MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Cigarettes: రోజుకు రెండు సిగరెట్ల చొప్పున నెల రోజులు తాగితే ఏమవుతుంది?

Cigarettes: రోజుకు రెండు సిగరెట్ల చొప్పున నెల రోజులు తాగితే ఏమవుతుంది?

Cigarettes: రోజుకు రెండు సిగరెట్లు తాగేవారు తమకేమీ కాదులే అనకుంటారు. రోజుకు పెట్టె సిగరెట్లు తాగితే ప్రమాదం కానీ రెండు సిగరెట్లతో ఏం జరుగుతుంది అనే ఫీలింగ్ లో ఉంటారు. నెల రోజుల పాటూ రోజుకు రెండు సిగరెట్లు చొప్పున తాగితే మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే.

2 Min read
Author : Haritha Chappa
Published : Dec 23 2025, 10:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రోజుకు రెండు సిగరెట్లు
Image Credit : Getty

రోజుకు రెండు సిగరెట్లు

సిగరెట్లు తాగేవారి సంఖ్య అధికంగానే ఉంది. ముఖ్యంగా యువతలో సిగరెట్లు అంటే ఎంతో క్రేజ్ ఉంటుంది. చాలా మంది రోజుకు ఒకటి లేదా రెండు సిగరెట్లే తాగుతారు. అలా తాగడం ఏమీ ప్రమాదం కాదని అనుకుంటారు.  ఇది ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపించదు అని ఫీలవుతారు.  అధ్యయనాలు చెబుతున్న ప్రకారం రోజుకు రెండు సిగరెట్లు తాగినా ప్రాణాలకు ప్రమాదమే. నిజానికి రోజుకు ఒక సిగరెట్ తాగినా కూడా శరీరానికి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది.  తక్కువ మోతాదులో తాగినా శరీరానికి తీవ్ర నష్టం జరుగుతుంది.  ఒక నెల రోజుల పాటూ రోజుకు రెండు సిగరెట్లు తాగితే మీ శరీరంలో కలిగే మార్పులు గురించి తెలుసుకోండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నికోటిన్ వ్యసనం
Image Credit : Getty

నికోటిన్ వ్యసనం

సిగరెట్లలో నికోటిన్ ఉంటుంది. సిగరెట్ కాల్చిన వెంటనే ఇది శరీరంలో చేరి వేగంగా పనిచేస్తుంది. ఇది నేరుగా మెదడులోని రివార్డ్ సిస్టమ్‌పై ప్రభావం చూపిస్తుంది. కొద్ది మొత్తంలో నికోటిన్ తీసుకున్నా కూడా అది ప్రమాదమే. అంతేకాదు ఈ నికోటిన్ మిమ్మల్నే సిగరెట్ కు బానిసను చేస్తుంది. ఇదే వ్యసనంగా మారడానికి అసలు కారణం. మొదట్లో ఒక సిగరెట్ తో ఆపినా క్రమంగా ఈ అలవాటు వ్యసనంగా మారుతుంది. రెండే అనుకున్న సిగరెట్లు తరువాత ఒక పెట్టె తాగేవరకు దారి తీస్తుంది.

Related Articles

Related image1
Pregnancy: గర్భిణులు శివలింగాన్ని తాకకూడదా? పూజించకూడదా?
Related image2
చేతికి నిండుగా ట్రెండీ బంగారు గాజులు
35
గుండెపై ప్రభావం
Image Credit : Getty

గుండెపై ప్రభావం

రోజుకు రెండు సిగరెట్లు తాగడం వల్ల శరీరంలోని ముఖ్య అవయవాలపై ప్రభావం చూపిస్తుంది. సిగరెట్ తాగడం వల్ల మొదట గుండె, రక్తనాళాలపై ప్రభావం పడుతుంది. నికోటిన్ శరీరంలో చేరాక తాత్కాలికంగా గుండె కొట్టుకునే వేగాన్ని, రక్తపోటును పెంచేస్తుంది. ఇది రక్తనాళాలను కుదించి రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. దీని వల్ల రక్తాన్ని పంప్ చేయడానికి గుండెపై తీవ్ర ప్రభావం పడుతుంది. సిగరెట్ తాగడం అనేది రక్తాన్ని చిక్కగా చేసి, రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచేస్తుంది. ఇది ఒక్కోసారి ప్రాణాంతక పరిస్థితికి దారితీస్తుంది.

