Weight Loss Teas: వెయిట్ లాస్ టీ...ఇది తాగితే చాలు ఒంట్లో కొవ్వు అలా కరిగిపోద్ది
Weight Loss Teas: బరువు తగ్గాలంటే టీలు, కాఫీలు మానేయాలి అనుకుంటారు. కానీ టీ తాగుతూ కూడా బరువు తగ్గొచ్చు. అయితే ఇక్కడ ఇచ్చిన ఈ టీలు ఒకసారి ట్రై చేయండి. క్రమంగా వెయిట్ లాస్ అవుతారు.నాజుగ్గా కనిపిస్తారు.

బరువు తగ్గించే 6 రకాల టీలు
బరువు తగ్గడంలో కొన్ని రకాల టీలు చాలా బాగా పనిచేస్తాయి. మొక్కల నుంచి తయారయ్యే ఈ హెర్బల్ టీలలో ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పైగా వీటిలో క్యాలరీలు కూడా ఉండవు. బరువు తగ్గాలనుకునే వారు తమ డైట్‌లో చేర్చుకోవాల్సిన 6 రకాల టీలు ఇవే..
గ్రీన్ టీలో 'కాటెచిన్స్' పుష్కలంగా ఉంటాయి
గ్రీన్ టీలో 'కాటెచిన్స్' ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా 'ఎపిగాల్లోకాటెచిన్ గాలెట్' అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. అలాగే ఇందులో కెఫిన్ కూడా ఉంటుంది. ఇవి మన శరీరంలో కొవ్వును కరిగించి, ఎనర్జీని పెంచుతాయి. కెఫిన్ ఉండటం వల్ల ఇది గుండె జబ్బులు, మధుమేహం రాకుండా కూడా అడ్డుకుంటుంది.
వేడి నీళ్లలో ఆకులు వేసి ఊలాంగ్ టీ తయారు చేస్తారు
ఊలాంగ్ టీ అనేది చైనాకు చెందిన ఒక సాంప్రదాయక టీ. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసే కాటెచిన్స్‌తో పాటు పాలీఫెనాల్స్ ఉంటాయి. వేడి నీళ్లలో ఈ ఆకులను వేసి ఊలాంగ్ టీని తయారు చేస్తారు. ఇందులో కూడా కెఫిన్ ఉంటుంది.
అల్లం టీ తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి
అల్లం టీ తాగడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. దీనివల్ల ఆకలి తగ్గుతుంది. ఇందులో ఉండే జింజరాల్స్, షోగోల్స్ అనేవి ఇందుకు కారణం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా మెరుగుపరుస్తుంది.
బరువు తగ్గడానికి మందార టీ సూపర్ ఛాయిస్
బరువు తగ్గడానికి మందార టీ చాలా బాగా ఉపయోగపడుతుంది. వేడి నీళ్లలో మందార పూలు వేసి, రంగు మారగానే తీసేయాలి. ఆ నీళ్లలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుంటే మందార టీ రెడీ. ఈ పూలలో ఉండే ఫ్లేవనాయిడ్స్, ఆంథోసైనిన్స్ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి బీపీ, షుగర్‌ను కంట్రోల్ చేస్తాయి.
పెప్పర్‌మింట్ టీ ఆకలిని తగ్గించి బరువును కంట్రోల్ చేస్తుంది
పెప్పర్‌మింట్ ఆకుల్లోని నూనె వికారం, అజీర్తి, పేగు సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. బరువును కంట్రోల్ చేయడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు, తలనొప్పి, దంత క్షయం, ఆందోళన వంటి సమస్యలకు కూడా ఇది మంచి మందులా పనిచేస్తుంది.
దాల్చిన చెక్క టీ ఆకలిని తగ్గించి బరువు తగ్గేలా చేస్తుంది
దాల్చిన చెక్క టీ నేరుగా కొవ్వును కరిగించకపోయినా, బరువు తగ్గడానికి పరోక్షంగా సాయపడుతుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. ఆకలిని తగ్గించడం ద్వారా బరువు తగ్గేలా చేస్తుంది.





