Telugu

ఇంట్లోనే వెల్లుల్లి ఇలా సింపుల్‌గా పెంచేయండి

Telugu

పెద్ద రెబ్బలు ఎంచుకోండి

ఇంట్లో ఉన్న వెల్లుల్లి గడ్డను వలిచి  అందులో నుంచి పెద్దగా, బలంగా ఉన్న రెబ్బలను ఎంపిక చేసుకోవాలి.

Image credits: Getty
Telugu

మట్టి రెడీ చేసుకోండి

వెల్లుల్లిని పెంచాలంటే నీరు ఎక్కువగా మట్టిని ఎంపిక చేసుకోవాలి. మట్టిలో తగినంత ఎరువు కలిపి బాగా మిక్స్ చేయాలి.

Image credits: Getty
Telugu

ఎలాంటి కుండీ?

మీరు కుండీ వెల్లుల్లిని నాటుతుంటే మట్టిలో రెబ్బలు కనీసం 6 నుంచి 8 అంగుళాల లోతున ఉంచాలి.  నీరు సులభంగా బయటకు పోయేలా కుండీకి కింద కచ్చితంగా రంధ్రం ఉండేలా చూసుకోండి.

Image credits: Getty
Telugu

రెబ్బల మధ్య దూరం

వెల్లుల్లి రెబ్బ మొనదేలిన భాగం పైకి మొదలు భాగం మట్టిలో ఉండేలా నాటాలి. రెబ్బల మధ్య 4 నుంచి 6 అంగుళాల దూరం ఉండేలా చూసుకోవాలి.

Image credits: Getty
Telugu

సూర్యరశ్మి తగిలేలా

రెబ్బలను మరీ లోతుగా మట్టిలో నాటకూడదు… జస్ట్ మట్టితో కప్పితే సరిపోతుంది. మంచి సూర్యరశ్మి తగిలే చోట మొక్కను పెంచాలి. 

Image credits: Getty
Telugu

గడ్డిని పరిచి

కుండీలో వెల్లుల్లి రెబ్బలను నాటిన తర్వాత ఆ మట్టిపై ఎండుటాకులు లేదా గడ్డిని పరచాలి. ఇది మట్టిలో తేమను నిలిపి ఉంచుతుంది.

Image credits: Getty
Telugu

నీరు వేయద్దు

వెల్లుల్లి రెబ్బలు బాగా పెరిగిన తరువాత  రెండు వారాల ముందు నుంచి నీరు పోయడం పూర్తిగా ఆపేయాలి. దీనివల్ల వెల్లుల్లి ఎక్కువ కాలం పాడవకుండా నిల్వ ఉంటుంది.

Image credits: Getty
Telugu

పంట కోత

వెల్లుల్లి రెబ్బలు నాటిన 4 నుంచి 5 నెలల్లో వెల్లుల్లిని కోతకు వస్తుంది. మొక్క కింది ఆకులు పసుపు రంగులోకి మారి, ఎండిపోవడం మొదలైనప్పుడు పంటను కోయాలి.

Image credits: Getty

Money Plant: ఇదొక్క పొడి వేస్తే మనీ ప్లాంట్ బాగా పెరుగుతుంది..!

Garlic: ఈ సింపుల్ టిప్స్ తో వెల్లుల్లిని ఇంట్లోనే ఈజీగా పెంచవచ్చు!

Curry Leaves: ఈ ట్రిక్స్ తో కరివేపాకు మొక్కను కుండీలో ఈజీగా పెంచవచ్చు!

Indoor Plants: ఇంట్లో మొక్కలు వాడిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి