Headache: ఈ పండ్లు తిన్నారంటే తలనొప్పి త్వరగా తగ్గిపోతుంది
Headache: తలనొప్పితో బాధపడేవారు ఎక్కువ. పనిభారం, నిద్రలేమి, అధిక ఒత్తిడి వంటి కారణాల వల్ల తలనొప్పి వస్తుంది. తలనొప్పి కొన్నిసార్లు వారాలపాటు కొనసాగితే దాన్ని మైగ్రేన్ తలనొప్పిగా పరిగణించాలి. కొన్ని పండ్లు తలనొప్పిని తగ్గిస్తాయి.

తలనొప్పిని తగ్గించే పండ్లు
తలనొప్పి వచ్చిందంటే తట్టుకోవడం చాలా కష్టం. కొంతమందికి ఒత్తిడి, నిద్రలేమి వల్ల తీవ్రంగా తలనొప్పి వస్తుంది. ఈ తలొనప్పి కొన్ని వారాల పాటు కొనసాగితే అది మైగ్రేన్‌గా మారిపోతుంది. నీరు తక్కువగా తాగడం, తీవ్రంగా ఒత్తిడి పడడం వంటివి తలనొప్పికి కారణాలు. ఈ తలనొప్పిని మందులు వాడడం ద్వారానే కాదు కొన్ని రకాల పండ్లు తింటే త్వరగా తగ్గుతుంది.
పుచ్చకాయ
అతి తక్కువ ధరకే దొరికే పండ్లలో పుచ్చకాయ కూడా ఒకటి. మైగ్రేన్‌తో బాధపడేవారికి పుచ్చకాయ ఎంతో మేలు చేస్తుంది. ఈ పండులో నీటిశాతం అధికంగా ఉంటుంది. పుచ్చకాయ తలనొప్పిని తగ్గించడంలో కండరాలకు విశ్రాంతినిస్తుంది. దీనిలో పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది తలనొప్పిని తగ్గిస్తాయి.
అరటిపండు
రోజుకో అరటిపండు తింటే ఎంతో మంచిది. ఇవి ఆరోగ్యానికి అవసరమైన పండ్లు. అరటిపండ్లు శరీరానికి పోషకాలను అందిస్తాయి. ఇవి రోగాలతో పోరాడే శక్తిని అందిస్తాయి. అరటిపండ్లలో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇవి మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి.
ఆపిల్
ఆపిల్ ఒక్కటి ప్రతిరోజూ తింటే చాలు వైద్యులను కలవాల్సిన అవసరం ఉండదని అంటారు. దీనిలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, పెక్టిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మంచివి. ఈ పండు మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడంలో ముందుంటుంది. తలనొప్పి, వికారం, వాంతులు వంటి లక్షణాలను కూడా ఆపిల్ పండ్లు తగ్గిస్తాయి.
అవకాడో
అవకాడోలో పోషకాలు అధికంగా. మైగ్రేన్‌తో బాధపడేవారికి అవకాడో ఎంతో ఉపయోగపడుతుంది. ఇది తలనొప్పి, మైగ్రేన్ లక్షణాలను చాలా వరకు తగ్గిస్తుంది. ఇందులోని విటమిన్లు, పొటాషియం, ఫోలేట్ వంటివి కూడా తలనొప్పిని తగ్గించడంలో ఇవి ముందుంటాయి.
యోగా ధ్యానం
కేవలం పండ్లను తింటే సరిపోదు.. తలనొప్పి తగ్గాలంటే యోగా ధ్యానం వంటివి కూడా చేయాలి. చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ ఉండాలి. ఈ పండ్లతో పాటు సమతుల్య, పౌష్టికాహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని కూడా పాటించాలి.

