గుడ్డు మెత్తగా ఉడకాలంటే 8 నిమిషాలు ఉడికిస్తే పచ్చసొన సగం ఉడుకుతుంది. తెల్లసొన ముప్పావు వంతు ఉడుకుతుంది. ఇది కూడా తినడానికి చాలా బాగుంటుంది.
గుడ్డును 10 నిమిషాలు నీటిలో ఉడికిస్తే తెల్లసొన, పచ్చసొన రెండూ గట్టిగా ఉడుకుతాయి. ఇలా తిన్నా ఆరోగ్యకరమే.
గుడ్డును 15 నిమిషాలు ఉడికిస్తే తినడానికి మంచిది కాదు. గుడ్డులోని పోషకాలన్నీ బయటికి పోతాయి.
గుడ్లు ఉడకబెట్టే ముందు నీళ్లు బాగా వేడెక్కాక గుడ్లు వేయాలి. ఉడికేటప్పుడు గుడ్డు పగలకుండా ఉప్పు లేదా వెనిగర్, ఉల్లిపాయ పొట్టు లేదా నిమ్మ తొక్కను నీటిలో వేయాలి.
గుడ్డు బాగా ఉడికాక పొట్టు సులభంగా రావాలంటే చల్లటి నీటిలో లేదా ఐస్ క్యూబ్స్ వేసిన నీటిలో వేయాలి. ఫ్రిజ్‌లోని చల్లటి నీటిని కూడా వాడొచ్చు.
రోజుకో కోడిగుడ్డు తినడం వల్ల సంపూర్ణ భోజనం తిన్నట్టు లెక్క. బరువు నియంత్రణకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
మెదడుకు అవసరమైన కోలిన్ ఇందులో ఉంటుంది. కాబట్టి పిల్లలకు కచ్చితంగా రోజుకో కోడిగుడ్డు తినిపించాలి.