Bala Krishna: బాలయ్య ఫేవరేట్ ఫుడ్ ఏంటో తెలుసా?
తాను ఈ వయసులోనూ ఇంత ఫిట్ గా, ఉత్సాహంగా ఉండటానికి ఈ ప్రొడక్షన్ హౌస్ ఫుడ్ కారణమని చెప్పడం కొసమెరుపు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Balakrishna
సినిమా ఇండస్ట్రీలో ఉండే తారలు తమ ఫిట్‌నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. బరువు పెరగకుండా ఉండేందుకు, ఫిట్ గా కనిపించాలని లో క్యాలరీ ఫుడ్స్ తీసుకోవడం, ఎప్పుడూ ఏదో ఒక డైట్ ఫాలో అవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు.అందుకే, వారు ఎన్ని సంవత్సరాలు అయినా ఫేస్ లో గ్లో తగ్గకుండా, అందంగా కనపడుతూ ఉంటారు. ముఖ్యంగా అన్నం తక్కువగా తింటూ ఉంటారు. కానీ, నట సింహం బాలకృష్ణ మాత్రం అందుకు విరుద్ధం.
బాలయ్య ఏం తింటారు?
ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ తన ఫేవరేట్ ఫుడ్ ఏంటో స్వయంగా చెప్పారు. ఆయన సినిమా షూటింగ్ లో ప్రొడక్షన్ హౌస్ లో ఏ ఫుడ్ పెడితే దానినే ఇష్టంగా తింటానని చెప్పడం విశేషం. నిజానికి, బాలయ్యకు కావాలంటే స్పెషల్ గా ఇంటి నుంచే క్యారేజ్ తెప్పించుకోవచ్చు. కానీ, ఆయన మాత్రం అలా తెప్పించుకోరు. ప్రొడక్షన్ ఫుడ్ ని ఇష్టంగా తింటారు. తన ఇంటికి దగ్గరలో షూటింగ్ జరుగుతున్నా కూడా.. ఇంటి నుంచి భోజనం తెప్పించుకోనని, ఇంట్లో వండిన భోజనం కంటే ప్రొడక్షన్ ఫుడ్‌ను ఇష్టపడతానని అన్నారు. తన భార్య వసుంధర దేవి ఈ ఈ విషయంలో తనను తిడుతూ ఉంటుందని, కానీ తాను మాత్రం ఆ అలవాటు మార్చుకోలేదని చెప్పడం విశేషం.
బాలయ్య డైట్
తాను ఈ వయసులోనూ ఇంత ఫిట్ గా, ఉత్సాహంగా ఉండటానికి ఈ ప్రొడక్షన్ హౌస్ ఫుడ్ కారణమని చెప్పడం కొసమెరుపు. స్పెషల్ గా తాను ఎలాంటి డైట్ ఫాలో అవ్వను అని చెప్పారు.
అఖండ2
ఇదిలా ఉండగా, ప్రస్తుతం బాలకృష్ణ,బోయపాటి డైరెక్షన్ లో అఖండ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ చేయగా.. విపరీతంగా అభిమానులను ఆకట్టుకుంటోంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.