ఈ ఆరు పక్షులు మనుషులని కూడా తినేస్తాయి
మనుషులు పక్షులను తింటారని మనకి తెలుసు. పిట్ట మాంసం పేరుతో మార్కెట్లో కొన్ని రకాల పక్షుల మీట్ అమ్ముతారు. అయితే మనిషినే తినేసే పక్షుల గురించి ఎపుడైనా విన్నారా? నిజమే.. మనుషులను కూడా కొన్ని పక్షులు చంపి తినేయగలవు. అలాంటి కొన్ని ప్రమాదకర బర్డ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హార్పీ ఈగల్స్..
హార్పీ ఈగల్ ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన ఈగల్ గా గుర్తింపు పొందింది. దీని ఎత్తు 86 సెం.మీ. అంటే సుమారుగా 3 అడుగులు ఉంటుంది. వీటి రెక్కల విస్తీర్ణమే 2 మీటర్లు అంటే సుమారు 6.5 అడుగులు ఉంటుంది.
హార్పీ ఈగల్ శరీరం చాలా బలంగా ఉంటుంది. ఇది పంజాలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. చాలా పదునైనవి కూడా. వీటి సాయంతోనే అవి పెద్ద జంతువులను కూడా పట్టి తీసుకుపోతాయి. ఇవి సెంట్రల్, సౌత్ అమెరికాలో కనిపిస్తాయి.
హార్పీ ఈగల్స్ ప్రధానంగా స్లోత్ లు, కోతులు, ఇతర చిన్న జంతువులను తింటాయి. అవసరాన్ని బట్టి పెద్ద జంతువులను కూడా చంపి తినేయగలరు. ఇవి దట్టమైన అడవుల్లో ఉంటాయి. చెట్లపై గుట్టుచప్పుడు కాకుండా జీవిస్తూ వేట చేస్తాయి. ఈ పక్షులు సుమారు 25 నుంచి 35 సంవత్సరాలు బతుకుతాయి.
లేమర్ గియర్(Lammergeier)
లేమర్ గియర్ ను బియర్డ్ వల్చర్ అని కూడా అంటారు. ఇది దక్షిణ ఐరోపా, ఆఫ్రికా, హిమాలయాలు, మధ్య ఆసియాలో కనిపిస్తుంది. ఇది ప్రధానంగా పర్వత ప్రాంతాల్లో ముఖ్యంగా 1,000 నుండి 4,000 మీటర్ల ఎత్తులో నివసిస్తుంది.
లేమర్ గియర్ ఒక భారీ వల్చర్ పక్షి. ఇది 94 నుండి 125 సెంటీమీటర్ల (3-4 అడుగుల) పొడవు ఉంటుంది. దాని రెక్కల విస్తీర్ణం 2.3 నుండి 2.8 మీటర్లు (7.5 - 9.2 అడుగులు) వరకు ఉంటుంది. ఈ పక్షి మిగతా వల్చర్స్ కంటే ప్రత్యేకంగా కనిపిస్తుంది.
లేమర్ గియర్ ప్రధానంగా ఎముకలను తింటుంది. దాని దంతాలు చాలా బలమైనవి. ఇవి 5 నుండి 7 సంవత్సరాల వయసు నుంచి ఏటా ఒకటి లేదా రెండు గుడ్లు పెడుతుంది.
ఆండియన్ కాండోర్(Andean Condor)
ఆండియన్ కాండోర్ ప్రధానంగా దక్షిణ అమెరికాలోని ఆండిస్ పర్వతాలు, పశ్చిమ తీరం లో కనిపిస్తాయి. ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద ఎగిరే పక్షిగా గుర్తింపు పొందింది. దీని రెక్కల విస్తీర్ణం సుమారు 3 మీటర్లు అంటే 10 అడుగులు ఉంటుంది అన్నమాట. ఆండియన్ కాండోర్ సగటు బరువు 11 నుండి 15 కిలోల వరకు ఉంటుంది. మగ పక్షులు ఆడపక్షుల కంటే బరువుగా ఉంటాయి.
ఆండియన్ కాండోర్ ఒక స్కావెంజర్ అంటే మృతజీవులు తినే పక్షి అని అర్థం. ముఖ్యంగా జంతువులు, పక్షులు చనిపోయిన తర్వాత వాటి శరీరాలను తింటుంది. ఇవి ఎక్కువగా గ్రూపులుగా తిరగడానికి ఇష్టపడతాయి. ఆహారం తిన్న తర్వాత చాలా సేపు పర్వతాలపై నిద్రపోతాయి. ఇవి సుమారు 50 సంవత్సరాల వరకు జీవిస్తాయి.
ఆఫ్రికన్ క్రౌన్డ్ ఈగల్ (African Crowned Eagle)
ఆఫ్రికన్ క్రౌన్డ్ ఈగల్ ప్రధానంగా సుబ్-సహారా ఆఫ్రికా ప్రాంతంలో కనిపిస్తుంది. దట్టమైన వర్షపు అడవులు, అటవీ ప్రాంతాలు, పర్వత ప్రాంతాల్లో నివసిస్తుంది.
ఆఫ్రికన్ క్రౌన్డ్ ఈగల్ అతిపెద్ద, శక్తివంతమైన ఈగల్స్‌లో ఒకటి. ఈ పక్షి ఎత్తు సుమారు 80 నుండి 90 సెంటీమీటర్లు (2.6 నుండి 3 అడుగులు) ఉంటుంది. వాటి రెక్కల విస్తీర్ణం సుమారు 1.5 నుండి 2 మీటర్లు (5 నుండి 6.5 అడుగులు) ఉంటుంది. దాని గుండ్రంగా ఉండే రెక్కలు, పొడవైన తోక, పదునైన గోళ్లను ఆయుధాలుగా చేసుకొని వేటాడతాయి.
ఇవి ప్రధానంగా స్లోత్ మంకీలు, చిన్న హరినాలు, తారసా జంతువులు, కొన్నిసార్లు చిన్న పిల్లలను, పెద్ద జంతువులను కూడా వేటాడతాయి.
గోల్డెన్ ఈగల్ (Golden Eagle)
గోల్డెన్ ఈగల్స్ ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా, ఉత్తర ఆఫ్రికా పర్వత ప్రాంతాలు, అడవులు కనిపిస్తాయి. ఇవి బాగా పెద్దవిగా, శక్తివంతమైనవిగా ఉంటాయి. వీటి రెక్కల విస్తీర్ణం 1.8 నుండి 2.3 మీటర్లు (6 నుండి 7.5 అడుగులు) ఉంటుంది. సగటు పొడవు 66 నుండి 102 సెంటీమీటర్లు ఉంటుంది. బరువు సుమారు 3 నుండి 6.5 కిలోలు ఉంటుంది.
వీటి కళ్ళు బాగా పదునైనవి. గులాబీ, పసుపు రంగుల్లో ఉంటాయి. గోల్డెన్ ఈగల్‌కి పెద్ద, బలమైన పంజాలు వేటాడటానికి సాయపడతాయి.
గోల్డెన్ ఈగల్స్ ఆహారం జంతువులు, జంతువులు, పక్షులు, కొన్నిసార్లు పెద్ద జంతువులు, గుడ్లగూబలను కూడా వేటాడతాయి. ఇవి 15 నుండి 20 సంవత్సరాల వరకు జీవిస్తాయి.
ఫాల్కన్ (Falcon)
ఫాల్కన్‌లు ప్రపంచంలోని దక్షిణ అమెరికా, యూరప్, ఆసియా, ఆఫ్రికాలో కనిపిస్తాయి. వీటిని ప్రధానంగా రాతి గుట్టలు, అడవులు, మైదానాలు నగర పరిసరాల్లో కూడా చూడవచ్చు.
వీటి పొడవు సుమారు 34 నుండి 58 సెంటీమీటర్లు ఉంటుంది. ఫాల్కన్‌ల రెక్కల విస్తీర్ణం సుమారు 74 నుండి 120 సెంటీమీటర్లు ఉంటుంది. బరువు 300 నుండి 1,500 గ్రాముల వరకు ఉంటుంది.
ఫాల్కన్ పక్షులకు పదునైన ముక్కు, శక్తివంతమైన పంజాలు ఉంటాయి. వీటి రెక్కలు కొంచెం సన్నగా ఉంటాయి. ఇది వేగంగా ఎగరడానికి వీలుగా ఉంటుంది. వీటి బలమైన కళ్ళు దూరం నుండి వేటను గుర్తించగలవు.
అవి ప్రధానంగా చిన్న పక్షులు, చీమలు, జంతువులు, శవాలను తింటాయి. పిట్టలు, చిన్న పక్షులను కూడా వేటాడుతుంది. కొన్నిసార్లు పెద్ద జంతువులను కూడా వేటాడగలవు. ఇవి దాదాపు 390 కి.మీ. వేగంతో దాడి చేయగలదు.