MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Woman
  • జుట్టు ఒత్తుగా పెరగడానికి డాక్టర్లు సూచిస్తున్న 5 బెస్ట్ టిప్స్ ఇవిగో!

జుట్టు ఒత్తుగా పెరగడానికి డాక్టర్లు సూచిస్తున్న 5 బెస్ట్ టిప్స్ ఇవిగో!

జుట్టు నల్లగా, ఒత్తుగా ఉండాలని కోరుకోని వారు ఎవరు ఉంటారు చెప్పండి. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి రకరకాల ప్రోడక్టులు వాడుతుంటారు. వేల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. కానీ ఇంట్లో దొరికే కొన్ని సహజ పదార్థాలతో జుట్టు ఒత్తుగా పెరిగేలా చేయవచ్చని మీకు తెలుసా?

2 Min read
Author : Kavitha G
Published : Nov 21 2025, 04:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి చిట్కాలు
Image Credit : Getty

జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి చిట్కాలు

జుట్టు అందానికి ప్రతీక. నల్లని ఒత్తైన జుట్టు కోసం అమ్మాయిలు చేయని ప్రయత్నాలు ఉండవు. వాడని ప్రోడక్టులు ఉండవు. వేల రూపాయలు ఖర్చుచేసి హెయిర్ ప్రోడక్టులను కొని వాడుతుంటారు. వాటివల్ల కొన్నిసార్లు మేలు జరగకపోగా.. హాని జరిగే అవకాశం ఉంది. అందుకే డాక్టర్లు, నిపుణులు జుట్టు పెరుగుదలకు సహజ పదార్థాలను ఉపయోగించాలని చెబుతుంటారు. నిపుణుల సూచనల ప్రకారం జుట్టు ఆరోగ్యానికి సహాయపడే కొన్ని చిట్కాలు మీకోసం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
గుడ్డు, నిమ్మరసం
Image Credit : Getty

గుడ్డు, నిమ్మరసం

గుడ్డులో నిమ్మరసం కలిపి వారానికి ఒకసారి జుట్టుకు రాస్తే అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. గుడ్డులో ఉండే సహజ ప్రోటీన్, విటమిన్లు, ఫ్యాటీ యాసిడ్లు జుట్టును లోపలి నుంచి బలంగా చేస్తాయి. దానివల్ల జుట్టు రాలడం, విరిగిపోవడం తగ్గుతుంది. నిమ్మరసం‌లో ఉండే ఆమ్లత్వం తలపై ఉన్న ధూళి, ఆయిల్, చుండ్రును తగ్గించి స్కాల్ప్‌ను శుభ్రం చేస్తుంది.

36
ఆముదం నూనెతో తలపై మసాజ్
Image Credit : our own

ఆముదం నూనెతో తలపై మసాజ్

ఆముదం నూనెతో వారానికి ఒకసారి 30 నిమిషాల పాటు జుట్టుకు మసాజ్ చేస్తే రక్తప్రసరణ మెరుగవుతుంది. దానివల్ల జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషకాలు అందుతాయి. జుట్టు దృఢంగా, ఆరోగ్యంగా మారుతుంది. ఆముదం నూనెలో ఉండే సహజ ప్రోటీన్లు, ఫ్యాటీ యాసిడ్లు పొడిబారిన జుట్టుకు తేమను అందిస్తాయి. 

46
ఉల్లిపాయ రసం
Image Credit : Istock

ఉల్లిపాయ రసం

ఆనియన్ జ్యూస్‌ను వారానికి రెండు సార్లు స్కాల్ప్‌పై సున్నితంగా మసాజ్ చేస్తే జుట్టుకు అనేక రకాలుగా మేలు జరుగుతుంది. ఉల్లిపాయ రసంలో ఉండే సల్ఫర్ తలపై చర్మంలో రక్తప్రసరణను పెంచి, జుట్టు కుదుళ్లను చురుకుగా మారుస్తుంది. అంతేకాదు కుదుళ్లకు అవసరమైన పోషకాలు సులభంగా అందడం వల్ల జుట్టు వేగంగా, దృఢంగా పెరుగుతుంది. ఉల్లిపాయ రసం యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండటం వల్ల చుండ్రు, దురద, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. జుట్టు సహజంగా మెరుస్తుంది.

56
మెంతుల పేస్ట్, కొబ్బరినూనె
Image Credit : Getty

మెంతుల పేస్ట్, కొబ్బరినూనె

మెంతుల పేస్టులో కొబ్బరినూనె కలిపి వారానికి ఒకసారి జుట్టుకు రాయడం వల్ల జుట్టుకు మేలు జరుగుతుంది. మెంతుల్లో ఉండే ప్రోటీన్లు, నికోటినిక్ ఆమ్లం, లెసితిన్ వంటి పోషకాలు కుదుళ్లను బలపరచి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి. కొబ్బరినూనెలో ఉన్న ఫ్యాటీ యాసిడ్లు జుట్టు చిట్లడాన్ని తగ్గిస్తాయి. మెంతులలోని సహజ యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ-డ్యాండ్రఫ్ లక్షణాలు స్కాల్ప్‌ను శుభ్రంగా ఉంచి చుండ్రు, దురద వంటి సమస్యలను తగ్గిస్తాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. 

66
అలోవెరా జెల్, తేనె
Image Credit : our own

అలోవెరా జెల్, తేనె

అలోవెరా జెల్, తేనె కలిపి వారానికి ఒకసారి జుట్టుకు రాయడం వల్ల జుట్టు బలంగా మారుతుంది. అలోవెరాలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, ఎంజైములు స్కాల్ప్‌ను శాంతింపజేసి దురద, ఇన్‌ఫ్లమేషన్, పొడిబారడం వంటి సమస్యలను తగ్గిస్తాయి. జుట్టు రూట్స్‌ను తేమగా ఉంచి ఆరోగ్యకరమైన పెరుగుదలకు సహాయపడతాయి. తేనెలోని సహజ గుణాలు జుట్టును తేమగా, సిల్కీగా ఉంచుతాయి. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
చిట్కాలు మరియు ఉపాయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Related Stories
Recommended image1
కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా? ఈ 5 టిప్స్ ఫాలో అయితే చాలు
Recommended image2
పిల్లల కోసం హెల్తీ లంచ్ బాక్స్ ఐడియాస్ ఇవిగో..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved