చాలా మంది పండ్లు ఆరోగ్యానికి మంచిదే కదా అని కట్ చేసి అమ్మేవి కూడా కొంటూ ఉంటారు. కానీ, కోసి అమ్మే పండ్లు మంచిది కాదు. వాటిలో క్రిములు ఉండే అవకాశం ఉంది.
పోషకాలున్న ఆహారం తినడం మంచిదే అయినా, బయట నుంచి ఇలాంటివి తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అవి తాజాగా లేకపోతే రోగాలు వచ్చే అవకాశం ఉంది.
బయట తినేటప్పుడు వేడి ఆహారాలు కొనడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వాటిలో క్రిముల ఉనికి తక్కువగా ఉంటుంది.
నీటి ద్వారా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఎక్కువ. కాబట్టి శుభ్రమైన నీటిని మాత్రమే కొని తాగడానికి ప్రాధాన్యం ఇవ్వండి.
బయటకు వెళ్ళినప్పుడు స్ట్రీట్ ఫుడ్ తినే అలవాటు అందరికీ ఉంటుంది. శుభ్రమైన ప్రదేశాల నుండి ఇలాంటి ఆహారాలు తినడానికి జాగ్రత్త వహించండి.
బయటకు వెళ్లేటప్పుడు శానిటైజర్, వెట్ వైప్స్ వంటివి చేతిలో ఉంచుకోవడం మంచిది. చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం వల్ల క్రిములు వ్యాపించకుండా ఉంటాయి.
బయట నుంచి ఆహారం కొనేటప్పుడు రంగులో లేదా వాసనలో తేడాలు గమనిస్తే జాగ్రత్తగా ఉండాలి. అలాంటి ఆహారం తినడం మానుకోండి.