MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Food in 40s: నలభై ఏళ్లు దాటాయా? అయితే వీటిని మీరు కచ్చితంగా తినాలి

Food in 40s: నలభై ఏళ్లు దాటాయా? అయితే వీటిని మీరు కచ్చితంగా తినాలి

Food in 40s: నలభై ఏళ్లు దాటిందంటే చాలు అనేక ఆరోగ్య సమస్యలు రావడానికి సిద్ధంగా ఉంటాయి. ముఖ్యంగా మహిళలు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలి. నలభై ఏళ్లు దాటిన మహిళలు, పురుషులు తమ డైట్‌లో తప్పనిసరిగా కొన్ని ఆహారాలను చేర్చుకోవాలి.

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 01 2026, 01:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కివి పండ్లు
Image Credit : Getty

కివి పండ్లు

కివీ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. అన్ని వయసుల వారు వీటిని తినాల్సిన అవసరం ఉంది. ఈ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఫైబర్ ఉండడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. చర్మాన్ని కూడ కాంతివంతంగా మారుస్తుంది. 40 ఏళ్లు దాటిన వారు కివీ పండ్లు తింటే వ్యాధులను తట్టుకునే శక్తి ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పెరుగు
Image Credit : pexels

పెరుగు

పెరుగును ప్రతిరోజూ తినడం వల్ల 40 ఏళ్లు దాటిన వారిలో ఎముకలు గట్టిపడతాయి. శరీరానికి మంచి ప్రొటీన్ లభిస్తుంది. కండరాల బలం పెరుగుతుంది. ఇందులో ప్రొబయోటిక్స్ ఉంటాయి. అవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఆహారం. ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచుతుంది.

Related Articles

Related image1
Kids Before marriage: పెళ్లికి ముందే పిల్లల్ని కనాల్సిందే, ఆ తర్వాతే పెళ్లి.. ఎక్కడో కాదు మనదేశంలోనే
Related image2
Washing Machine: వాషింగ్ మెషీన్ కొనే ముందు ఈ స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి
36
ప్రూన్స్
Image Credit : others

ప్రూన్స్

ప్రూన్స్ సూపర్ మార్కెట్లో అధికంగా ఉంటాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనివల్ల మలబద్ధకం సమస్య రాకుండా ఉంటుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి నలభై ఏళ్ల వయసు దాటిన వారిలో రక్తహీనత సమస్య రాకుండా కాపాడతాయి. వీటిలో కాల్షియం,విటమిన్ కె వంటివి ఎముకలు బలంగా ఉండేలా చూస్తాయి. గుండెకు రక్షణ కల్పిస్తాయి. రోజుకు రెండు మూడు ప్రూన్స్ తింటే చాలు.

46
బ్లూబెర్రీ
Image Credit : Asianet News

బ్లూబెర్రీ

బ్లూబెర్రీ పండ్లు ప్రతి ఒక్కరూ తినాలి. వీటిలో మన శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని రోగాల బారిన పడకుండా కాపాడతాయి. గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. చర్మానికి కాంతిని అందిస్తాయి. ఏజింగ్ లక్షణాలు రాకుండా కాపాడతాయి. వీటిలో ఫైబర్ ఉండడం వల్ల జీర్ణక్రియ వంటివి సవ్యంగా జరుగుతాయి.

56
మష్రూమ్
Image Credit : Getty

మష్రూమ్

కొన్ని పుట్టగొడుగులు మనకు అత్యవసరమైన పోషకాలను అందిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఈ పుట్టగొడుగుల్లో ప్రొటీన్, విటమిన్ బి, విటమిన్ డి, పొటాషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. పుట్టగొడుగులు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఉత్తమ ఆహారం. వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ మాత్రం అధికంగా ఉంటుంది. పుట్టగొడుగులు తింటే శరీరం ఆరోగ్యంగా ఉండడం ఖాయం.

66
అవిసె గింజలు
Image Credit : Getty

అవిసె గింజలు

అవిసె గింజలు ఆరోగ్యానికి అవసరమైనవి.ఇవి చాలా తక్కువ ధరకే లభిస్తాయి. వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని ఇవి కాపాడతాయి. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గేందుకు ఉపయోగపడతాయి. బరువును కూడా తగ్గిస్తాయి. జుట్టును ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. నలభై ఏళ్లు దాటినవారు ప్రతిరోజూ అవిసెగింజలను తమ ఆహారంలో భాగం చేసుకోవాలి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
జుట్టుకు నూనె రాస్తున్నారా? ఈ తప్పులు చేస్తే జుట్టు పెరగడం కాదు రాలుతుంది
Recommended image2
రోజూ ఒక పెగ్ ఆల్కహాల్ తాగితే గుండెకు మంచిదా? అసలు నిజమేంటి?
Recommended image3
Milk at Night: రాత్రి పడుకునే ముందు పాలు తాగితే నిజంగా నిద్ర బాగా పడుతుందా?
Related Stories
Recommended image1
Kids Before marriage: పెళ్లికి ముందే పిల్లల్ని కనాల్సిందే, ఆ తర్వాతే పెళ్లి.. ఎక్కడో కాదు మనదేశంలోనే
Recommended image2
Washing Machine: వాషింగ్ మెషీన్ కొనే ముందు ఈ స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved