MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Quran: మన దేశంలో అగ్గిపెట్టెలో పట్టేంత ఖురాన్ ఎక్కడ ఉందో తెలుసా?

Quran: మన దేశంలో అగ్గిపెట్టెలో పట్టేంత ఖురాన్ ఎక్కడ ఉందో తెలుసా?

Quran: ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ అందరికీ తెలిసిందే. ఈ ఖురాన్ ని అగ్గి పెట్టెలో పట్టేంత పుస్తకంలో రాశారు అనే విషయం మీకు తెలుసా? మన దేశంలో.. ఈ చిన్న ఖురాన్ ఎక్కడ ఉంది? అంత చిన్న పుస్తకంలో ఎలా రాశారు?

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 08 2026, 03:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
ప్రపంచంలో రెండే మీనియేచర్ ఖురాన్ లు
Image Credit : Chat Gpt

ప్రపంచంలో రెండే మీనియేచర్ ఖురాన్ లు

హిందూవులకు భగవద్గీత ఎలానో.. ముస్లింలకు ఖురాన్ కూడా అంతే. వారు రెగ్యులర్ గా ఆ ఖురాన్ ని పటిస్తూనే ఉంటారు. కాగా, అలాంటి ఖురాన్ ని చాలా చిన్న పుస్తకంలో కూడా పొందుపరిచారు. ఆ చిన్న పుస్తకం హైదరాబాద్ లోని సాలార్జంగ్ మ్యూజియంలో ఉంది. సాలార్జంగ్ మ్యూజియం అనగానే మనకు ఎన్నో అరుదైన కళాఖండాలు, పురాతన వస్తువులు, రాజుల కాలం నాటి సంపదకు ప్రసిద్ధి. కానీ, ఈ మ్యూజియంలో పవిత్ర ఖురాన్ అత్యంత చిన్నది ఉన్నది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం...

అత్యంత చిన్న ఖురాన్..

అత్యంత చిన్న ఖురాన్ ఇది. చూడటానికి ఇది పుస్తకమేనా అనేంత చిన్నగా ఉంటుంది. దీని పరిమాణం కేవలం 2.4 సెంటీమీటర్లు మబత్రమే. అంటే సాధారణంగా మనం ఊహించే పుస్తకంతో పోలిస్తే ఇది చాలా చిన్నది. సాలార్ జంగ్ మ్యూజియం అధికారిక వెబ్ సైట్ ప్రకారం, ప్రపంచంలో ఇలాంటి మీనియేచర్ ఖురాన్ లు కేవలం రెండు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి ఇరాన్ లో ఉండగా, మరొకటి హైదరాబాద్ లోని సాలార్ జంగ్ మ్యూజియంలో ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
ఇంత చిన్న పుస్తకంలో ఖురాన్ ఎలా రాశారు?
Image Credit : Chat Gpt

ఇంత చిన్న పుస్తకంలో ఖురాన్ ఎలా రాశారు?

ఈ మినియేచర్ ఖురాన్ ప్రత్యేకత కేవలం దాని పరిమాణంలోనే లేదు. అతి చిన్న ప్రదేశంలో అరబిక్ లిపిని రాయడం, దాన్ని పుస్తక రూపంలో రూపొందించడం అప్పటి కళాకారుల నైపుణ్యాన్ని చూపిస్తుంది. సాలార్ జంగ్ మ్యూజియంలో అరబిక్, పర్షియన్ మాన్యుస్క్రిప్టులకు ప్రత్యేకమైన విభాగం ఉంది. ఇక్కడ వివిధ కాలాలకు చెందిన అరుదైన మతపరమైన, చారిత్రక గ్రంథాలు భద్రపరిచారు. ఈ మాన్యుస్క్రిప్టులు వివిధ ఆకారాలు, పరిమాణాల్లో ఉన్నాయని మ్యూజియం చెబుతోంది. ఈ మ్యూజియంలో అత్యంత చిన్న ఖురాన్ మాత్రమే కాదు.. పెద్ద పరిమాణంలో ఉన్న ఖురాన్ కూడా ఇక్కడే ఉంది. రెండు ఖురాన్ లు ఇక్కడే ఉండటం విశేషం.

ఒకే మ్యూజియంలో ఇన్ని అరుదైన మాన్యుస్క్రిప్టులు ..

సాలార్ జంగ్ మ్యూజియం లైబ్రరీలో అరబిక్ భాషకు చెందిన 2,500కు పైగా మాన్యుస్క్రిప్టులు ఉన్నాయని మ్యూజియం పేర్కొంటోంది. వీటిలో మతం మాత్రమే కాకుండా గణితం, ఖగోళశాస్త్రం, వైద్యం, వ్యవసాయం, వంటలు, సుగంధ ద్రవ్యాలు వంటి విభిన్న అంశాలకు సంబంధించిన పురాతన గ్రంథాలు కూడా ఉన్నాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
భారత దేశం
హైదరాబాద్
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
(47.0 ov) 329 & 140/4
AUSAUS
429
Day 3
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Anjeer: పరగడుపున నానపెట్టిన అంజీర్ తింటే ఏం జరుగుతుందో తెలుసా?
Recommended image2
Coconut water: 2 వారాలపాటూ రోజూ కొబ్బరినీళ్లు తాగితే జరిగే అద్భుతం ఇదే
Recommended image3
ప్రతిరోజూ అవిసె గింజల నీళ్లు తాగారంటే రెండు నెలల్లోనే సన్నగా మెరుపుతీగలా మారతారు
Related Stories
Recommended image1
Biggest Seed: తాటి చెట్టుకు 25 కిలోల కొబ్బరికాయ..ప్రపంచంలోనే అత్యంత బరువైన విత్తనం..!
Recommended image2
Rain: మన దేశంలో సంవత్సరమంతా వర్షం పడే ప్రదేశం ఇది...!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved