MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Bathroom Cleaning: డోర్లు మూసి బాత్రూమ్ క్లీన్ చేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు

Bathroom Cleaning: డోర్లు మూసి బాత్రూమ్ క్లీన్ చేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు

బాత్రూమ్ క్లీన్ గా ఉంటేనే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారని చాలామంది నమ్ముతారు. కానీ బాత్రూమ్‌ శుభ్రం చేసేటప్పుడు మనం చేసే కొన్ని తప్పుల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా బాత్రూమ్ డోర్లు, కిటికీలు మూసి క్లీన్ చేయడం చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. 

2 Min read
Author : Kavitha G
Published : Dec 17 2025, 03:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
బాత్రూమ్ క్లీనింగ్ టిప్స్
Image Credit : Getty

బాత్రూమ్ క్లీనింగ్ టిప్స్

ఇంటి శుభ్రతలో బాత్రూమ్ క్లీనింగ్ కూడా ముఖ్యమైన పని. కానీ చాలా మంది తెలియక చేస్తున్న చిన్న తప్పు ఆరోగ్యానికి పెద్ద ప్రమాదంగా మారుతోంది. బాత్రూమ్ డోర్లు, కిటికీలు పూర్తిగా మూసి శుభ్రం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కెమికల్ ఆధారిత క్లీనర్లు వాడే సమయంలో ఇది మరింత ప్రమాదకరంగా మారుతుంది. క్లోస్డ్ బాత్రూమ్‌లో విష వాయువులు వేగంగా పేరుకుపోయి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఊపిరితిత్తులపై చెడు ప్రభావం
Image Credit : Getty

ఊపిరితిత్తులపై చెడు ప్రభావం

నిపుణుల ప్రకారం.. బాత్రూమ్ క్లీనింగ్‌కు ఉపయోగించే ఫినాయిల్, బ్లీచింగ్ పౌడర్, యాసిడ్ క్లీనర్ల వంటి వాటిలో హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి వాడినప్పుడు గాలిలోకి విష వాయువులు విడుదలవుతాయి. బాత్రూమ్ డోర్లు మూసి ఉండటం వల్ల అవి లోపలే పేరుకుపోతాయి. శుభ్రం చేస్తున్న వ్యక్తి వాటిని పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

Related Articles

Related image1
రాత్రిపూట జుట్టుకు నూనె పెడితే ఏమవుతుందో తెలుసా?
Related image2
ఉసిరిని రెగ్యులర్ గా తీసుకుంటే కలిగే లాభాలు ఇవే!
37
ఈ సమస్యలు తప్పవు
Image Credit : Getty

ఈ సమస్యలు తప్పవు

ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, ఆస్తమా లేదా అలెర్జీ సమస్యలు ఉన్నవారికి ఇది అత్యంత ప్రమాదకరం. మూసివేసిన బాత్రూమ్‌లో ఎక్కువసేపు క్లీనింగ్ చేస్తే తలనొప్పి, కళ్లు మంటలు, గొంతులో మంట, వాంతులు, మత్తుగా అనిపించడం వంటి సమస్యలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో ఆక్సిజన్ లోపం వల్ల స్పృహ కోల్పోయే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

47
కెమికల్స్ కలిపి వాడటం..
Image Credit : AI

కెమికల్స్ కలిపి వాడటం..

కొంతమంది క్లీనింగ్ త్వరగా పూర్తికావాలని ఒకటి కంటే ఎక్కువ కెమికల్స్ కలిపి వాడుతుంటారు. అది చాలా ప్రమాదకరం. యాసిడ్ క్లీనర్‌తో బ్లీచింగ్ పౌడర్ కలపడం వల్ల క్లోరిన్ గ్యాస్ విడుదలవుతుంది. ఇది అత్యంత విషపూరితమైన వాయువు. మూసి ఉన్న బాత్రూమ్‌లో ఇది క్షణాల్లోనే ప్రాణాంతకంగా మారుతుంది.

57
ప్రమాదకరమైన వ్యాధులు
Image Credit : freepik

ప్రమాదకరమైన వ్యాధులు

క్లీనింగ్ సమయంలో మన శరీరం ఎక్కువగా శ్రమిస్తుంది. కాబట్టి శ్వాస వేగం పెరుగుతుంది. అదే సమయంలో విష వాయువులు ఎక్కువగా పీల్చుకుంటే అవి నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లి నష్టం కలిగిస్తాయి. దీర్ఘకాలంలో ఇది లంగ్ ఇన్ఫెక్షన్లు, అలెర్జీలు, ఆస్తమా తీవ్రత పెరగడానికి కారణం కావచ్చు. కాబట్టి క్లీనింగ్‌ను చాలా తేలికగా తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

67
బాత్రూమ్‌ను సురక్షితంగా ఎలా శుభ్రం చేయాలి?
Image Credit : Gemini AI

బాత్రూమ్‌ను సురక్షితంగా ఎలా శుభ్రం చేయాలి?

నిపుణుల సలహా ప్రకారం బాత్రూమ్ క్లీన్ చేసే ముందు తప్పనిసరిగా డోర్లు, కిటికీలు పూర్తిగా తెరిచి ఉంచాలి. బాత్రూమ్‌లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటే అది ఆన్ చేయాలి. ఇలా చేస్తే విష వాయువులు బయటకు వెళ్లి గాలి ప్రసరణ సరిగ్గా ఉంటుంది. అలాగే మాస్క్, గ్లోవ్స్ ధరించడం వల్ల కెమికల్స్ నేరుగా శరీరాన్ని తాకకుండా ఉంటాయి. 

77
సహజ క్లీనర్ల వాడకం
Image Credit : perplexity.ai

సహజ క్లీనర్ల వాడకం

క్లీనింగ్ కెమికల్స్‌ను ఎప్పుడూ కలిపి వాడకూడదు. ఒకసారి ఒక క్లీనర్ వాడిన తర్వాత బాగా నీటితో కడిగి.. ఆ తర్వాత మరొకటి వాడాలి. వీలైతే కెమికల్ క్లీనర్లకు బదులు వెనిగర్, బేకింగ్ సోడా వంటి సహజ ప్రత్యామ్నాయాలను వాడటం మంచిది.  

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఆరోగ్యం
చిట్కాలు మరియు ఉపాయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
మహిళలు నలభై దాటాక తిండి తగ్గించినా కూడా బరువు తగ్గడం కష్టమే
Recommended image2
Fish: చేపలతో పాటు వీటిని పొరపాటున కూడా తీసుకోకూడదు!
Recommended image3
Parenting: మీ ఇంట్లో టీనేజ్ పిల్లలు ఉన్నారా? పేరెంట్స్ మార్చుకోవాల్సిన 5 అలవాట్లు ఇవే
Related Stories
Recommended image1
రాత్రిపూట జుట్టుకు నూనె పెడితే ఏమవుతుందో తెలుసా?
Recommended image2
ఉసిరిని రెగ్యులర్ గా తీసుకుంటే కలిగే లాభాలు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved