MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Fermented Food: రోజంతా హాయిగా, యాక్టివ్ గా ఉండాలంటే...ఇవి తింటే చాలు

Fermented Food: రోజంతా హాయిగా, యాక్టివ్ గా ఉండాలంటే...ఇవి తింటే చాలు

Fermented Food: ఇంటిపని, ఆఫీస్, బయట పనులతో బిజీగా ఉంటాం. అలసిపోయి స్ట్రెస్ గా ఫీలవుతాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం తినే ఫుడ్ ముఖ్యం. హవీగా తినేస్తే బద్ధకంగా ఉంటుంది. పనులు చేసుకోలేం. అందుకే రోజంతా యాక్టివ్ గా, హాయిగా ఉండాలంటే ఇవి తింటే చాలు.

2 Min read
Author : Nandini Arava
Published : Oct 29 2026, 10:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
జీర్ణక్రియ సాఫీగా సాగాలంటే గట్ హెల్త్ చాలా ముఖ్యం
Image Credit : Asianet News

జీర్ణక్రియ సాఫీగా సాగాలంటే గట్ హెల్త్ చాలా ముఖ్యం

ఇంటిపని, ఆఫీస్, బయట పనులతో బిజీగా ఉంటాం. అలసిపోయి స్ట్రెస్ గా ఫీలవుతాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం తినే ఫుడ్ ముఖ్యం. హవీగా తినేస్తే బద్ధకంగా ఉంటుంది. పనులు చేసుకోలేం. అందుకే రోజంతా యాక్టివ్ గా, హాయిగా ఉండాలంటే ఇవి తింటే చాలు. జీర్ణం కానివి, ఎక్కువ ఫుడ్ తినడం వల్ల జీర్ణవ్యవస్థపై భారం పడుతుంది. ఆలస్యంగా జీర్ణమవుతుంది. కాబట్టి గట్ హెల్త్ ముఖ్యం. మన జీర్ణక్రియ సాఫీగా సాగాలంటే ఇది చాలా ముఖ్యం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
ఉసిరికాయ
Image Credit : Asianet News

ఉసిరికాయ

పులియబెట్టిన ఉసిరికాయ పొట్టకు చాలా మంచిది. ఉప్పు, నీళ్లు వాడి ఇంట్లోనే దీన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఉసిరికాయలను కడిగి తుడవండి. ముక్కలుగా కోసి ఒక గాజు సీసాలో వేయండి. ఉసిరి బరువులో 2 శాతం ఉప్పు కలపండి. ముక్కలు మునిగేలా కాచి చల్లార్చిన నీళ్లు పోయండి. మూత గట్టిగా పెట్టి, రూమ్ టెంపరేచర్ దగ్గర కొన్ని రోజులు పులియనివ్వండి. ఆ తర్వాత ఫ్రిజ్‌లో పెట్టుకుని వాడుకోవచ్చు.

38
గ్రీక్ యోగర్ట్
Image Credit : Asianet News

గ్రీక్ యోగర్ట్

ఇంట్లో చేసుకునే గ్రీక్ యోగర్ట్ మరో బెస్ట్ ప్రోబయోటిక్ ఫుడ్. 500 ml పాలను వేడి చేసి, గోరువెచ్చగా అయ్యేదాకా చల్లార్చండి. దానికి 1 లేదా 2 టీస్పూన్ల పెరుగు కలిపి పక్కన పెట్టండి. మూతపెట్టి 6 నుంచి 10 గంటల పాటు వెచ్చని చోట ఉంచితే పెరుగు తోడుకుంటుంది. ఆ తర్వాత ఒక శుభ్రమైన కాటన్ బట్టలో వేసి 2 నుంచి 4 గంటల పాటు వడకడితే, చిక్కటి క్రీమీ గ్రీక్ యోగర్ట్ రెడీ అవుతుంది. దీన్ని రోజూ భోజనంలో లేదా స్నాక్స్‌లా తినొచ్చు.

48
రాగి జావ
Image Credit : Asianet News

రాగి జావ

పులియబెట్టిన రాగి జావ (అంబలి) పొట్టకు అద్భుతమైన ఆహారం. రాగి పిండిని నీళ్లలో కలిపి మెత్తటి జావలా ఉడికించండి. ఆ తర్వాత దాన్ని చల్లారనివ్వండి. దానికి ఒక చెంచా పెరుగు వేసి బాగా కలపండి. ఒక శుభ్రమైన గిన్నెలో వేసి, వెచ్చని ప్రదేశంలో 6 నుంచి 8 గంటల పాటు పులియనివ్వండి. బాగా పులిసిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టుకుని తాగొచ్చు.

58
చద్దన్నం
Image Credit : Asianet News

చద్దన్నం

పులియబెట్టిన అన్నం నీళ్లు (చద్దన్నం) గట్ హెల్త్‌కు చాలా మంచిది. దీన్ని చేయడం కూడా చాలా ఈజీ. రాత్రి మిగిలిన అన్నంలో తాగే నీళ్లు పోసి నానబెట్టండి. మూతపెట్టి 8 నుంచి 12 గంటల పాటు రూమ్ టెంపరేచర్ దగ్గర అలాగే వదిలేయండి. మరుసటి రోజు ఉదయం అందులో కొద్దిగా ఉప్పు వేసుకుని తాగండి.

68
గట్ హెల్త్
Image Credit : Asianet News

గట్ హెల్త్

పులియబెట్టిన ఆహారాలు చాలా త్వరగా జీర్ణం అవుతాయి. ఇవి మన శరీరంలో మెటబాలిజంను మెరుగుపరుస్తాయి. బరువు తగ్గడానికి కూడా ఇవి సాయపడతాయి. ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతాయని, బరువు తగ్గడంలో సాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ 4 ఫుడ్స్ ఏంటో చూద్దాం.

78
బ్యాక్టీరియా బ్యాలెన్స్‌ అవుతుంది
Image Credit : Asianet News

బ్యాక్టీరియా బ్యాలెన్స్‌ అవుతుంది

పొట్ట ఆరోగ్యం మన జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, మెటబాలిజం, మానసిక ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతుంది. ప్రోబయోటిక్స్ అంటే మన కడుపు, పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా బ్యాలెన్స్‌ను కాపాడే సజీవ సూక్ష్మజీవులు. గట్ మైక్రోబయోమ్ బ్యాలెన్స్‌గా ఉంటే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ప్రోబయోటిక్స్ మన పేగుల పనితీరును మెరుగుపరుస్తాయి.

88
డైట్‌కు బెస్ట్ ఆప్షన్
Image Credit : Asianet News

డైట్‌కు బెస్ట్ ఆప్షన్

బ్యాక్టీరియా, ఈస్ట్ లాంటి సూక్ష్మజీవులు ఆహారంలోని చక్కెర, పిండి పదార్థాలను విడగొట్టే సహజ ప్రక్రియనే 'ఫర్మెంటేషన్' (పులియబెట్టడం) అంటారు. దీనివల్ల ఆహారం రుచి, పోషకాలు పెరుగుతాయి. కానీ, పులియబెట్టినవన్నీ 'ప్రోబయోటిక్' ఫుడ్స్ కావు. ఉదాహరణకు, ఇడ్లీ, దోశ పిండిని పులియబెట్టినా, వాటిని ఉడికించినప్పుడు అందులోని మంచి బ్యాక్టీరియా చనిపోతుంది. అందుకే, సహజంగా పులియబెట్టిన ఆహారాలను మన డైట్‌లో చేర్చుకోవడం మంచి బ్యాక్టీరియాను పెంచుకోవడానికి బెస్ట్ ఆప్షన్.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
ఆహారం
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329
AUSAUS
(90.0 ov)330/4
Day 2
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Recommended Stories
Recommended image1
Kitchen Hacks: కూరలో ఉప్పు, కారం ఎక్కువైందా? చిటికెలో సరిచేసే సీక్రెట్ టిప్స్
Recommended image2
Blouse Designs: తక్కువ బడ్జెట్ లో గ్రాండ్ లుక్ తెచ్చే బ్లౌజు డిజైన్లు
Recommended image3
Coolest State: భారతదేశంలో అత్యంత చల్లని రాష్ట్రం ఇదే..ఎటు చూసినా మంచే
Related Stories
Recommended image1
Water Chestnut: మార్కెట్లో నల్లగా కనిపించే ఈ కాయల పేరేంటి? వీటిని ఎక్కడ పండిస్తారు?
Recommended image2
Weight Loss Teas: వెయిట్ లాస్ టీ...ఇది తాగితే చాలు ఒంట్లో కొవ్వు అలా కరిగిపోద్ది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved