MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Health Tips: నీళ్లు తాగే సరైన విధానం ఇదే.. 90 శాతం మందికి నిజంగా తెలియదు!

Health Tips: నీళ్లు తాగే సరైన విధానం ఇదే.. 90 శాతం మందికి నిజంగా తెలియదు!

Health tips: ఆరోగ్యంగా ఉండడానికి నీరు ఎంత అవసరమో.. సరైన టైంలో, సరైన విధంగా తాగడం కూడా అంతే ముఖ్యం. కొందరు దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు తాగుతారు, మరికొందరు ఒకేసారి ఎక్కువ తాగేస్తారు. ఇది మంచిది కాదంటున్నారు నిపుణులు. మరి నీళ్లు ఎలా తాగాలో చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Jun 15 2026, 06:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
నీళ్లు తాగే సరైన విధానం
Image Credit : Getty

నీళ్లు తాగే సరైన విధానం

మన శరీరంలోని అవయవాలు సరిగ్గా పనిచేయడానికి నీరు చాలా అవసరం. కానీ ఎంత నీరు తాగుతున్నామన్నదే కాదు, ఎప్పుడు తాగుతున్నాం? ఎలా తాగుతున్నాం? ఎంత గ్యాప్ తో తాగుతున్నాం? అనే విషయాలు కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు. మరి నీటిని ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఉదయం లేచిన వెంటనే..
Image Credit : Getty

ఉదయం లేచిన వెంటనే..

ఉదయం నిద్రలేవగానే ఒక గ్లాస్ నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. రాత్రంతా నిద్రలో ఉంటాము కాబట్టి.. శరీరం కొన్ని గంటల పాటు నీరు తీసుకోకుండా ఉంటుంది. ఈ సమయంలో డీహైడ్రేషన్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే ఉదయం లేవగానే ఒక గ్లాస్ నార్మల్ వాటర్ తాగడం ద్వారా శరీరం మళ్లీ చురుకుగా మారుతుంది.

36
నార్మల్ వాటర్ తాగడం
Image Credit : Getty

నార్మల్ వాటర్ తాగడం

చాలామంది చల్లటి నీళ్లు లేదా వేడి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని అనుకుంటారు. కానీ నార్మల్ వాటర్ తాగడం మంచిది. బాగా చల్లటి నీళ్లు తాగడం వల్ల కొందరిలో గొంతు సమస్యలు, జీర్ణక్రియలో ఇబ్బందులు రావచ్చు. అలాగే బాగా వేడి నీరు కూడా అందరికీ అనుకూలం కాకపోవచ్చు. 

46
ఒకేసారి వద్దు
Image Credit : Getty

ఒకేసారి వద్దు

అంతేకాదు రోజుకు అవసరమైన నీటిని ఒకేసారి ఎక్కువగా తాగేయకుండా రోజు మొత్తం కొద్దికొద్దిగా తాగడం మంచిది. రెండు లేదా మూడు గంటలకు ఒకసారి ఒక గ్లాస్ నీరు తాగడం ద్వారా శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. చాలామంది దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగుతారు. కానీ గ్యాప్ తీసుకుంటూ కొద్దికొద్దిగా నీరు తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

56
కూర్చొని వాటర్ తాగడం
Image Credit : Getty

కూర్చొని వాటర్ తాగడం

సాధారణంగా కొందరు నిలబడి లేదా హడావిడిగా ఒకేసారి గ్లాస్ నీటిని తాగేస్తుంటారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం సాధ్యమైనంత వరకు కూర్చొని, నిదానంగా నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల శరీరం నీటిని సులభంగా గ్రహిస్తుంది. ముఖ్యంగా పని ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా వ్యాయామం చేసిన వెంటనే నీటిని మెల్లగా తాగడం మంచిది.

66
రోజుకు ఎంత నీరు తాగాలి?
Image Credit : Getty

రోజుకు ఎంత నీరు తాగాలి?

రోజుకు ఎంత నీరు తాగాలి అనేది వయసు, బరువు, వాతావరణం, శారీరక శ్రమ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా పెద్దవాళ్లు రోజుకు 2 నుంచి 3 లీటర్ల వరకు నీరు తీసుకోవాలి. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు, వ్యాయామం చేసినప్పుడు లేదా చెమట ఎక్కువగా వచ్చినప్పుడు నీటి అవసరం కూడా పెరుగుతుంది. అలాంటి సందర్భాల్లో అదనంగా నీరు తాగడం శరీరానికి మేలు చేస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sarees: స్టైల్, కంఫర్ట్ కోసం ఈ శారీస్ కచ్చితంగా ట్రై చేయాల్సిందే!
Recommended image2
Mangalsutra Designs: కాటన్ చీరలకు సూటయ్యే మంగళసూత్రం డిజైన్లు
Recommended image3
Motivational Story: మనసులోని ఆలోచనలే శత్రువులు.. అద్దం కూడా భయపెడుతుంది.. మీ ఆలోచన మార్చే కథ ఇది
Related Stories
Recommended image1
Fitness Tips: అమ్మాయిలు సన్నగా, ఫిట్‌గా ఉండడానికి 5 బెస్ట్ టిప్స్ ఇవిగో!
Recommended image2
Rice Water: బియ్యం నీళ్లతో మ్యాజిక్.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved