Vastu tips: లెక్కపెట్టి చపాతీలు చేయడం, వడ్డించడం చేస్తున్నారా? ఎంత తప్పో తెలుసా?
Vastu tips: వాస్తు ప్రకారం ఇంట్లో చేసిన ప్రతి పని సవ్యంగా ఉండాలి. ముఖ్యంగా చపాతీలు చేసేటప్పుడు లెక్కపెట్టి చేయడం, వడ్డించడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి.

లెక్కపెట్టి చపాతీలు, రోటీలు చేయద్దు
భారతీయ ఆహారంలో రోటీలు, చపాతీలు భాగమైపోయాయి. బరువు తగ్గేందుకు ఎంతో మంది రోటీలు, చపాతీలు తినేందుకు ఇష్టపడుతున్నారు. రోజూ ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు వీటిని ఎప్పుడైనా తినేందుకు ఇష్టపడతారు. చాలా ఇళ్లలో రోటీలు చేసేటప్పుడు ముందే ఎన్ని అవసరమో లెక్కపెట్టి చేస్తారు. అలాగే వడ్డించినప్పుడు కూడా లెక్కపెట్టి పెడతారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ అలవాటు మంచిది కాదు. ఆహారం అనేది కేవలం ఆకలి తీర్చే పని మాత్రమే కాదు.. అది ఇంట్లో సానుకూల శక్తికి మూలం అని వాస్తు చెబుతుంది. రోటీలు లెక్కపెట్టి చేయడం వల్ల మనసులో ఏదో తెలియని కొరతగా అనిపిస్తుంది. ఈ కొరత భావమే ఇంట్లో సంపద, శాంతి, సంతోషాన్ని తగ్గించగలదని నమ్మకం. అందుకే రోటీలను చేసి, ఆనందంగా వడ్డించాలని వాస్తు నిపుణులు సూచిస్తారు.
ఇలా వండకూడదు
వాస్తు శాస్త్రం ప్రకారం వంట చేసే వ్యక్తి మనసు కూడా చాలా ముఖ్యం. రొటీలు చేసే సమయంలో తొందర, ఒత్తిడి, లెక్కల ఆలోచనలు ఉంటే ఆ భావం ఆహారంలోకి చేరుతుందని వాస్తు చెబుతోంది. అలాంటి ఆహారం తిన్నప్పుడు కుటుంబ సభ్యుల్లో అసంతృప్తి, చిరాకు, గొడవలు పెరిగే అవకాశం ఉందని చెబుతారు. అందుకే చపాతీలు, రోటీలు చేసేటప్పుడు మనసు ప్రశాంతంగా, ఆనందంగా ఉండాలని సూచిస్తారు. అవసరానికి మించిన రోటీలు తయారైనప్పటికీ అవి వృథా కాకుండా చేయాలని వాస్తు చెబుతుంది. మిగిలిన చపాతీలను పశువులకు పెట్టడం లేదా అవసరమైన వారికి పంచడం మంచిది. ఇలా చేయడం వల్ల దయ, పంచుకునే భావం పెరిగి ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని నమ్మకం ఉంది.
లెక్కపెట్టి వడ్డించకండి
పూర్వకాలం నుంచి వస్తున్న సంప్రదాయాలు చెబుతున్న ప్రకారం రోటీలను లెక్కపెట్టడం మంచిది కాదు. పెద్దలు ఎప్పుడూ ఆహారాన్ని లెక్కలతో ముడిపెట్టరు. ఇంటికి వచ్చిన అతిథి తృప్తిగా తినే వరకు వడ్డించడమే మన ఆచారం. ప్రతి వ్యక్తికి ఇన్ని రోటీలే అని చెప్పి చేయడం ఆతిథ్య భావానికి విరుద్ధమని భావించేవారు. వాస్తు శాస్త్రం కూడా ఇదే భావాన్ని ప్రోత్సహిస్తుంది. ఆహారంలో పరిమితి భావం పెరిగితే అది జీవితం మొత్తం మీద ప్రభావం చూపుతుందని చెబుతుంది. ఇంట్లో ఎప్పుడూ కొరత ఉందన్న ఆలోచన ఏర్పడితే, అదే భావం ఇతర విషయాల్లో కూడా కనిపిస్తుందని నమ్మకం. అందుకే తినేవారికి ఇంకా కావాలంటే స్వేచ్ఛగా తినేలా ఆహారాన్ని వండడం మంచిది.
ఇలా చేస్తే సంతోషకరమైన జీవితం
మొత్తంగా చూస్తే రోటీలు లెక్కపెట్టి చేయడం లేదా వడ్డించడం అనేది కేవలం వంటగదికి సంబంధించిన అలవాటు మాత్రమే కాదు.. అది మన ఆలోచన విధానాన్ని కూడా చూపిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఆహారంలో లెక్కలు కాకుండా తృప్తి, ఆనందం, ఆతిథ్య భావం ఉండాలి. అప్పుడు ఇంట్లో శాంతి, సుఖసమృద్ధి నిలుస్తుందని నమ్మకం ఉంది. ఇవన్నీ శాస్త్రీయ ఆధారాలపై కాకుండా సంప్రదాయ నమ్మకాలపై ఆధారపడ్డ విషయాలే అయినా కుటుంబంలో ప్రేమ, పంచుకునే గుణాన్ని పెంచే ఆచారాలుగా వీటిని పాటించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే రోజువారీ జీవితంలో చిన్న చిన్న విషయాల్లో కూడా సానుకూల ఆలోచనలను అలవాటు చేసుకోవడం ఎంతో అవసరం అని వారు సూచిస్తున్నారు.

