Goli soda: మనం మరిచిన గోలీ సోడా కొత్తగా వస్తోంది.. అమెరికా, యూరప్, గల్ఫ్‌లో కూడా హవా
గోలీ సోడా ఈ తరం వారికి ఈ పేరు పెద్దగా తెలియకపోయినప్పటికీ 80,90లో వారికి మాత్రం ఫేవరేట్ డ్రింక్. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా గోలీ సోడాను తాగేవారు. సోడా బాటిల్‌లో ఉండే గోలీని నొక్కగానే 'టప్' అనే శబ్ధం రావడం, రుచి కూడా బాగుండడంతో చాలా మంది ఇష్టంగా తాగేవారు..
- FB
- TW
- Linkdin
Follow Us
)
Golisoda
80,90లలో దేశంలో ఎక్కువ మంది ఇష్టపడ్డ ఈ పానీయం క్రమంగా కనుమరుగవుతూ వచ్చింది. ముఖ్యంగా 2000 ఏడాది తర్వాత గోలీ సోడాలు మార్కెట్లో క్రమంగా కనిపించకుండా పోయాయి. అయితే ఇటీవల గోలీ సోడా ట్రెండ్ మళ్లీ మొదలైంది. కొంత మంది యువకులు స్టార్టప్ పేరుతో గోలీ సోడా తయారీ యూనిట్‌ను ప్రారంభిస్తున్నారు. ప్రజలు సైతం పెద్ద ఎత్తున వీటిని ఇష్టపడుతున్నారు. అయితే కేవలం దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా గోలీ సోడాకు డిమాండ్ పెరుగుతోంది.
Goli soda sales
ఒకప్పుడు మన దేశంలో ఎంతగానో ప్రాచుర్యం పొందిన ఫుడ్, డ్రింక్స్‌కి ఇప్పుడు మళ్లీ వైభవం వస్తోంది. మరీ ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా వీటికి గుర్తింపు వస్తోంది. దోషా, సమోసా వంటి వాటికి ఇతర దేశాల్లో ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తాజాగా గోలీ సోడా కూడా ఈ జాబితాలో చేరింది.