MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Mutton: మటన్ తిన్నారా? వెంటనే ఇవి మాత్రం తినకండి.. చాలా డేంజర్..!

Mutton: మటన్ తిన్నారా? వెంటనే ఇవి మాత్రం తినకండి.. చాలా డేంజర్..!

Mutton: మటన్ ఆరోగ్యానికి మంచిదే కానీ, మటన్ తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలు మాత్రం పొరపాటున కూడా తినకూడదు. తింటే చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 06 2026, 05:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మటన్ తిన్న తర్వాత ఇవి తింటున్నారా?
Image Credit : Gemini AI Generated

మటన్ తిన్న తర్వాత ఇవి తింటున్నారా?

నాన్ వెజ్ ప్రియులకు మటన్ అంటే అమితమైన ప్రేమ ఉంటుంది. వీకెండ్ వస్తే చాలు దాదాపు ప్రతి ఇంట్లోనూ చికెన్, మటన్ కూర వాసన వచ్చేస్తూ ఉంటుంది. కొంత మంది వారానికి మూడు లేదా నాలుగు రోజులు మాంసాహారం తింటూ ఉంటారు. మటన్ రుచిగా ఉండటమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. అయితే.. మటన్ తిన్న వెంటనే కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల.. చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మటన్ తిన్న తర్వాత అస్సలు తినకూడని ఫుడ్స్ ఏంటో చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అజీర్ణ సమస్యలు...
Image Credit : Gemini AI Generated

అజీర్ణ సమస్యలు...

మాంసాహారం ముఖ్యంగా చికెన్, మటన్ తినేటప్పుడు మనం చేసే చిన్న పొరపాట్ల కారణంగా.. అజీర్ణం, గుండెల్లో మంట, గ్యాస్, చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మటన్ లో ప్రోటీన్, ఐరన్ అధికంగా ఉంటాయి. అందువల్ల, అది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే, మటన్ తిన్న తర్వాత పొరపాటున కూడా కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకూడదు.

పాలు, పెరుగు లేదా మజ్జిగ 

కొంతమంది మాంసాహారం తిన్న వెంటనే పాలు, పెరుగు లేదా మజ్జిగ తాగుతారు. అయితే, ఇది శరీరానికి అస్సలు మంచిది కాదని నిపుణులు అంటున్నారు. మాంసాహారం తిన్న తర్వాత వీటిని తాగడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. అంతేకాకుండా కడుపు ఉబ్బరం, విరేచనాలు, చర్మంపై దద్దుర్లు వంటి సమస్యలు కూడా రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

33
తేనె
Image Credit : others

తేనె

మటన్ తిన్న తర్వాత తేనె తినడం ఆరోగ్యానికి చాలా హానికరం. సాధారణంగా తేనె శరీరంలో వేడిని పెంచుతుంది. దానిని మటన్‌తో కలిపి తిన్నప్పుడు, శరీరంలో వేడి మరింత పెరుగుతుంది. దీనివల్ల గుండెల్లో మంట, శారీరక అసౌకర్యం కలగవచ్చు. అందువల్ల, మీకు మటన్ తిన్న తర్వాత తేనె తినే అలవాటు ఉంటే, వెంటనే దానిని మానుకోండి.

స్వీట్స్..

అంతేకాకుండా, మటన్ తిన్న తర్వాత అరటిపండ్లు, స్వీట్లు తినకూడదు. మనం తినే మటన్ జీర్ణం కావడానికి సమయం పడుతుంది కాబట్టి, వీటిని వెంటనే తినడం వల్ల కడుపులో సమస్యలు వచ్చి, మీకు అనారోగ్యంగా అనిపించవచ్చు. కాబట్టి, మటన్ తిన్న తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుని, ఆ తర్వాత మీకు నచ్చింది తినవచ్చు.

రాత్రిపూట మటన్ తినడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. మటన్ తిన్న తర్వాత తగినంత నీరు త్రాగడం చాలా ముఖ్యం. తిన్న తర్వాత మీ కడుపు చాలా బరువుగా అనిపిస్తే, అల్లం లేదా మెంతుల కషాయం తాగమని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Salt: కూరలో రుచికి కాదు, ఉప్పును కిచెన్ లో ఎన్ని రకాలుగా వాడొచ్చో తెలుసా?
Recommended image2
Gold Chain: తక్కువ బరువులో వచ్చే గోల్డ్ చైన్ డిజైన్స్ చూసేయండి
Recommended image3
Long Haram: పట్టుచీరల మీదకు పర్ఫెక్ట్ గా సూటయ్యే నక్లెస్ హారం సెట్స్
Related Stories
Recommended image1
Salt: కూరలో రుచికి కాదు, ఉప్పును కిచెన్ లో ఎన్ని రకాలుగా వాడొచ్చో తెలుసా?
Recommended image2
India's Paris: మన దేశంలో ఏ నగరాన్ని ‘పారిస్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved