రెడ్ వైన్ అంటే ఇష్టమా? ఈ విషయం తెలిస్తే ఇకనుంచి..
రెడ్ వైన్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దీంతో మీకు గుండె జబ్బులొచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.
రెడ్ వైన్ ను ఇష్టంగా తాగేవారు చాలా మందే ఉన్నారు. అయితే దీన్నిమితంగా తాగితే ఇది కూడా మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రెడ్ వైన్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా దీనిలో రెస్వెరాట్రాల్ ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో మీకు గుండె జబ్బులొచ్చే ముప్పు తప్పుతుంది.
రెడ్ వైన్ లో శోథ నిరోధక లక్షణాలు కూడా ఉంటాయి. మీకు తెలుసా? రెడ్ వైన్ ను లిమిట్ లో తాగితే టైప్ 2 డయాబెటీస్, వయసు సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా దీన్ని మోతాదులోనే తాగితేనే ప్రయోజనాలు పొందుతారని వెబ్ఎండీ తెలుపుతోంది. అతిగా తాగితే ప్రయోజనాలకు బదులుగా ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు రెడ్ వైన్ ను లిమిట్ లో తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Red wine
కాలెయ ఆరోగ్యం
బీర్ లేదా ఆల్కాహాల్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని నాలుగు రెట్లు పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే రెడ్ వైన్ ను తాగితే మీ కాలెయం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఇది కాలెయానికి ఎలాంటి హానీ చేయదు. అలాగే కాలెయ ప్రమాదాలన్ని కూడా తగ్గిస్తుంది.
రొమ్ము క్యాన్సర్
వెబ్ఎండీ ప్రకారం.. రెడ్ వైన్ లో రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే, ప్రొస్టేట్ క్యాన్సర్ కణాలు పెరుగుదలను అణిచివేసే ఫినోలిక్ రసాయనాలు ఉంటాయి. అంతేకాదు ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఒత్తిడిని తగ్గిస్తుంది
రెడ్ వైన్ లో ఒత్తిడిని తగ్గించే పదార్థం కూడా ఉంటుంది. అంతేకాదు ఇది డీఎన్ఏను మరమ్మత్తు చేసే కణితి జన్యు అణిచివేతకు, ముడతల నివారణకు కారణమయ్యే జన్యువులను సక్రియం కూడా చేస్తుంది. ఎన్ఐహెచ్ ప్రకారం.. ప్రతిరోజూ ఒక గ్లాస్ రెడ్ వైన్ ను పడుకునే ముందు తాగితే ఒత్తిడి తగ్గుతుంది. అయితే ఇది కడుపులో పెరుగుతున్న బిడ్డకు హాని కలిగిస్తుంది. కాబట్టి దీన్ని గర్భిణులు తాగకూడదు. ఏ రకమైన ఆల్కహాల్ అయినా సరే తల్లులు తాగకూడదు.
మెరుగైన నిద్ర
ద్రాక్ష నుంచి తయారుచేసే రెడ్ వైన్ మీ ఆరోగ్యానికి మంచి మేలు చేస్తుంది. దీనిలో మీ మెదడులోని పీనియల్ గ్రంథి ఉత్పత్తి చేసే మెలటోనిని అనే హార్మోన్ ను పెంచే లక్షణాలు ఉంటాయి. ఇది మీరు ప్రశాంతంగా పడుకోవడానికి సహాయపడుతుంది.
Red wine is best for health if consumed in moderation
బలమైన ఎముకలు
రెడ్ వైన్ లో రెస్వెరాట్రాల్ ఉంటుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయని వెబ్ఎండీ పేర్కొంది. ఇది జీవక్రియ సిండ్రోమ్ సమస్య ఉన్న మగవారిలో వెన్నెముక ఎముక సాంద్రతను పెంచడానికి, ఎముక ఏర్పడే కణాలను ప్రోత్సహిస్తుంది. దీంతో ఎముకల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం తగ్గుతుంది.