MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Biggest Seed: తాటి చెట్టుకు 25 కిలోల కొబ్బరికాయ..ప్రపంచంలోనే అత్యంత బరువైన విత్తనం..!

Biggest Seed: తాటి చెట్టుకు 25 కిలోల కొబ్బరికాయ..ప్రపంచంలోనే అత్యంత బరువైన విత్తనం..!

Biggest Seed: తాటి చెట్టుకు తాటికాయలే కాస్తాయి. కానీ, కొబ్బరికాయలు కాయడం ఎప్పుడైనా చూశారా? అది కూడా దాదాపు 25 కిలోల బరువులో ఉండటం ఎప్పుడైనా చూశారా? ఇలాంటి కాయలు కాసే.. ప్రపంచంలోనే అత్యంత వింత చెట్టు ఒకటి ఉంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 07 2026, 01:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
భూమి మీద అతి పెద్ద విత్తనం..
Image Credit : Geminiai

భూమి మీద అతి పెద్ద విత్తనం..

ఈ భూమి మీద చాలా మొక్కలు విత్తనాలు విత్తడం ద్వారానే మొలకెత్తుతాయి. అంతేకాదు, ఈ విత్తనాలు కూడా.. దాదాపు అన్నీ మన అరచేతిలో పట్టేలానే ఉంటాయి. ఒక్క కొబ్బరికాయ మాత్రం కాస్త పెద్దదిగా ఉంటుంది. కానీ, ఒకే ఒక విత్తనం ఏకంగా 25 కిలోల బరువులో ఉంటుంది. వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షరాలా సత్యం. అది కూడా తాటి చెట్టుకు కు కాసే కొబ్బరికాయ విత్తనం. ఈ వింత చెట్టు గురించి ఇప్పుడు తెలుసుకుందాం....

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ప్రపంచంలో అత్యంత బరువైన విత్తనం...
Image Credit : Geminiai

ప్రపంచంలో అత్యంత బరువైన విత్తనం...

ప్రపంచంలోనే అత్యంత బరువైన ఈ విత్తనాన్ని ప్రొఫెషనల్ గా ‘ కోకో-డి-మెర్’ ( Coco-de-mer) అంటారు. దీని శాస్త్రీయ నామం Lodoicea Maldivica. దీనిని డబుల్ కొబ్బరి ( Double Coconut) అని కూడా పిలుస్తారు. సాధారణ కొబ్బరియా లా ఇది గుండ్రంగా ఉండదు. రెండు భాగాలు కలిసిపోయినట్లు ఉండే దీని విచిత్రమైన ఆకారమే దీనికి ఆ పేరు తెచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం ఈ భారీ విత్తనాలు సముద్రపు అలలపై కొట్టుకొచ్చి తీరం దగ్గర కనిపించేవి. అప్పట్లో ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియక తికమకపడ్డారు. కానీ, తర్వాత ఈ అరుదైన మొక్క గురించి తెలిసింది.

33
అరుదైన చెట్టు...
Image Credit : Geminiai

అరుదైన చెట్టు...

ఈ చెట్ల ప్రత్యేకత ఏమిటంటే... ప్రపంచంలో ఎక్కడ పడితే అక్కడ ఇవి పెరగవు. ఇవి కేవలం సీషెల్స్ దీవుల్లో ప్రస్లిన్, క్యూరియూస్ ప్రాంతాల్లో మాత్రమే సహజంగా పెరుగుతాయి. యునెస్కో గుర్తింపు పొందిన ప్రస్లిన్ దీవిలోని వల్లి డి మై నేచర్ రిజర్వ్ ఈ అరుదైన తాటి చెట్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ చెట్టు తాటి చెట్టు ఫ్యామిలీకి చెందినవి. అందుకే.. చూడటానికి తాటి చెట్టులా కనిపిస్తాయి.

ఇంత భారీ విత్తనం ఎందుకు తయారవుతుంది?

శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం.. ఈ చెట్లు ఇంత భారీ విత్తనాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అక్కడి కఠినమైన పర్యావరణ పరిస్థితులే కారణం. విత్తనం అంత పెద్దదిగా ఉండటం వల్ల లోపల ఎక్కువ పోషకాలు నిల్వ ఉంటాయి. దీనివల్ల నేలపై కొత్తగా మొలకెత్తే మొక్కకు ప్రారంభ దశలో కావాల్సినంత శక్తి అంది బతకగలుగుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
DMart : డీమార్ట్‌లో ఏ వస్తువులు, ఎలా కొనాలి? ఈ స్మార్ట్ షాపింగ్ టిప్స్ ఫాలోకండి.. వేలకు వేలు ఆదా చేసుకొండి
Recommended image2
Curd: పెరుగు పులియకుండా 3 రోజులు తాజాగా ఉంచడం ఎలా?
Recommended image3
Tablet: ట్యాబ్లెట్ వేసుకొనేటప్పుడు ఎన్ని నీళ్లు తాగాలి? ఈ తప్పులు మాత్రం చేయకండి..!
Related Stories
Recommended image1
Mutton: మటన్ తిన్నారా? వెంటనే ఇవి మాత్రం తినకండి.. చాలా డేంజర్..!
Recommended image2
Rain: మన దేశంలో సంవత్సరమంతా వర్షం పడే ప్రదేశం ఇది...!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved