- Home
- Life
- Spiritual
- Ugadi Festival 2026: ఉగాది రోజున ఈ ఒక్క పని చేయకపోతే… ఏడాది మొత్తం ప్రభావం పడుతుందా?
Ugadi Festival 2026: ఉగాది రోజున ఈ ఒక్క పని చేయకపోతే… ఏడాది మొత్తం ప్రభావం పడుతుందా?
Ugadi Festival 2026: ఉగాది రోజు అంతా పూజలు, ఉగాది పచ్చడి, కొత్తబట్టలు..ఇలా సెలబ్రేషన్స్ లో హడావిడిగా ఉంటారు. కానీ చాలా మంది తెలియకుండా ఓ చిన్న తప్పు చేస్తున్నారు. అదేంటంటే ఈ ఒక్క పనిచేయకపోవడం. పెద్దలు మాత్రం దీన్ని అస్సలు మిస్ అవ్వొద్దని చెబుతారు.

చాలా మంది పట్టించుకోని ఆ విషయం ఏమిటంటే...
ఉగాది రోజున ఈ ఒక్క పని మీ కొత్త ఏడాదిపై ప్రభావం పడుతుందని పండితులు, పెద్దలు చెబుతున్నారు. దీనిపై చాలా మందికి అవగాహన ఉండదు. కానీ పూర్వం నుంచి పాటిస్తున్న ఈ సంప్రదాయం గురించి చెలుసుకుంటే దాని విలువ అర్థమవుతుంది. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు...మన జీవితాన్ని సానుకూలంగా ప్రారంభించేందుకు, వచ్చే ఏడాదిని సరిగ్గా ప్లాన్ చేసుకునేందుకు ఉపయోగపడుతుందని పండితులు అంటున్నారు. అందుకే ఉగాది రోజున దీన్ని తప్పక పాటించాలి. అయితే చాలా మంది పట్టించుకోని ఆ విషయం ఏమిటంటే...పంచాంగ శ్రవణం చేయడం.
జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్పే దిక్సూచి
పంచాంగ శ్రవణం అంటే కొత్త ఏడాదికి సంబంధించిన ఫలితాలు, గ్రహాల ప్రభావం, శుభ ఘడియల గురించి తెలుసుకోవడం. ఇది కేవలం జ్యోతిష్యానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు...మన జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్పే ఒక దిక్సూచి లాంటిది. పంచాంగం వినడం వల్ల ఏ రాశికి ఎలా ఉంటుంది. ఏ నెలలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు శుభకార్యాలు చేయాలి వంటి ముఖ్యమైన విషయాలపై ముందుగానే తెలుసుకోవచ్చు.
అసలెందుకు ఇంత ప్రాధాన్యం
అసలెందుకు ఈ ఆచారానికి అంత ప్రాధాన్యమిచ్చారంటే...ముందస్తు సమాచారం ఉంటే మనం తీసుకున్న నిర్ణయాలు ఒక పద్ధతి ప్రకారం ఉంటాయి. పలానా నెలలో పలానా రాశి వారు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పినప్పుడు...మరింత అప్రమత్తంగా ఉంటాం. దాని వల్ల అనవసరమైన సమస్యలను చాలా వరకు తగ్గించుకోవచ్చు.
ఓపిక తగ్గిపోయింది
ఇప్పటి జనరేషన్‍లో చాలా మంది పంచాంగ శ్రవణాన్ని పట్టించుకోవడం మానేశారు. అంత వినే ఓపిక ఎవరికీ లేదు. అసలు అవసరం లేదని ఫీలవుతారు. కానీ ఇది కేవలం సంప్రదాయం మాత్రమే కాదు...మన జీవితాన్ని క్రమబద్ధంగా నడిపించే ఒక ప్లానింగ్ టూల్‍లా పనిచేస్తుంది. కనీసం కొద్దిసేపైనా దీన్ని వినడం వల్ల మనకు ఒక క్లారిటీ, దిశ ఉంటుంది.
ఈసారి మిస్ అవ్వకండి
ఉగాది పచ్చడి తినడం ఎంత ముఖ్యమో...పంచాంగ శ్రవణం వినడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఈ ఉగాది నుంచైనా పంచాంగ శ్రవణం మిస్ అవ్వకండి. మీ రాశి, మీ గ్రహస్థితి ఎలా ఉందో తెలుసుకుని అందుకు తగ్గట్లుగా మీ లైఫ్‍ను ప్లాన్ చేసుకోండి.

