పొద్దున్నే నానబెట్టిన అంజీర పండ్లను తిన్నారంటే ఈ సమస్యలన్నీ తగ్గిపోతాయ్
Soaked Anjeer: అంజీర పండ్లలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ పండ్లను నానబెట్టి ఉదయాన్నే పరిగడుపున తింటే ఇంకా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అంజీర్
ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్ లో అంజీర్ ఒకటి. అంజీర్ పండ్లు పోషకాలకు మంచి వనరు. వీటిలో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లను తింటే బలహీనత, అలసట అనే సమస్యలే ఉండవు. ఈ పండును అలాగే కాకుండా.. రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పరిగడుపున తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
హార్మోన్ల సమతుల్యత
నానబెట్టిన అంజీర పండ్లు ఆడవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా ఉదయాన్నే పరిగడుపున నానబెట్టిన అంజీర పండ్లను తింటే హార్మోన్ల అసమతుల్యత ఉండదు. ఇది హార్మోన్ల అసమతుల్యత లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ పండ్లలో ఉండే పోషకాలు పీరియడ్స్ సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి.
మలబద్దకం నుంచి ఉపశమనం
మలబద్దకం సమస్య ఉన్నవారికి కూడా అంజీర పండ్లు ఉపయోగపడతాయి. ఈ పండ్లు దీర్ఘకాలిక మలబద్దకం నుంచి కూడా ఉపశమనం కలిగించగలవు. ఉదయాన్నే పరిగడుపున నానబెట్టిన అంజీర పండ్లను తినడం వల్ల పేగులు శుభ్రపడతాయి. మలవిసర్జన సాఫీగా సాగుతుంది. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ పేగుకదలికలను మెరుగుపరిచి మలవిసర్జనకు సహాయపడుతుందది. రాత్రినానబెట్టిన అంజీర పండ్లను ఉదయాన్నే పరిగడుపున తినడం వల్ల ఉదయాన్నే మీ జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. అలాగే తిన్నది సులువుగా అరుగుతుంది కూడా.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
అంజీర పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు అంటు వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి మన శరీరాన్ని కాపాడుతాయి. ఉదయాన్నే పరిగడుపున నానబెట్టిన అంజీర పండ్లను తింటే రోగనిరోధక శక్తి మెరుగుపడి మీరు జబ్బుల బారిన పడకుండా ఉంటారు.
బరువు తగ్గుతారు
బరువు తగ్గాలనుకునే వారు ఏవేవో పండ్లను తింటుంటారు. అయితే అంజీర పండ్లు కూడా వెయిట్ లాస్ అయ్యేందుకు సహాయపడతాయి. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే అత్తి పండ్లను చేర్చుకోండి. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ మీరు హెవీగా తినకుండా చేస్తుంది. దీనిలో నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉన్నా కేలరీలు తక్కువగా ఉంటాయి. ఉదయాన్నే నానబెట్టిన అంజీర పండ్లను తింటే మీ ఆకలి చాలా వరకు తగ్గి బరువు తగ్గడానికి సహాయపడతాయి.
గుండె ఆరోగ్యం
అంజీర పండ్లులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియంలు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడతాయి. ఈ పండులో ఉండే పొటాషియం అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరాన్ని ఫ్రీరాడికల్స్ నుంచి కాపాడుతాయి. దీంతో మీకు గుండె జబ్బులొచ్చే ప్రమాదం తగ్గుతుంది.
ఎముకలు బలంగా ఉంటాయి
నానబెట్టిన అంజీర పండ్లను తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. అంజీర పండ్లలో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడతాయి. మీరు ఉదయాన్నే పరిగడుపున నానబెట్టిన అంజీర పండ్లను తినడం వల్ల బోలు ఎముకల వ్యాధి వచ్చే రిస్క్ తగ్గుతుంది.