45
ఊపిరితిత్తులకు హానికరం
Image Credit : Getty

ఊపిరితిత్తులకు హానికరం

రోజుకు రెండు సిగరెట్లు తాగడం అనేది ఊపిరితిత్తులకు ఎంతో ప్రమాదకరమైనది.  సిగరెట్ కాల్చడం వల్ల వచ్చే పొగ ఊపిరితిత్తులలో చేరి మంటను కలిగిస్తుంది. శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతుంది. నెలరోజులు ఇలాగే తాగితే గొంతులో చికాకు, దగ్గు, ఛాతీలో బిగుతు, నడిచేటప్పుడు ఆయాసం వంటివి వస్తాయి. చివరికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం కూడ ఉంది.

55
రోగనిరోధక శక్తికి దెబ్బ
Image Credit : Getty

రోగనిరోధక శక్తికి దెబ్బ

సిగరెట్‌లోని విష రసాయనాలు శరీరంలో ఆక్సిడేటివ్ ఒత్తిడిని పెంచుతాయి. ఇది రోగనిరోధక శక్తిని క్షీణించేలా చేస్తాయి.  దీనివల్ల చిన్న అనారోగ్యం వచ్చినా శరీరం త్వరగా కోలుకోదు. నెలరోజుల పాటు రోజూ రెండు సిగరెట్లు తాగితే అది చర్మంపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది.  రక్త ప్రసరణ తగ్గడం వల్ల చర్మం పేలవంగా, కాంతిహీనంగా మారుతుంది. గాయాలు మానడానికి ఎక్కువ సమయం పడుతుంది.  పంటి చిగుళ్లలో చికాకు లేదా వాపు రావచ్చు.

నెలరోజులు రోజుకు రెండు సిగరెట్లు తాగి పూర్తిగా మానేస్తే శాశ్వత నష్టం ఉండదు. ఎంత త్వరగా మానేస్తే, శరీరం కోలుకోవడానికి అంత సమయం దొరుకుతుంది. కానీ కణ స్థాయిలో నష్టం అప్పటికే జరుగుతుంది. ఊపిరితిత్తులు, రక్తనాళాల్లో సమస్యలు మొదలవుతాయి. ఆస్తమా, గుండె జబ్బులు ఉన్నవారిలో ఈ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి.

 లైట్ సిగరెట్లు, బీడీలు అన్నింటిలో నికోటిన్ ఉంటుంది, అవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. రోజుకు నాలుగు తాగినా, ఒకటి తాగినా కూడా ధూమపానం తీవ్ర హానికరమైనది. అందుకే ఈ అలవాటును త్వరగా మానుకోవడం మంచిది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Locket: హార్ట్ షేప్‌ గోల్డ్ లాకెట్స్.. చూస్తే మనసు పారేసుకుంటారు!
Recommended image2
Rice: అన్నం ముద్ద కాకుండా పొడి పొడిగా ఉడకాలంటే ఈ చిన్న చిట్కా ఉపయోగించండి చాలు
Recommended image3
రాధా-కృష్ణుల బంధం నుంచి భార్యాభర్తలు నేర్చుకోవాల్సినది ఎంతో ఉంది
Related Stories
Recommended image1
Pregnancy: గర్భిణులు శివలింగాన్ని తాకకూడదా? పూజించకూడదా?
Recommended image2
చేతికి నిండుగా ట్రెండీ బంగారు గాజులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved