MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Beer and Hair: బీర్ తాగితే జుట్టు పెరుగుతుందా? రాలుతుందా? అసలు నిజం ఇదే

Beer and Hair: బీర్ తాగితే జుట్టు పెరుగుతుందా? రాలుతుందా? అసలు నిజం ఇదే

Beer and Hair: చాలామందికి బీర్ గురించి ఎన్నో అభిప్రాయాలు, నమ్మకాలు పెట్టుకుంటారు. అందులో బీర్ తాగితే జుట్టు పెరుగుతుందనే నమ్మకం కూడ ఒకటి. ఇంతకీ బీర్ తాగడం వల్ల జుట్టు పెరుగుతుందా? లేక రాలుతుందా? అనే విషయంపై క్లారిటీ ఇదిగో.

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 29 2026, 08:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బీర్ తాగితే జుట్టు పెరుగుతుందా?
Image Credit : Asianet News

బీర్ తాగితే జుట్టు పెరుగుతుందా?

బీర్ పై ఎన్నో అధ్యయనాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం, అప్పుడప్పుడు ఒక గ్లాస్ బీర్ తాగితే శరీరానికి కొన్ని పోషకాలు అందుతాయి. ముఖ్యంగా బీర్‌లో విటమిన్ B6 కొద్ది మొత్తంలో ఉంటుందని కొన్ని పరిశోధనలు తేల్చాయి. మెదడు పనితీరు, రక్త ఉత్పత్తి, రోగనిరోధక శక్తికి  విటమిన్ బి6 చాలా ముఖ్యం. కానీ దీనికోసమే బీర్ తాగాల్సిన అవసరం లేదు. ఇతర ఆహారాల్లో కూడా విటమిన్ బి6 లభిస్తుంది.

మన శరీరానికి విటమిన్ B6 చాలా అవసరమైన పోషకం. ఇది మెదడు సరిగ్గా పనిచేయడానికి, నరాల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి ఇది సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలలో కూడా విటమిన్ B6 కీలక పాత్ర పోషిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి ఇది ముఖ్యం. శరీరంలో ప్రోటీన్ల వాడకానికి, శక్తి ఉత్పత్తికి కూడా ఇది కావాలి. మన శరీరం ఈ విటమిన్‌ను తయారు చేసుకోలేదు. అందుకే, మనం దీన్ని ఆహారం ద్వారానే తీసుకోవాలి.

24
బీర్ తయారీలో ఏం వాడతారు?
Image Credit : Asianet News

బీర్ తయారీలో ఏం వాడతారు?

బీర్ తయారీకి బార్లీ, గోధుమ, బ్రూవర్స్ యీస్ట్ వంటి ముడి పదార్థాలను వాడతారు. వీటిలో కూడా విటమిన్ B6 కొద్ది మొత్తంలో ఉంటుంది. బీర్ తయారీలో కొంత పోషకాలు నశించినా  పూర్తిగా అయితే పోవు. బీర్‌లో  విటమిన్ బి6 కొద్దిగా మిగిలి ఉంటుంది. ఒక గ్లాస్ బీర్‌లో రోజుకు కావాల్సిన విటమిన్ B6లో కొంత భాగం దొరుకుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆల్కహాల్ లేని బీర్‌లో కూడా విటమిన్ బి6 ఉండటం ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఆల్కహాల్ రహిత బీర్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

Related Articles

Related image1
Pressure Cooker: ఈ 5 తప్పులు చేస్తే మీ ప్రెషర్ కుక్కర్ పేలే ప్రమాదం ఎక్కువ
Related image2
Numerology: ఏ నెలలోనైనా మీరు ఈ తేదీన పుట్టారా? అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి
34
అన్ని బీర్లలో ఉంటుందా?
Image Credit : Asianet News

అన్ని బీర్లలో ఉంటుందా?

అన్ని బీర్లలో విటమిన్ B6 ఉంటుంది. కానీ ఒకే మోతాదులో ఉండదు. ముదురు రంగు, ఘాటైన రుచి ఉండే కొన్ని ప్రత్యేక బీర్లలో ఇది ఎక్కువగా ఉంటుంది. సాధారణ లాగర్ బీర్‌లో కూడా తక్కువగా ఉంటుంది. గోధుమలతో చేసే బీర్‌లోనూ మంచి మోతాదులో ఉంటుంది. కానీ, బియ్యం వాడి చేసే బీర్‌లో ఈ విటమిన్ చాలా తక్కువగా ఉన్నట్లు గమనించారు. ఆల్కహాల్ తీసేసిన బీర్‌లో విటమిన్ శాతం కొంచెం ఎక్కువగా ఉండటం మరో ఆశ్చర్యం.

పోషకాల కోసం బీర్‌ను తాగడం మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ B6 కోసం మాంసం, చేపలు, శనగలు, ఓట్స్, బంగాళదుంప వంటి  ఆహార పదార్థాలు తినడం మంచిది. సమతుల్య ఆహారం తీసుకునే వారికి విటమిన్ల లోపం రాదు. కాబట్టి  బీర్ ద్వారా విటమిన్లు పొందడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు.

44
బీర్ తో జుట్టు పెరుగుతుందా?
Image Credit : Asianet News

బీర్ తో జుట్టు పెరుగుతుందా?

బీర్‌లో సిలికాన్, విటమిన్ B6 వంటి పోషకాలు ఉండడం నిజమే. కానీ అందులో ఉండే ఆల్కహాల్  శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. దీని వల్ల జుట్టు కుదుళ్లు బలహీనంగా మారి వెంట్రుకలు రాలిపోతాయి.కాబట్టి  జుట్టు పెరుగుదల కోసం బీర్ తాగడం మంచి ఆలోచన కాదు. బీర్‌లో కొన్ని విటమిన్లు ఉన్నంత మాత్రాన, ఆల్కహాల్ శరీరానికి ఏమాత్రం మంచిది కాదు. అతిగా ఆల్కహాల్ సేవిస్తే దుష్ప్రభావాలు తప్పవు. కాబట్టి మితంగా తాగడం చాలా ముఖ్యం. పూర్తిగా మానేస్తే ఇంకా ఆరోగ్యం.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
సౌందర్యం
ఆహారం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Fruit Peels: తొక్కతో పాటూ తినాల్సిన 5 పండ్లు ఇవిగో
Recommended image2
Earrings: 2 గ్రాముల్లో క్యూట్ ఇయర్ రింగ్స్, పార్టీవేర్ కి పర్ఫెక్ట్
Recommended image3
Smart TV Cleaning: స్మార్ట్ టీవీ క్లీన్ చేస్తున్నారా? దీనితో క్లీన్ చేస్తే టీవీ కొత్తదానిలా మెరిసిపోతుంది
Related Stories
Recommended image1
Pressure Cooker: ఈ 5 తప్పులు చేస్తే మీ ప్రెషర్ కుక్కర్ పేలే ప్రమాదం ఎక్కువ
Recommended image2
Numerology: ఏ నెలలోనైనా మీరు ఈ తేదీన పుట్టారా? అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved