MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Food
  • Premium Rice: ప్ర‌పంచంలో అత్యంత ఖరీదైన బియ్యం ఇదే.. కిలో రైస్ ధ‌ర రూ. 12,000

Premium Rice: ప్ర‌పంచంలో అత్యంత ఖరీదైన బియ్యం ఇదే.. కిలో రైస్ ధ‌ర రూ. 12,000

Premium Rice: ప్ర‌పంచంలో ఎక్కువ మంది తీసుకునే ఆహారంలో బియ్యం ప్ర‌ధాన‌మైంది. సాధార‌ణంగా మ‌న తీసుకునే బియ్యం ధ‌ర కిలో రూ. 50 నుంచి రూ. 70 వ‌ర‌కు ఉంటుంది. బాస్మ‌తి లాంటివైతే రూ. 150 వ‌ర‌కు ఉండొచ్చు. అయితే కిలో బియ్యం ధ‌ర రూ. 12000 ఉంద‌ని మీకు తెలుసా? 

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 11 2026, 04:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం
Image Credit : Gemini AI

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం

ప్రపంచంలో అత్యంత ఖరీదైన బియ్యంగా కిన్‌మేమై ప్రీమియం రైస్‌గా గుర్తింపు పొందింది. ఈ బియ్యాన్ని జపాన్‌కు చెందిన టోయో రైస్ కార్పొరేష‌న్ తయారు చేస్తుంది. ఇది సాధారణ బియ్యం కాదు. ప్రత్యేకమైన ప్రాసెసింగ్ పద్ధతి, అత్యుత్తమ నాణ్యత గల రకాల బియ్యం ఉపయోగించడం, పరిమిత ఉత్పత్తి వంటి కారణాల వల్ల దీని ధర చాలా ఎక్కువగా ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఈ బియ్యం ధర ఎంత?
Image Credit : Gemini AI

ఈ బియ్యం ధర ఎంత?

ఈ ప్రత్యేక బియ్యాన్ని 2016లో మార్కెట్లో విడుదల చేశారు. ఆ సమయంలో 840 గ్రాముల ప్యాక్ ధర దాదాపు 9,496 జపాన్ యెన్ ఉండేది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ. 5,500 వరకూ ఉండేది. ఇప్పుడు ధర మరింత పెరిగింది. అధికారిక సమాచారం ప్రకారం 840 గ్రాముల ప్యాక్ ధర సుమారు 155 సింగపూర్ డాలర్లు ఉంటుంది. భారత రూపాయల్లో ఇది రూ. 10,500 కంటే ఎక్కువ. అంటే ఒక కిలో కిన్‌మేమై బియ్యం ధ‌ర దాదాపు రూ. 12,000 నుంచి రూ. 12,500 వరకు ఉంటుంది.

34
ప్రత్యేక ప్రాసెసింగ్ టెక్నాలజీ
Image Credit : Gemini AI

ప్రత్యేక ప్రాసెసింగ్ టెక్నాలజీ

ఈ బియ్యాన్ని తయారు చేసే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సాధారణ బియ్యం లాగా దీనిని వండే ముందు కడగాల్సిన అవసరం లేదు. కారణం ఏమిటంటే, ప్రత్యేకమైన రైస్ బఫింగ్ టెక్నాలజీ ద్వారా బియ్యం గింజలపై ఉండే అదనపు స్టార్చ్ ముందుగానే తొలగిస్తారు. దీంతో బియ్యం శుభ్రంగా ఉంటుంది. అలాగే జీర్ణం కావడం కూడా సులభమవుతుంది. ఈ ప్రీమియం బియ్యం త‌యారీలో జపాన్‌కు చెందిన ప్రసిద్ధ రకాలైన Koshihikari Rice, Pikamaru Rice వంటి వాటిని ఉప‌యోగిస్తారు. ఈ రకాల బియ్యం సువాసన, రుచితో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి. అలాగే బియ్యం గింజలను యంత్రాలతో కాకుండా చాలా జాగ్రత్తగా ఎంపిక చేస్తారు.

44
ఆరోగ్యానికి ఉపయోగాలు, పరిమిత ఉత్పత్తి
Image Credit : Gemini AI

ఆరోగ్యానికి ఉపయోగాలు, పరిమిత ఉత్పత్తి

ఈ బియ్యంలో సాధారణ బియ్యంతో పోలిస్తే LPS (లిపోపాలిసాకరైడ్స్) అనే పోషక పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడంలో స‌హాయ‌ప‌డుతుంద‌ని అని కంపెనీ చెబుతోంది. ఇంకా ఈ బియ్యాన్ని తయారు చేసిన తర్వాత సుమారు ఆరు నెలలపాటు ప్రత్యేక ఫ్లేవర్ ఏజింగ్ ప్రక్రియలో ఉంచుతారు. దీని వల్ల బియ్యం రుచి, వాసన మరింత మెరుగవుతుంది. ఇది చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే తయారు చేస్తారు. అందుకే సాధారణ మార్కెట్లలో ఇది సులభంగా దొరకదు. ఈ కారణాల వల్లే ఈ బియ్యం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యంగా మారింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆహారం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Related Stories
Recommended image1
Induction stove: గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర ఎంతైనా పెర‌గ‌ని.. ఈ స్ట‌వ్ మీ ఇంట్లో ఉంటే బిందాస్‌. బ‌డ్జెట్ ధ‌ర‌లోనే
Recommended image2
Viral Video: CBSE క్వ‌శ్చ‌న్ పేప‌ర్‌లో క్యూఆర్ కోడ్‌... స్కాన్ చేసి చూడ‌గా దిమ్మ‌తిరిగే షాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved