Soft Chapatis: చపాతీలు మెత్తగా రావాలంటే పిండిలో వీటిని కలపండి
Soft Chapatis: ఒకప్పుడు అన్నమే తినేవాళ్లం. ఇప్పుడు చపాతీలు అధికంగా తింటున్నాం. చపాతీలు మెత్తగా రావాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అవి మెత్తగా, మృదువుగా రావాలంటే పిండిలో ఏ పదార్థాలు కలపాలో తెలుసుకోండి.

చపాతీలు మెత్తగా రావాలా?
చపాతీలు ప్రతిరోజూ తినేవారు ఎంతో మంది. అయితే చపాతీలు గట్టిగా వస్తే తినబుద్ది కాదు. అందుకే చపాతీలు, రోటీలు మెత్తగా చేసుకోవాలి. కొంతమంది పిండిని రాత్రిపూటే కలిపి ఫ్రిజ్ లో పెట్టుకుంటారు. ఉదయం లేచి వాటితో చపాతీలు చేసుకుంటారు. ఇలాంటప్పుడు చపాతీలు గట్టిగా వచ్చేస్తాయి. అలా రాకుండా ఉండాలంటే చపాతీ పిండి ఎలా కలపాలో, అందులో ఎలాంటి పదార్థాలు కలిపి పిండిని తయారుచేయాలో తెలుసుకోండి.
చపాతీ చేసేందుకు టిప్స్
రాత్రిపూటే మీకు చపాతీ పిండి కలిపి ఫ్రిజ్ పెట్టుకునేవారైతే..అందులో కొన్ని పదార్థాలు కలపండి. దీనివల్ల ఉదయానే త్వరగా చపాతీలు చేసుకోవచ్చు. అవి కూడా మెత్తగా వస్తాయి. మధ్యాహ్నం లంచ్ బాక్స్ కు కూడా చపాతీలు తీసుకెళ్లవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు ఇలా చేసిన మెత్తగా ఉన్న చపాతీలను ఇష్టపడతారు. వీటిని చేయడం కష్టమేమీ కాదు. ఇంట్లో ఉన్న వస్తువులను కలపడంతోనే వీటిని మెత్తగా వచ్చేలా చేసుకోవచ్చు.
పిండిలో ఏమి కలపాలి?
చపాతీ పిండిని కలిపేటప్పుడే కొన్ని రకాల పదార్థాలు వేయాలి. ముందుగా ఒక కప్పు వేడి పాలు కలపాలి. నీటితో పాటూ వేడిపాలు కలపడం వల్ల చపాతీలను మెత్తగా ఉంటాయి. అది కూడా ఎక్కువకాలం పాటూ మెత్తగా ఉండేందుకు సహాయపడుతుంది. రాత్రి పిండి కలిపి ఉదయం చపాతీలు చేసినా అవి సాఫ్ట్‌గా, మృదువుగా ఉంటాయి. దీనివల్ల మీ సమయం కూడా ఆదా అవుతుంది. పాలు కలపడం వల్ల వాటి రుచి కూడా అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలు వీటిని బాగా ఇష్టపడతారు.
ఎలా నిల్వ చేయాలి?
చపాతీ పిండిని కలిపిన తరువాత దాన్ని జాగ్రత్తగా నిల్వ చేయాలి. పిండిని కలిపి తడిలేని గిన్నె లేదా కంటైనర్లో ఉంచాలి. పైన పొడిగా ఉండే కాటన్ వస్త్రాన్ని కప్పాలి. ఇలా చేయడం వల్ల కూడా చపాతీలు మెత్తగా ఉంటాయి. చపాతీ పిండిని కలిపేటప్పుడు వంట నూనె లేదా నెయ్యి వాడినా మంచిదే. అది కూడా చపాతీలు మెత్తగా వస్తాయి. కానీ నిజానికి చపాతీ చేయడానికి అరగంట ముందే పిండిని కలిపి పెట్టుకోవడం మంచిది. పిండి కలిపిన తరువాత కేవలం 15 నిమిషాలపాటూ నానితే చాలు. చపాతీలు చాలా రుచిగా, మెత్తగా వస్తాయి.

