Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ 4 చోట్ల అస్సలు ఉండకూడదు! ఎందుకో తెలుసా?
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన వ్యక్తుల జీవితాలకు ఉపయోగపడే ఎన్నోవిషయాలు బోధించాడు. చాణక్యుడి ప్రకారం కొన్ని ప్రదేశాలు జీవించడానికి అనువైనవి కావట. మరి ఎలాంటి చోట అస్సలు ఉండకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
చాణక్య నీతి
ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నీతి సూత్రాలు ఆచరించదగినవి. ఈ నీతి సూత్రాల ద్వారా వ్యక్తిగత, సామాజిక విషయాలపై అవగాహన పెరుగుతుంది. కొన్నిసమస్యల నుంచి సులువుగా బయటపడేందుకు అవకాశం దొరుకుతుంది. చాణక్యుడి ప్రకారం కొన్నిప్రదేశాల్లో అస్సలు ఉండకూడదట. మరి బ్రతకడానికి అనువుగాని ఆ ప్రదేశాలేంటో ఇక్కడ చూద్దాం.
గౌరవం లేని చోట..
ఎవరైతే గౌరవించబడతారో.. వారే జీవించి ఉన్నట్లని చాణక్యుడు పేర్కొన్నాడు. ఒక చోట మీకు గౌరవం లేకపోతే.. లేదా నిరంతరం అవమానించబడితే ఆ ప్రదేశాన్ని వెంటనే వదిలి వెళ్లాలని చాణక్య నీతి చెబుతోంది. అలాంటి చోట జీవించడం చావుతో సమానమని చాణక్యుడు పేర్కొన్నాడు.
ఆదాయం లేని చోట
ఆదాయం లేని చోట కూడా జీవించకూడదని చాణక్య నీతి చెబుతోంది. ఆదాయం లేకుండా జీవితం సాధ్యం కాదు. అలాంటి చోట నివసిస్తే.. మీరు బ్రతకడానికి ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. ఇది కూడా చావుతో సమానమేనని చాణక్యుడు బోధించాడు.
బంధువులు లేని చోట
బంధువులు లేదా స్నేహితులు లేని చోటుని కూడా వదిలి వెళ్లాలని చాణక్యుడు తన నీతి సూత్రాల్లో పేర్కొన్నాడు. అలాంటి చోట మీరు ఏదైనా సమస్యలో చిక్కుకుంటే, మీకు సహాయం చేయడానికి ఎవరూ ఉండరు. ఇది చావు కంటే దారుణమని చాణక్యనీతి చెబుతోంది.
విద్య నేర్చుకునే అవకాశం లేని చోట..
చాణక్యుడి ప్రకారం విద్య నేర్చుకునే అవకాశం లేని చోట కూడా జీవించకూడదు. పాఠశాలలు, కళాశాలలు వంటి విద్యా సౌకర్యాలు లేని చోట నివసిస్తే.. మీ భవిష్యత్తు దెబ్బతింటుంది. విద్య లేని జీవితం చావు కంటే దారుణమని చాణక్యుడు బోధించాడు.