MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • News Paper Reuse: పాత న్యూస్ పేపర్లు పారేస్తున్నారా? ఇంట్లో ఎన్ని రకాలుగా వాడొచ్చో తెలుసా?

News Paper Reuse: పాత న్యూస్ పేపర్లు పారేస్తున్నారా? ఇంట్లో ఎన్ని రకాలుగా వాడొచ్చో తెలుసా?

 News Paper Reuse: మీ ఇంట్లో పాత న్యూస్ పేపర్స్ ఉన్నాయా? వాటిని కొద్ది రోజులు పక్కన పెట్టేసి.. ఆ తర్వాత బయట పడేస్తున్నారా? పనికి రాని ఈ పాత న్యూస్ పేపర్లతోనే ఇంటిని అందంగా మార్చుకోవచ్చని మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు చూద్దాం.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 12 2026, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
న్యూస్ పేపర్ వాడే పద్దతి...
Image Credit : Freepic

న్యూస్ పేపర్ వాడే పద్దతి...

ఈ రోజు న్యూస్ పేపర్ రేపటికి పనికి రాని చెత్త కాగితం లాగా చాలా మంది భావిస్తారు. మహా అంటే.. ఇంట్లో బట్టలు పాడవ్వకుండా ఉండేందుకు కబోర్డ్స్ కింద వేస్తారు. మిగిలిన వాటిని నెలల పాటు భద్రపరిచి తర్వాత పేపర్లు కొనేవాళ్లకు వేసేస్తూ ఉంటారు. కానీ.. ఈ న్యూస్ పేపర్లతో ఇంటిని కొత్త దానిలా మెరిసేలా చేయచ్చు. అంతేకాదు.. ఇంట్లో మన ఆరోగ్యానికీ, పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ కి బదులు కూడా వాడొచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఇంటిని శుభ్రం చేయడానికి...
Image Credit : Asianet News

ఇంటిని శుభ్రం చేయడానికి...

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కిటికీలు, అద్దాలతో చేసిన ఏవైనా వస్తువులు ఉండే ఉంటాయి. వాటికి పట్టిన మురికి అంత సులభంగా వదలదు. మార్కెట్లో దొరికే ఖరీదైన లిక్విడ్స్ తెచ్చి శుభ్రం చేస్తూ ఉంటారు.కానీ, వాటి అసవరం లేకుండా.. ఈ న్యూస్ పేపర్లతో శుభ్రం చేయచ్చు. న్యూస్ పేపర్ మీద కాస్త వెనిగర్ వేసి.. డైనింగ్ టేబుల్, కిటికీలు, అద్దాలను శుభ్రం చేస్తే..కొత్త వాటిలా మెరిసిపోతాయి.

అంతేకాకుండా... మీ ఇంట్లో కబోర్డ్స్, వంట గది క్యాబిన్స్, పుస్తకాల అరలు, దుస్తుల కింద.. న్యూస్ పేపర్ వేయాలి. ఇలా చేయడం వల్ల దుమ్మూ, ధూళి చేరకుండా ఉంటుంది. కబోర్డ్స్ లోపల కూడా పాడవ్వకుండా ఉంటాయి.

చాలాసార్లు.. మనం ఇల్లు మారుతున్నప్పుడు.. గాజు వస్తువులను మార్చడం చాలా కష్టమైన పని. ఎందుకంటే.. ఎంత జాగ్రత్తగా తీసుకువెళ్దామన్నా కూడా పగిలిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ న్యూస్ పేపర్లు చాలా బాగా ఉపయోగపడతాయి. మీ ఇంట్లో గాజు లేదా పింగాణీ వస్తువులు ఉంటే... వాటిని జాగ్రత్తగా న్యూస్ పేపర్ లో చుట్టి.. ఆ తర్వాత ఏదైనా బాక్సుల్లో పెట్టి తరలిస్తే.. పగలకుండా ఉంటాయి.

Related Articles

Related image1
Leggings Reuse: పాత లెగ్గిన్స్ పారేస్తున్నారా? ఇంట్లో పనికొచ్చే ఈ వస్తువులు చేసేయండి..!
Related image2
Chicken Shop: చికెన్ బొక్కలు.. పీకేసిన ఈకలు..ఏముందక్కడ..? దీనికి అవార్డా..?
34
ఇలా కూడా వాడొచ్చు...
Image Credit : Freepik

ఇలా కూడా వాడొచ్చు...

ప్రతి నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి చాలా మంది ఇంటికి పెయింటింగ్స్ వేయించుకుంటూ ఉంటారు. అలా వేయించే సమయంలో ఫ్లోర్ మొత్తం పాడైపోతూ ఉంటుంది.అలా జరగకుండా ఉండేందుకు కూడా ఈ న్యూస్ పేపర్లు వాడితే సరిపోతుంది. కింద మొత్తం న్యూస్ పేపర్లు పరిచి.. ఆ తర్వాత గోడకు పెయింటింగ్ వేసుకుంటే... కింద ఫ్లోర్ పాడవ్వకుండా ఉంటుంది. ఇంట్లో ఏవైనా మరమ్మత్తులు చేసినప్పుడు కూడా.. దుమ్ము, ధూళి పడకుండా ఉండేందుకు న్యూస్ పేపర్లు నేలపై పరచొచ్చు. దీని వల్ల ఇంటిని శుభ్రం చేసుకోవడం సులభంగా ఉంటుంది.

మీ ఇంట్లో పండ్లు ఉంటే.. వాటిని సహజంగా పండేలా చేయడానికి న్యూస్ పేపర్లను వాడొచ్చు. ఎలాంటి కెమికల్స్ లేకుండా పండేందుకు న్యూస్ పేపర్ లో వాటిని చుట్టి పెడితే సరిపోతుంది. మంచిగా పండుతాయి. ముఖ్యంగా మామిడి, సపోటా లాంటి పండ్లు.. సమానంగా పండటానికి న్యూస్ పేపర్ హెల్ప్ చేస్తుంది. అంతేకాదు..రోజూ మనం వాడే బూట్లు తేమ కారణంగా.. వాసన వచ్చేస్తూ ఉంటాయి. అలా వాసన రాకుండా ఉండేందుకు.. బూట్లలో న్యూస్ పేపర్ చుట్టి పెడితే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల షూస్ నుంచి దుర్వాసన రాదు.

44
చిన్న పిల్లలు ఉంటే...
Image Credit : Pinterest

చిన్న పిల్లలు ఉంటే...

మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే.. వాళ్లలో క్రియేటివిటీ పెంచడానికి కూడా న్యూస్ పేపర్ ని వాడొచ్చు. వాళ్లకు బోర్ కొడుతుందని టీవీ, ఫోన్లు అడిగితే... అవి ఇవ్వకుండా... ఇంట్లోనే పాత న్యూస్ పేపర్లు ఇచ్చి.. వాటితో కాగితపు బొమ్మలు, అలంకరణ వస్తువులు లాంటివి తయారు చేయడం నేర్పించండి. దీని వల్ల పిల్లల్లో క్రియేటివిటీ పెరుగుతుంది.

అంతేకాదు.. పాత న్యూస్ పేపర్లను మీరు మీ పుస్తకాలకు కవర్లుగా కూడా వాడుకోవచ్చు. ఫ్రిజ్ లో కూరగాయలు స్టోర్ చేసే డబ్బాల్లో న్యూస్ పేపర్ వేసి తర్వాత పండ్లు, కూరగాయలు పెట్టడం వల్ల.. ఆ పేపర్ తేమ పీల్చుకొని... వాటిని ఎక్కువ రోజులు తాజాగా ఉంచేలా చేస్తుంది. అదేవిధంగా.. మీ ఇంట్లో వెండి వస్తువులు ఉంటే... దానిని పేపర్ లో చుట్టి.. దాచి పెట్టడం వల్ల పాడవ్వకుండా కొత్త వాటిలా కనిపిస్తాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
మీకు బుగ్గల్లో సొట్టలు పడుతున్నాయా? అయితే మీ వ్యక్తిత్వం చాలా స్పెషల్
Recommended image2
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Recommended image3
Gold Rings: 2 గ్రాముల్లో వచ్చే లేటెస్ట్ డిజైన్ గోల్డ్ రింగ్స్.. ఇవిగో!
Related Stories
Recommended image1
Leggings Reuse: పాత లెగ్గిన్స్ పారేస్తున్నారా? ఇంట్లో పనికొచ్చే ఈ వస్తువులు చేసేయండి..!
Recommended image2
Chicken Shop: చికెన్ బొక్కలు.. పీకేసిన ఈకలు..ఏముందక్కడ..? దీనికి అవార్డా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved