MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Rice Water: రాత్రి పడుకునే ముందు ఈ నీటిని ఫేస్ కి వాడితే పార్లర్ అవసరమే ఉండదు!

Rice Water: రాత్రి పడుకునే ముందు ఈ నీటిని ఫేస్ కి వాడితే పార్లర్ అవసరమే ఉండదు!

Rice Water: అందంగా కనిపించాలంటే ఖరీదైన ప్రోడక్ట్స్ కచ్చితంగా వాడాలని చాలామంది అనుకుంటారు. కానీ మన ఇంట్లో ఉండే కొన్ని సహజ పదార్థాలతో కాంతివంతమైన ముఖాన్ని పొందవచ్చు. మరి ముఖానికి మెరుపునిచ్చే ఆ సహజ పదార్థాలేంటో, ఎలా వాడాలో ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Jun 23 2026, 06:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కాంతివంతమైన చర్మం కోసం బియ్యం నీరు
Image Credit : Getty

కాంతివంతమైన చర్మం కోసం బియ్యం నీరు

రాత్రి పడుకునే ముందు సరైన స్కిన్ కేర్ తప్పనిసరి. దానివల్ల చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుతుంది. నిపుణుల ప్రకారం ముఖాన్ని అందంగా, కాంతివంతంగా మార్చడంలో బియ్యం నీరు చక్కగా సహాయపడుతుంది. ఈ నీటిని సరైన విధంగా ఉపయోగిస్తే స్కిన్ టోన్ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి బియ్యం నీటిని చర్మానికి ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
బియ్యం నీటి ప్రయోజనాలు
Image Credit : Getty

బియ్యం నీటి ప్రయోజనాలు

బియ్యం నీటిలో విటమిన్లు, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని శాంతింపజేసి, వాపు, మంట తగ్గించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో మన చర్మం రిపేర్ మోడ్‌లోకి వెళ్తుంది. అదే సమయంలో స్కిన్ పై సరైన న్యూట్రిషన్ అందితే సెల్స్ రీజెనరేషన్ బాగా జరుగుతుంది. అందుకే పడుకునే ముందు రైస్ వాటర్ ని టోనర్‌గా వాడటం మంచిది.

Related Articles

Related image1
Hair Care Tips: దువ్వెన వల్ల జుట్టు రాలుతుందా? చాలామంది చేసే 5 తప్పులు ఇవే!
Related image2
Banana: రోజూ ఒక అరటిపండు తింటే శరీరంలో జరిగే 5 అద్భుతమైన మార్పులు ఇవే!
36
రైస్ వాటర్ తయారీ విధానం
Image Credit : pinterest

రైస్ వాటర్ తయారీ విధానం

రైస్ వాటర్‌ను సరైన విధంగా తయారు చేయడం కూడా ముఖ్యమే. బియ్యాన్ని బాగా కడిగి, శుభ్రమైన నీటిలో 20–30 నిమిషాలు నానబెట్టి ఆ నీటిని వాడటం మంచిది. కొంతమంది ఫెర్మెంటెడ్ రైస్ వాటర్ ఉపయోగిస్తారు. కానీ అది సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి ఇబ్బంది కలిగించవచ్చు.

46
రైస్ వాటర్ ఎలా వాడాలంటే?
Image Credit : stockPhoto

రైస్ వాటర్ ఎలా వాడాలంటే?

రాత్రి పడుకునే ముందు ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత కాటన్ సహాయంతో ఫిల్టర్ చేసిన బియ్యం నీటిని ముఖానికి అప్లై చేయాలి. 10 నుంచి 15 నిమిషాలు అలాగే ఉంచి, సహజంగా ఆరనివ్వాలి. తర్వాత నార్మల్ వాటర్ తో కడిగిస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల స్కిన్ హైడ్రేటెడ్‌గా ఉండి, ఉదయం లేవగానే ఫ్రెష్‌గా కనిపిస్తుంది.

56
ఆయిలీ స్కిన్ కి ఎక్కువ లాభం
Image Credit : stockPhoto

ఆయిలీ స్కిన్ కి ఎక్కువ లాభం

ఈ రైస్ వాటర్ చిట్కా.. ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇది ఎక్సెస్ ఆయిల్‌ను కంట్రోల్ చేయడంలో సహయపడుతుంది. డ్రై స్కిన్ ఉన్నవారు మాత్రం దీని తర్వాత మాయిశ్చరైజర్ వాడటం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మొదటిసారి వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.

66
మంచి ఫలితాలు రావాలంటే?
Image Credit : Freepik

మంచి ఫలితాలు రావాలంటే?

నిపుణుల ప్రకారం రైస్ వాటర్‌ను రాత్రి సమయంలో ఉపయోగించడం వల్ల స్కిన్ టోన్ క్రమంగా ఇంప్రూవ్ అవుతుంది. ముఖ్యంగా డల్ స్కిన్, చిన్న మచ్చలు, టాన్ వంటి సమస్యల్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. కానీ ఈ వాటర్ ని రెగ్యులర్‌గా ఉపయోగించినప్పుడు మాత్రమే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
సౌందర్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు
Recommended image2
Wall Stickers: గోడపై అంటుకున్న స్టిక్కర్లను పెయింట్ పోకుండా ఇలా ఈజీగా తీసేయండి!
Recommended image3
Sleep Problems: నిద్రలో పదేపదే మెలకువ వస్తోందా? ఈ 5 విషయాలు చెక్ చేసుకోండి!
Related Stories
Recommended image1
Hair Care Tips: దువ్వెన వల్ల జుట్టు రాలుతుందా? చాలామంది చేసే 5 తప్పులు ఇవే!
Recommended image2
Banana: రోజూ ఒక అరటిపండు తింటే శరీరంలో జరిగే 5 అద్భుతమైన మార్పులు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved