిపోతాయని ఇలా చేస్తారు. కానీ వాస్తవానికి వేడి పాలను నేరుగా ఫ్రిడ్జ్‌లో పెట్టడం మంచిది కాదు. ఇది పాల నాణ్యతపైనే కాదు, ఫ్రిడ్జ్ పనితీరుపై కూడా ప్రభావం చూపుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇతర ఆహార పదార్థాలపై ప్రభావం
Image Credit : Getty

ఇతర ఆహార పదార్థాలపై ప్రభావం

మొదటగా, వేడి పాలను నేరుగా ఫ్రిడ్జ్‌లో పెట్టితే ఫ్రిడ్జ్‌లోని లోపలి ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరుగుతుంది. ఫ్రిడ్జ్‌లో సాధారణంగా 2 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత ఉంటుంది. కానీ వేడి పాలు పెట్టినప్పుడు లోపలి చల్లదనం తగ్గిపోతుంది. దాంతో ఫ్రిడ్జ్‌లో ఉన్న ఇతర ఆహార పదార్థాలపై కూడా ప్రభావం పడుతుంది. అవి త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. 

Related Articles

Related image1
Turmeric Milk: 20 రోజులపాటు పసుపు పాలు తాగితే కలిగే 5 అద్భుతమైన లాభాలు ఇవే!
Related image2
Butter Milk: మజ్జిగ ఎలా తాగాలో తెలుసా? ఇలా తాగితే అమృతం తాగినట్లే..!
35
ఆవిరి నీరు పాలలో కలిసి త్వరగా పాడయ్యే అవకాశం
Image Credit : Getty

ఆవిరి నీరు పాలలో కలిసి త్వరగా పాడయ్యే అవకాశం

రెండవది, వేడి పాలను మూత పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టినప్పుడు ఆ పాత్రలో ఆవిరి ఏర్పడుతుంది. ఆ ఆవిరి చల్లబడిన తర్వాత నీటి బిందువులుగా మారుతుంది. ఇది పాలలో నీరు కలిసినట్టుగా మార్పు తీసుకురావచ్చు. దాంతో పాల రుచి కొద్దిగా మారుతుంది. కొన్ని సందర్భాల్లో పాలు త్వరగా పాడయ్యే అవకాశమూ ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో ఇది ఎక్కువగా గమనించవచ్చు. 

45
ఫ్రిడ్జ్ కాంప్రెసర్‌పై ఒత్తిడి
Image Credit : Getty

ఫ్రిడ్జ్ కాంప్రెసర్‌పై ఒత్తిడి

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల ఫ్రిడ్జ్ కాంప్రెసర్ ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దీని వల్ల విద్యుత్ వినియోగం పెరుగుతుంది. చివరకు అలాగే ఫ్రిడ్జ్ పనితీరు కూడా దెబ్బతింటుంది.

55
గది ఉష్ణోగ్రత వద్ద చల్లార్చాలి
Image Credit : Getty

గది ఉష్ణోగ్రత వద్ద చల్లార్చాలి

అయితే పాలను బయట ఎక్కువసేపు ఉంచడం కూడా మంచిది కాదు. ముఖ్యంగా వేసవిలో గది ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బ్యాక్టీరియా వేగంగా చేరుతుంది. కాబట్టి పాలను మరిగించిన తర్వాత గది ఉష్ణోగ్రతకు వచ్చే వరకు కొంతసేపు బయటే ఉంచాలి. పూర్తిగా చల్లారాక ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. వేగంగా చల్లార్చాలనుకుంటే పాల గిన్నెను చల్లని నీళ్లలో కాసేపు ఉంచితే చల్లగా అయిపోతాయి. 

ఒక్కమాటలో చెప్పాలంటే వేడి పాలను నేరుగా ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల ఫ్రిడ్జ్‌లోని ఇతర పదార్థాలు పాడవుతాయి. విద్యుత్ వినియోగం పెరుగుతుంది. పాలు విరిగిపోవడం, విషపూరితం అవ్వడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి కొద్దిసేపు చల్లారనిచ్చి తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టడం చాలా ఉత్తమం. ఇది ఆరోగ్యానికి మంచిదే కాకుండా, మీ ఫ్రిడ్జ్ పాడవకుండా చూస్తుంది. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Related Stories
Recommended image1
Turmeric Milk: 20 రోజులపాటు పసుపు పాలు తాగితే కలిగే 5 అద్భుతమైన లాభాలు ఇవే!
Recommended image2
Butter Milk: మజ్జిగ ఎలా తాగాలో తెలుసా? ఇలా తాగితే అమృతం తాగినట్లే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved