MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Hair Growth: వయసు పెరిగేకొద్దీ జుట్టు పలుచబడుతోందా? ఇలా చేస్తే ఒత్తుగా పెరగడం పక్కా!

Hair Growth: వయసు పెరిగేకొద్దీ జుట్టు పలుచబడుతోందా? ఇలా చేస్తే ఒత్తుగా పెరగడం పక్కా!

Hair Growth: వయసు పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు రావడం సహజం. ముఖ్యంగా జుట్టు పలుచబడటం చాలామందిని కలవరపెట్టే అంశం. ఒకప్పుడు ఒత్తుగా ఉన్న జుట్టు క్రమంగా పలుచబడుతోందని చాలామంది బాధపడుతారు. కానీ వయసు పెరిగినా జుట్టు ఒత్తుగా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Jun 16 2026, 03:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వయసు పెరిగినా జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలి?
Image Credit : Getty

వయసు పెరిగినా జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలి?

వయసు పెరిగేకొద్దీ జుట్టు పలుచబడటం చాలామందిలో కనిపించే సహజమైన మార్పు. ఇది బయటకి కనిపించే సమస్య మాత్రమే కాదు, శరీరంలో జరిగే అంతర్గత మార్పుల ప్రతిబింబం కూడా. నిపుణుల ప్రకారం జుట్టు పలుచబడటానికి ప్రధాన కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పోషకాహారం తీసుకోవడం ముఖ్యం
Image Credit : Getty

పోషకాహారం తీసుకోవడం ముఖ్యం

నిపుణుల ప్రకారం, జుట్టు ఆరోగ్యం పూర్తిగా శరీర ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. శరీరంలో ఐరన్, ప్రోటీన్, విటమిన్ D, బయోటిన్ వంటి పోషకాలు తగ్గినప్పుడు జుట్టు రాలడం ఎక్కువవుతుంది. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో లేదా రక్తహీనత ఉన్నవారిలో హెయిర్ థిన్నింగ్ సాధారణంగా కనిపిస్తుంది. కాబట్టి పోషకాహారం తీసుకోవడం ముఖ్యం. రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, గుడ్లు, పప్పులు, డ్రై ఫ్రూట్స్, పండ్లు వంటి వాటిని చేర్చడం వల్ల జుట్టు మూలాలకు బలం అందుతుంది.

Related Articles

Related image1
Fitness Tips: అమ్మాయిలు సన్నగా, ఫిట్‌గా ఉండడానికి 5 బెస్ట్ టిప్స్ ఇవిగో!
Related image2
Health Tips: నీళ్లు తాగే సరైన విధానం ఇదే.. 90 శాతం మందికి నిజంగా తెలియదు!
36
హార్మోన్ల ప్రభావం
Image Credit : GEMINI AI

హార్మోన్ల ప్రభావం

అలాగే వయసుతో పాటు హార్మోన్ల మార్పులు కూడా జుట్టు పలుచబడటానికి కారణం అవుతాయి. ముఖ్యంగా డైహైడ్రోటెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ప్రభావం వల్ల హెయిర్ ఫాలికల్స్ కుంచించుకుపోయి జుట్టు సన్నగా మారుతుంది. ఇది పురుషులలో ఎక్కువగా కనిపించినా, మహిళల్లో కూడా మెనోపాజ్ తర్వాత ఈ సమస్య కనిపించవచ్చు. అయితే సరైన ట్రీట్మెంట్, కేర్‌తో ఈ సమస్యను కొంతవరకు తగ్గించుకోవచ్చు.

46
ఈ తప్పులు చేయొద్దు
Image Credit : Getty

ఈ తప్పులు చేయొద్దు

రోజువారీ జుట్టు సంరక్షణలో చేసే చిన్న తప్పులు కూడా పెద్ద ప్రభావం చూపుతాయి. బాగా వేడి నీటితో తలస్నానం చేయడం, తరచుగా హీట్ స్టైలింగ్ టూల్స్ వాడటం, కెమికల్ కలిగిన షాంపూలు ఉపయోగించడం వంటివి జుట్టును మరింత బలహీనపరుస్తాయి. నిపుణుల ప్రకారం కెమికల్ ఫ్రీ షాంపూలు వాడటం, వారానికి 2–3 సార్లు తలస్నానం చేయడం, తల చర్మాన్ని మృదువుగా మసాజ్ చేయడం ద్వారా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

56
ఒత్తిడి
Image Credit : Getty

ఒత్తిడి

టెన్షన్ వల్ల శరీరంలో కార్టిసాల్ హార్మోన్ పెరిగి హెయిర్ గ్రోత్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. యోగా, ధ్యానం, సరైన నిద్ర వంటి అలవాట్లు ఈ సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి. రోజుకు కనీసం 7–8 గంటల నిద్ర కూడా జుట్టు ఆరోగ్యానికి అవసరం.

66
జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే..
Image Credit : Getty

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే..

జుట్టు ఎప్పుడూ ఒత్తుగా, ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం బయటి ట్రీట్మెంట్స్‌పై ఆధారపడకూడదు. నూనె మసాజ్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొబ్బరి నూనె, బాదం నూనె లేదా ఆముదం నూనెతో వారానికి రెండు సార్లు మసాజ్ చేయడం వల్ల హెయిర్ ఫాలికల్స్ బలపడతాయి. అయితే అధికంగా ఆయిల్ అప్లై చేసి ఎక్కువసేపు ఉంచడం కాకుండా, సరైన విధంగా శుభ్రపరచడం కూడా అవసరం. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వయసు పెరిగినా జుట్టు బలంగా, అందంగా ఉంటుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
సౌందర్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Blouse Designs: క్లాసీ లుక్ ఇచ్చే బ్లౌజులు.. ఎవ్వరికైనా నచ్చేస్తాయి!
Recommended image2
Crows: పాములు కాదు.. కాకులు మనుషులపై పగపడతాయా? ఎన్ని ఏళ్లు గుర్తుంచుకుంటాయో తెలుసా?
Recommended image3
Telugu Saying: ఊరుకున్నంత ఉత్తమం లేదు.. బోడి గుండు అంత సుఖం లేదు! ఈ మాట ఎందుకు చెప్పారో తెలుసా?
Related Stories
Recommended image1
Fitness Tips: అమ్మాయిలు సన్నగా, ఫిట్‌గా ఉండడానికి 5 బెస్ట్ టిప్స్ ఇవిగో!
Recommended image2
Health Tips: నీళ్లు తాగే సరైన విధానం ఇదే.. 90 శాతం మందికి నిజంగా తెలియదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved