Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ తప్పు చేస్తే దేవుడు కూడా క్షమించడట!
ఆచార్య చాణక్యుడు మానవ జీవితాలకు సంబంధించిన ఎన్నో విషయాలు బోధించాడు. చాణక్యుడి ప్రకారం మానవ జీవితంలో పొరపాటున కూడా చేయకూడని తప్పు ఒకటి ఉంది. ఆ తప్పు చేసే వారిని దేవుడు కూడా క్షమించడని చాణక్య నీతి చెబుతోంది. ఆ తప్పేంటో ఇక్కడ తెలుసుకుందాం.

క్షమాపణ లేని తప్పు ఏంటి?
మనుషులు అన్నాక తప్పులు చేయడం సహజం. సాధారణంగా చాలా తప్పులకీ క్షమాపణ ఉంటుంది. కానీ ఒక తప్పునకు మాత్రం అస్సలు క్షమాపణే ఉండదని చాణక్యుడు చెప్పాడు. ఆ తప్పు ఏంటో ఇక్కడ చూద్దాం.
ఆచార్య చాణక్యుడి ప్రకారం..
తల్లిదండ్రులు కావడం ఎవరి జీవితంలోనైనా సంతోషించదగ్గ విషయం. ఆచార్య చాణక్యుడి ప్రకారం.. పిల్లలు.. తల్లిదండ్రుల పేరు నిలబెడితే ఆ ఆనందానికి మించింది మరొకటి లేదు. పిల్లలను ఉన్నత స్థాయికి తీసుకురావడానికి తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు.
చాణక్య నీతి ఏం చెబుతోందంటే?
తల్లిదండ్రులు, పిల్లల గురించి ఆచార్య చాణక్యుడు ముఖ్యమైన విషయాలు బోధించాడు. చాణక్య నీతి ప్రకారం.. మనిషి ఆయుధాల కంటే మాటలతో ఎక్కువగా బాధించగలడు. కత్తి కంటే మాటలు పదునైనవి. మనం అనే కఠినమైన మాటలు ఇతరులను బాధిస్తాయి.
తల్లిదండ్రులను చెడు మాటలతో బాధపెడితే.. దానికి మించిన పాపం మరొకటి లేదని చాణక్యుడు చెప్పాడు. తల్లిదండ్రులను దూషించే వ్యక్తిని మహా పాపి అంటారని ఆయన పేర్కొన్నాడు.
దేవుడు కూడా క్షమించని తప్పు!
తల్లిదండ్రులకు దేవుని స్థానం ఇచ్చారు. పిల్లల కోసం తమ జీవితాన్నే అంకితం చేస్తారు తల్లిదండ్రులు. ఒకసారి బాణం వదిలితే వెనక్కి ఎలా రాదో.. నోటి నుంచి వచ్చిన మాట కూడా అలాగే వెనక్కి తీసుకోలేమని చాణక్య నీతి చెబుతోంది. తల్లిదండ్రులను దూషిస్తే, వారు క్షమించినా.. దేవుడు మాత్రం క్షమించడని చాణక్యుడు చెప్పాడు.
చాలామంది కోపంలో కొన్నిసార్లు తల్లిదండ్రులతో కఠినంగా మాట్లాడతారు. తర్వాత పశ్చాత్తాపడతారు. కానీ ఆ మాటలు తల్లిదండ్రుల మనసును ఎంతగానో బాధిస్తాయి. కాబట్టి తల్లిదండ్రులతో సక్రమంగా నడుచుకోవడం మంచిదని చాణక్యుడు తన బోధనల్లో వివరించాడు.