MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Fitness Tips: అమ్మాయిలు సన్నగా, ఫిట్‌గా ఉండడానికి 5 బెస్ట్ టిప్స్ ఇవిగో!

Fitness Tips: అమ్మాయిలు సన్నగా, ఫిట్‌గా ఉండడానికి 5 బెస్ట్ టిప్స్ ఇవిగో!

Fitness Tips: సన్నగా, ఫిట్‌గా, ఎనర్జీతో ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అయితే అందుకోసం కఠినమైన డైట్ లు అవసరం లేదు. సరైన ఫుడ్ తీసుకుంటూ, లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఫిట్ గా ఉండొచ్చు. ఫిట్‌గా ఉండటానికి సహాయపడే 5 టిప్స్ మీకోసం..

2 Min read
Author : Kavitha G
Published : Jun 10 2026, 06:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అమ్మాయిల ఫిట్ నెస్ కోసం బెస్ట్ టిప్స్
Image Credit : gemini ai

అమ్మాయిల ఫిట్ నెస్ కోసం బెస్ట్ టిప్స్

సన్నగా కనిపించడం అంటే బరువు తగ్గడం మాత్రమే కాదు. శరీరం ఆరోగ్యంగా, సమతుల్యంగా ఉండటం కూడా. చాలామంది ఫాస్ట్ గా స్లిమ్ అవ్వాలని ప్రయత్నిస్తూ తప్పు డైట్‌లు, అనారోగ్యమైన పద్ధతులను పాటిస్తుంటారు. కానీ దీర్ఘకాలంలో మంచి ఫలితాలు రావాలంటే సరైన లైఫ్ స్టైల్, సమతుల్య ఆహారం, శరీరాన్ని అర్థం చేసుకునే విధానం అవసరం. అమ్మాయిలు ఆరోగ్యంగా సన్నగా, నాజుగ్గా ఉండడానికి సహాయపడే 5 ముఖ్యమైన టిప్స్ ఇక్కడ ఉన్నాయి. చూసేయండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఐరన్ లోపం లేకుండా చూసుకోవడం
Image Credit : Getty

ఐరన్ లోపం లేకుండా చూసుకోవడం

చాలామంది అమ్మాయిల్లో ఐరన్ లోపం సాధారణంగా కనిపిస్తుంది. ఇది రక్తహీనతకు దారితీసి అలసట, బలహీనత, బరువు పెరగడం, తలనొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది. శరీరంలో ఐరన్ సరిపడా లేకపోతే మెటబాలిజం కూడా ప్రభావితమవుతుంది. అందుకే పాలకూర, బీట్‌రూట్, ద్రాక్ష, ఖర్జూరం, పప్పులు వంటి ఐరన్ సమృద్ధిగా ఉన్న ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలి. 

Related Articles

Related image1
Sarees: డైలీవేర్ కి ఈ శారీస్ అద్భుతంగా ఉంటాయి.. ఓ లుక్కేయండి
Related image2
Head Lice: ఈ సింపుల్ చిట్కాలతో తలలో పేలు మాయం.. ఒక్కసారి ట్రై చేయండి!
36
విపరీతమైన డైటింగ్ వద్దు
Image Credit : Getty

విపరీతమైన డైటింగ్ వద్దు

చాలామంది త్వరగా బరువు తగ్గాలని ఆహారం చాలా తగ్గిస్తారు. కానీ ఇది శరీరానికి హాని చేస్తుంది. విపరీతమైన డైటింగ్ వల్ల మెటబాలిజం స్లో అవుతుంది. శరీరం బలహీనపడుతుంది. తిరిగి బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే సమతుల్య ఆహారం తీసుకోవడం ఉత్తమ మార్గం. సరైన పరిమాణంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫ్యాట్స్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా సన్నగా ఉండవచ్చు.

46
పీరియడ్స్‌ను బట్టి ఎక్సర్సైజ్ ప్లాన్ చేసుకోవడం
Image Credit : Getty

పీరియడ్స్‌ను బట్టి ఎక్సర్సైజ్ ప్లాన్ చేసుకోవడం

అమ్మాయిల శరీరం హార్మోన్ల మార్పులకు అనుగుణంగా పనిచేస్తుంది. పీరియడ్స్ సమయంలో ఎక్కువ ఒత్తిడి చేసే వ్యాయామాలు చేయకుండా, లైట్ వాకింగ్ లేదా స్ట్రెచింగ్ చేయడం మంచిది. పీరియడ్స్ తర్వాత రోజుల్లో శరీరం ఎక్కువ ఎనర్జీతో ఉంటుంది కాబట్టి ఆ సమయంలో కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. ఇలా శరీరాన్ని అర్థం చేసుకుని వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండొచ్చు.

56
ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం
Image Credit : Getty

ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం

ప్రోటీన్ శరీరానికి బలాన్ని ఇస్తుంది. కండరాలను బలోపేతం చేస్తుంది. ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉంచుతుంది. ఇది బరువు నియంత్రణలో కూడా సహాయపడుతుంది. గుడ్లు, పాలు, పెరుగు, పన్నీర్, పప్పులు, చికెన్ వంటి ఆహారాలను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అందుతుంది. ప్రోటీన్ సరిపడా తీసుకోవడం వల్ల సన్నగా, ఫిట్‌గా కనిపిస్తారు.

66
స్ట్రెస్ తగ్గించుకోవడం
Image Credit : Getty

స్ట్రెస్ తగ్గించుకోవడం

మానసిక ఒత్తిడి శరీరంపై చాలా ప్రభావం చూపుతుంది. స్ట్రెస్ ఎక్కువగా ఉంటే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి బరువు పెరగడం, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి. యోగా, ధ్యానం, సంగీతం వినడం వంటి అలవాట్ల ద్వారా స్ట్రెస్‌ను తగ్గించుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Best Time to Workouts : ఉదయం వర్కౌట్స్ చేయడం మంచిదా? లేక సాయంత్రమా?
Recommended image2
Black Raisins: నానబెట్టిన నల్ల ఎండు ద్రాక్ష తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Recommended image3
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం ఈ 5 విషయాలు భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమవుతాయి!
Related Stories
Recommended image1
Sarees: డైలీవేర్ కి ఈ శారీస్ అద్భుతంగా ఉంటాయి.. ఓ లుక్కేయండి
Recommended image2
Head Lice: ఈ సింపుల్ చిట్కాలతో తలలో పేలు మాయం.. ఒక్కసారి ట్రై చేయండి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved