- Home
- Entertainment
- Nandamuri Balakrishna : బాలకృష్ణకి ఇష్టమైన ముగ్గురు హీరోయిన్లు ఎవరో తెలుసా.. అందరూ అప్పటి వాళ్లే..
Nandamuri Balakrishna : బాలకృష్ణకి ఇష్టమైన ముగ్గురు హీరోయిన్లు ఎవరో తెలుసా.. అందరూ అప్పటి వాళ్లే..
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2లో నటిస్తున్నారు. ఈ ఏడాది బాలయ్యకి కెరీర్ పరంగా, పర్సనల్ గా గ్రాండ్ గా ప్రారంభం అయింది. డాకు మహారాజ్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య, పద్మభూషణ్ అవార్డుకి కూడా ఎంపికయ్యారు.

Nandamuri Balakrishna
Nandamuri Balakrishna favourite heroines: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2లో నటిస్తున్నారు. ఈ ఏడాది బాలయ్యకి కెరీర్ పరంగా, పర్సనల్ గా గ్రాండ్ గా ప్రారంభం అయింది. డాకు మహారాజ్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య, పద్మభూషణ్ అవార్డుకి కూడా ఎంపికయ్యారు. దశాబ్దాలుగా తెలుగు సినిమా రంగంలో అందిస్తున్న సేవలకు బాలయ్యకి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది.
తన సోదరుడికి పద్మ భూషణ్ అవార్డు దక్కడంతో నారా భువనేశ్వరి రీసెంట్ గా గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి సీఎం చంద్రబాబుతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తాతమ్మ కల చిత్రంతో బాలయ్య నటుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి ఎన్నో విజయాలు అందుకున్నారు. ఎంతో మంది హీరోయిన్లతో బాలయ్య కలసి నటించారు.
Ramya Krishnan
ఈ పార్టీలో నారా భువనేశ్వరి తన సోదరుడిని కొన్ని ప్రశ్నలు సరదాగా అడిగారు. కెరీర్ లో నీకు ఇష్టమైన ముగ్గురు హీరోయిన్లు ఎవరు అని భువనేశ్వరి అడిగారు. దీనితో బాలయ్య సమాధానం ఇస్తూ ముగ్గురు క్రేజీ హీరోయిన్ల పేర్లు చెప్పారు. ఇప్పటి తరం హీరోయిన్లు ఒక్కరు కూడా లేరు.
Vijayashanthi
విజయశాంతి, రమ్యకృష్ణ, సిమ్రాన్ తన కి ఇష్టమైన హీరోయిన్లు అని బాలయ్య పేర్కొనడం విశేషం. వీరి ముగ్గురితో బాలయ్య అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. విజయశాంతితో బాలయ్య లారీ డ్రైవర్, ముద్దుల మావయ్య, రౌడీ ఇన్స్పెక్టర్, మువ్వా గోపాలుడు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఇక రమ్యకృష్ణతో బంగారు బుల్లోడు, దేవుడు, వంశానికొక్కడు లాంటి చిత్రాల్లో నటించారు.
Simran
సిమ్రాన్ తో అయితే బాలయ్య తన కెరీర్ బెస్ట్ చిత్రాల్లో నటించడం విశేషం. సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు చిత్రాల్లో సిమ్రాన్, బాలయ్య కలసి నటించారు.