- Home
- Life
- Avoid Sugar: నెల రోజులు షుగర్ ఫ్రీ ఛాలెంజ్ తీసుకోండి.. పంచదార మానేస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి
Avoid Sugar: నెల రోజులు షుగర్ ఫ్రీ ఛాలెంజ్ తీసుకోండి.. పంచదార మానేస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి
Avoid Sugar: పంచదారను పూర్తిగా మానేయడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు కనిపిస్తాయి. టీ, కాఫీలలో కూడా పంచదార కూడా వేసుకోకుండా తాగితే ఎంత ఆరోగ్యమో. కేవలం 30 రోజులు పంచదార మానేసి చూడండి చాలు.

పంచదార 30 రోజులు మానేయండి చాలు
మన రోజువారీ ఆహారంలో పంచదార భాగమైపోయింది. ఉదయాన లేవగానే టీ, కాఫీలలో పంచదార వేసుకుని రోజును మొదలుపెడతారు. అలాగే స్వీట్స్, కేక్, జ్యూస్, బ్రెడ్ ఇలా చాలా ఆహారాల్లో పంచదార భాగమైపోయింది. ఎన్నో ఆహారాల్లో చక్కెర ఉంటుంది. అది మనకు తెలియకుండానే శరీరంలో చేరిపోతుంది. కానీ ఈ షుగర్‌ను 30 రోజుల పాటు తీసుకోకుండా ఉంటే శరీరంలో ఎన్నో మంచి మార్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. షుగర్ ఫ్రీ ఛాలెంజ్ తీసుకుని చూడండి. ఒక్క నెల పాటు రిఫైన్డ్ షుగర్‌ను పూర్తిగా మానేస్తారు. ఇది శరీరానికి అనేక లాభాలను అందిస్తుంది.
బరువు తగ్గుతారు
షుగర్‌లో ఎక్కువ కేలరీలు ఉండే అవకాశం ఉంది. కానీ ఇందులో పోషక విలువలు మాత్రం చాలా తక్కువ. రోజూ తీసుకునే టీ, కాఫీ, జ్యూస్‌లలో చక్కెరను వేసుకోవడం మానేస్తే శరీరానికి అదనంగా వచ్చే కేలరీలు తగ్గిపోతాయి. దాంతో శరీరంలో నిల్వగా ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గడం మొదలవుతుంది. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఇది పెద్ద ఎంతో సహాయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
చర్మానికి మెరుపు
చాలామందికి షుగర్ తింటే వెంటనే ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ ఆ ఎనర్జీ తాత్కాలికమే. కొద్దిసేపటికి మళ్లీ శరీరం అలసిపోవడం సాధారణం. కానీ షుగర్‌ను వదిలేసిన తర్వాత శరీరం సహజంగా, స్థిరంగా శక్తిని విడుదల చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దాంతో రోజంతా ఫ్రెష్‌గా, యాక్టివ్‌గా ఉంటారు. పంచదార తినడం వల్ల శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెరిగి చర్మంపై మొటిమలు, జిడ్డు, డల్ లుక్‌ను కలిగిస్తుంది. షుగర్‌ను ఒక నెల పాటు తీసుకోకుండా ఉంటే చర్మం సహజంగా మెరవడం, మొటిమలు తగ్గడం వంటి మార్పులు కనిపిస్తాయి. కొందరికి ముఖం పైన కనబడే చిన్న దద్దుర్లు కూడా తగ్గిపోతాయని వైద్యులు చెబుతున్నారు.
మెదడుకు మంచిది
మెదడు పనితీరుపై కూడా పంచదార చెడు ప్రభావం చూపిస్తుంది. పంచదార తగ్గించడం వల్ల మంచి ప్రభావం కలుగుతుంది. అధిక చక్కెర తీసుకోవడం వల్ల బ్రెయిన్ ఫాగ్ అనే సమస్య ఎదురవుతుంది. అంటే మనసు స్పష్టంగా పనిచేయకపోవడం, ఏకాగ్రత తగ్గడం. షుగర్ వదిలేస్తే మెదడు చురుకుగా పనిచేసి పని మీద ఫోకస్ పెరుగుతుంది. అనవసర ఆందోళన, ఇబ్బందికర భావనలు కూడా తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. షుగర్ ఎక్కువ తీసుకుంటే శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దాంతో నిద్ర లోపం, మధ్యలో మెలుకువలు రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. షుగర్ తీసుకోకపోతే రాత్రి నిద్ర క్వాలిటీ పెరుగుతుంది.
మధుమేహం రాదు
రక్తంలో షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉండాలంటే పంచదార వదిలేయాలి. షుగర్ మానేయడం వల్ల ఇన్సులిన్ లెవెల్స్ స్థిరంగా అవుతాయి. దీని వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇప్పటికే మధుమేహం ఉన్నవారికి కూడా ఇది చాలా ఉపయోగకరం. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా ఇది మంచిదే. అధిక షుగర్ వాడకం గుండె సంబంధిత సమస్యలను పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రిఫైన్డ్ షుగర్ డోపమైన్ అనే హార్మోన్‌ను ఒక్కసారిగా పెంచి తర్వాత తగ్గిస్తుంది. దాంతో స్ట్రెస్ ఎక్కువ కావడం జరుగుతుంది. షుగర్‌ను వదిలేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నెల రోజుల పాటు మాత్రమే షుగర్‌ను మానితే శరీరం, మనసు రెండింటిలోనూ అద్భుతమైన మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

