MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Alcohol: ఆల్కహాల్ తాగేటప్పుడు సైడ్ డిష్‌గా వీటిని మాత్రం తినకండి

Alcohol: ఆల్కహాల్ తాగేటప్పుడు సైడ్ డిష్‌గా వీటిని మాత్రం తినకండి

Alcohol: ఆల్కహాల్ ప్రేమికులు తాగేటప్పుడు పక్కన కచ్చితంగా తినేందుకు సైడ్ డిష్ పెట్టుకుంటారు. ఒక్కొక్కరూ తమకు నచ్చిన ఆహారాలను ఎంపిక చేసుకుంటారు. కానీ కొన్ని ఆహారాలు ఆల్కహాల్ తో కలిపి తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి.

2 Min read
Author : Haritha Chappa
Published : Dec 24 2025, 10:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆల్కహాల్ తాగేటప్పుడు ఏవి తినకూడదు?
Image Credit : Asianet News

ఆల్కహాల్ తాగేటప్పుడు ఏవి తినకూడదు?

ఆల్కహాల్ తాగేటప్పుడు చాలామంది దానితో పాటు సైడ్ డిష్‌లు తింటూ ఉటారు. రుచి కోసం, మత్తు తగ్గుతుందన్న భావనతో అనేక రకాల ఆహారాలను తీసుకుంటారు. కానీ లిక్కర్ శరీరంపై చూపే ప్రభావం ఎక్కువ. ఇక దానితో పాటూ తినే ఆహారం కూడా శరీరంపై ఎక్కువ ప్రభావాన్నే చూపిస్తుంది. కొన్ని ఆహారాలు మద్యం ప్రభావాన్ని మరింత పెంచి ఆరోగ్యానికి నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పొట్ట, కాలేయం, గుండె, మెదడు వంటి అవయవాలపై చెడు ప్రభావం పడుతుంది. అందుకే ఆల్కహాల్ తీసుకునే సమయంలో ఏ ఆహారాలను తినకూడదో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సమోసాలు, పకోడీలు...
Image Credit : Getty

సమోసాలు, పకోడీలు...

ఆల్కహాల్ తాగేటప్పుడు వేయించిన ఆహారాలు తినడం ఏమాత్రం మంచిది కాదు. సమోసాలు, పకోడీలు, బజ్జీలు, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ ఫ్రై లాంటి నూనె ఎక్కువగా ఉన్న పదార్థాలు జీర్ణక్రియను నెమ్మదిగా చేస్తాయి. లిక్కర్ వల్ల కాలేయంపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఇక ఈ నూనెతో వండిన ఆహారాలు ఆల్కహాల్ తో కలిసి శరీరం వాటిని జీర్ణించలేక ఇబ్బంది పడుతుంది. పొట్టలో భారంగా అనిపించడం, గ్యాస్, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు. తరచూ ఇలా తింటూ ఆల్కహాల్ తాగితే కాలేయ కొవ్వు పెరగడం, కాలేయ పనితీరు తగ్గడం వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే నూనెతో చేసిన ఆహారాలు లిక్కర్ తాగే సమయంలో మంచివి కావు.

35
కారంగా ఉండే ఆహారాలు
Image Credit : Getty

కారంగా ఉండే ఆహారాలు

కారం ఎక్కువగా ఉన్న ఆహారాలను ఆల్కహాల్ తో పాటూ తినేందుకు ఇష్టపడతారు. పచ్చిమిర్చి, ఎండు మిర్చి, కారం ఎక్కువగా వేసిన కూరలు, స్పైసీ చికెన్ వంటివి తింటే పొట్ట లోపలి పొరను చికాకుపెడతాయి. మద్యం వల్ల కడుపు లోపలి పొర ఇప్పటికే సున్నితంగా మారుతుంది. అలాంటి సమయంలో కారం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే గుండెల్లో మంట, పొట్ట మంట, నొప్పి పెరిగే అవకాశం ఉంటుంది. కొందరికి పొట్టలో పుండ్లు, రక్తస్రావం వంటి సమస్యలు కూడా రావచ్చు. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు, అల్సర్ సమస్యతో బాధపడేవారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

45
కేకులు, స్వీట్లు
Image Credit : Getty

కేకులు, స్వీట్లు

తీపి పదార్థాలు ఆల్కహాల్ తో పాటూ తినడం మంచివి కావు. చాక్లెట్లు, కేకులు, స్వీట్లు లాంటి వాటిలో చక్కెర అధికంగా ఉంటుంది. లిక్కర్ తాగినప్పుడు శరీరంలో చక్కెర స్థాయిలలో మార్పులు వస్తాయి. తీపి ఆహారం తీసుకుంటే మొదట రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది, తర్వాత ఒక్కసారిగా పడిపోవచ్చు. దీని వల్ల తలనొప్పి, అలసట, వణుకు, తల తిరగడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొందరికి ఆల్కహాల్ మత్తు ఎక్కువగా అనిపించడానికి కూడా ఇది కారణం కావచ్చు. డయాబెటిస్ ఉన్నవారు మద్యం సమయంలో తీపి ఆహారాలను పూర్తిగా తప్పుకోవడం చాలా అవసరం.

55
కూల్ డ్రింకులు
Image Credit : Getty

కూల్ డ్రింకులు

కార్బొనేటెడ్ పానీయాలు, సోడాలు, కోలా లాంటి వాటిని కూడా ఆల్కహాల్ తో పాటూ తీసుకోవడం మంచిది కాదు. ఇవి పొట్టలో గ్యాస్ పెంచుతాయి. అంతేకాదు ఆల్కహాల్ శరీరంలోకి త్వరగా చేరేందుకు ఇవి సహాయపడతాయి. దాంతో మత్తు వేగంగా ఎక్కి నియంత్రణ కోల్పోయే పరిస్థితి వస్తుంది. అలాగే ఉప్పు ఎక్కువగా ఉన్న చిప్స్ వంటి స్నాక్స్ కూడా దాహాన్ని పెంచుతాయి. దాంతో మరింత లిక్కర్ తాగాలనే కోరిక కలగవచ్చు. అందుకే లిక్కర్ తీసుకునే వారు తేలికగా జీర్ణమయ్యే ఆహారాలను మాత్రమే పరిమితంగా తీసుకోవాలి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఆహారం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Ring: అమ్మాయిల మనసు దోచే బంగారు ఉంగరం డిజైన్లు
Recommended image2
Weight Loss: ఇవి ఫాలో అయితే నెల రోజుల్లో బరువు తగ్గుతారు
Recommended image3
Marriage Rituals:ఇక్కడ అన్నదమ్ములందరినీ ఒకే అమ్మాయి పెళ్లాడుతుంది.. మహాభారత కాలం నాటి ఆచారం
Related Stories
Recommended image1
Cigarettes: రోజుకు రెండు సిగరెట్ల చొప్పున నెల రోజులు తాగితే ఏమవుతుంది?
Recommended image2
బంగారు ఉంగరం వీరు పెట్టుకోకూడదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved