నట సింహం బాలకృష్ణకు ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలయ్య పుట్టిన రోజు నేడు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకు సంబంధించి విడుదలైన ఓ యాడ్ వీడియో వైరల్ అవుతోంది.
ప్రముఖ మద్యం బ్రాండ్ మాన్షన్ హౌస్ తాజాగా విడుదల చేసిన యాడ్ వీడియోలో నందమూరి బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పవర్ ప్యాక్డ్ డైలాగ్‌తో ఆయన ఎంట్రీ అభిమానులను ఊపేస్తోంది. "ఒక్కసారి నేను అడుగుపెడితే..." అంటూ ఆయన చెప్పిన లైనే ఈ యాడ్‌ను మరింత ఘనంగా మలిచింది.
సినిమాటిక్ టచ్
ఈ ప్రోమో వీడియోను మాన్షన్ హౌస్ తమ అధికారిక యూట్యూబ్ చానెల్‌లో పోస్ట్ చేసింది. వీడియో కాప్షన్‌లో.. "ఒక పురాతన తాళం చెవి, ఓ రాయల్ సింహాసనం, అపార శక్తితో కూడిన ఒక పురాణ గాధ. ఈసారి స్వాగతం మామూలుగా ఉండదు. సినిమాటిక్ పేలుడు రాబోతోంది... ఇది ఎన్‌బీకే అభిమాన గృహానికి చేరుతుంది అని రాసుకొచ్చారు.
ఈ యాడ్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బాలయ్య ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్‌ను మెచ్చుకుంటూ అభిమానులు ట్వీట్లు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రత్యేకంగా ఆయన డైలాగ్ డెలివరీ, యాడ్ లుక్‌పై పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.
మాన్షన్ హౌస్ యాడ్ బాలకృష్ణకు హాలీవుడ్ స్టైల్ ఇంట్రోను ఇచ్చింది. ఈ యాడ్ ద్వారా ఆయన మాస్ ఇమేజ్ మరోసారి హైలైట్ అయింది. ఈ వీడియో చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు.