తెల్ల జుట్టును నల్లగా చేసే అద్భుతమైన నూనె.. ఇంట్లోనే ఈజీగా...
జుట్టు మొత్తం తెల్ల బడిన తరువాత నివారణ మార్గాలు వెతకడం కంటే.. తెల్లవెంట్రుకలు కనిపించగానే నివారణోపాయాలు మొదలుపెట్టాలి.
మీ జుట్టు తెల్లబడుతోందా? జెట్టు తెల్ల బడడం మొదలవ్వగానే దాన్ని ఆపడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు.
జుట్టు మొత్తం తెల్ల బడిన తరువాత నివారణ మార్గాలు వెతకడం కంటే.. తెల్లవెంట్రుకలు కనిపించగానే నివారణోపాయాలు మొదలుపెట్టాలి.
కొన్ని రకాల నూనెలు మీ తెల్లజుట్టును మరింత తెల్లగా మారకుండా కాపాడుతుంది. దీనివల్ల జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది.
దీనికోసం కొన్ని రకాల పదార్థాలతో నూనెలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
3,4 ఉసిరికాయ ముక్కలు తీసుకోవాలి.
4 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె.
గుప్పెడు కరివేపాకులు
తయారు చేసే విధానం.. ఉసిరి, కరివేపాలకు కొబ్బరినూనెలో వేసి ఓ పాన్ లో 15 నిమిషాల పాటు వేడి చేయాలి. తరువాత మంట ఆర్పేసి, చల్లారనివ్వాలి.
చల్లారాక నూనె వడకట్టి గాజు జార్ లో భద్రపరచుకోవాలి.
రోజు విడిచి రోజు ఈ నూనెను తలకు రాసుకోవాలి. అంతేకాదు రాసుకున్నప్పుడు తలకు మసాజ్ చేయాలి. గంట తరువాత షాంపూతో తలస్నానం చేయాలి.