మీ పిల్లల తెలివితేటలు పెరగాలంటే.. ఉదయాన్నే ఈ 5 పనులు చేయండి!
Parenting Tips : మీ తల్లిదండ్రులు ఉదయాన్నే చేసే కొన్ని పనుల వల్ల పిల్లల తెలివి తేటలు పెరుగుతాయి. అలాగే వారి మెదడు అభివృద్ధికి కూడా సహాయపడతాయి. అవేంటంటే?
ప్రతిరోజూ ఉదయాన్నే పిల్లల్ని నిద్రలేపి వాళ్లను తయారుచేసి స్కూళుకు పంపడం తల్లిదండ్రులకున్న అతి ముఖ్యమైన పని. ఆ తర్వాతే తల్లిదండ్రులు తమ తమ పనులను చూసుకుంటారు. కానీ పిల్లలు ఉదయం లేచిన వెంటనే స్కూలుకు రెడీ చేయడం మాత్రమే ముఖ్యం కాదు. తల్లిదండ్రులుగా మీరు వారితో ఎలా వ్యవహరిస్తారనేది వారు రోజంతా చురుకుగా ఉండటానికి. వారి మెదడు అభివృద్ధికి బాగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
మీ ఉదయం దినచర్యలో కొన్ని విషయాలను చేర్చడం వల్ల మీ పిల్లల మెదడు శక్తిని పెంచొచ్చు. మంచి పోషకమైన ఆహారం ఇవ్వడం నుంచి మీరు వారితో ఎలా వ్యవహరిస్తారనే విషయం దాకా అన్నీ మీ పిల్లల అభ్యాసం, అభివృద్ధి చెందే సామర్థ్యాన్ని పెంచుతాయి. మీ పిల్లల రోజుని ప్రారంభించడానికి, వారి మెదడు అభివృద్ధికి సహాయపడటానికి మీరు చేయగల 5 ముఖ్యమైన పనుల గరించి ఇప్పుడు తెలుసుకుందాం..
తల్లిదండ్రులు ప్రతిరోజూ ఉదయం చేయవలసిన 5 విషయాలు :
1. మీ పిల్లలను ఆప్యాయంగా కౌగిలించుకోండి
ప్రతిరోజూ ఉదయం మీ పిల్లలు నిద్రలేవగానే ముందుగావారిని ఆప్యాయంగా కౌగిలించుకోండి. తర్వాత ప్రేమగా హగ్ చేసుకోండి. అంతేకాకుండా ప్రతిరోజూ వారికి గుడ్ మార్నింగ్ చెప్పండి. అలాగే పిల్లల్ని స్కూలుకు పంపేటప్పుడు కూడా వారిని కౌగిలించుకుని ముద్దు పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీ పిల్లలు సురక్షితంగా, ప్రేమగా భావిస్తారు. అలాగే పిల్లలు ఎలాంటి ఆందోళన లేకుండా రోజంతా సంతోషంగా ఉంటారు. అలాగే వారు చదువుపై కూడా దృష్టి పెడతారు.
2. వారిని ప్రోత్సహించండి :
మీ పిల్లలు ఉదయం లేచిన వెంటనే చదవాలనుకుంటున్నారా లేదా వేరే ఏదైనా చేయాలనుకుంటున్నారో అడిగి తెలుసుకోండి. వాళ్లకు ఇంట్రెస్ట్ విషయాల్లో పిల్లల్ని ప్రోత్సహించండి. ఇలా చేయడం వల్ల మీ పిల్లల సృజనాత్మకత పెరుగుతుంది. అలాగే వాళ్లు రోజంతా సంతోషంగా ఉంటారు.
3. వారిని ప్రశంసించండి :
ఉదయం మీ పిల్లలు ఏదైనా మంచి పని చేసినా లేదా వారికున్న మంచి లక్షణాలను, విజయాలను గుర్తు చేస్తూ వారిని ప్రశంసించండి. ఎందుకంటే ఇది వారి భావోద్వేగ, అభిజ్ఞా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా రోజంతా వారు ఎనర్జిటిక్ గా గడుపుతారు. అలాగే పిల్లలు మంచి పనులు చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది.
4. పోషకమైన ఆహారం :
పిల్లలకు మంచి హెల్తీ ఫుడ్ ను పెట్టాలి. ఇది మీ పిల్లల మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే మెదడు అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది. అందుకే మీ పిల్లలకు ప్రతిరోజూ ఉదయం పూట పోషకమైన బ్రేక్ ఫాస్ట్ ను పెట్టండి. మీ పిల్లలకు ఉదయాన్నే స్మూతీలు, పండ్లు, ఓట్స్, గింజలు మొదలైన హెల్తీ ఫుడ్స్ ను పెట్టండి. ఇవి వారి మెదడుకు అవసరమైన పోషకాలను అందిస్తాయి.
5. మీ పిల్లల చేతిలో హృదయాన్ని గీయండి :
మీ పిల్లల్ని స్కూలుకు పంపేముందు ముందు వారి చేతిలో హృదయాన్ని గీయండి. ఇలా చేయడం వల్ల మీ పిల్లలు స్కూళ్లో ఉన్నప్పుడు కూడా మీరు వారిపై చూపించే ప్రేమను గుర్తు చేసుకుంటారు. అంతేకాకుండా ఇది వారికి ఓదార్పు, భరోసాను ఇస్తుంది. అలాగే దీనివల్ల మీరు ఎప్పుడూ వారితో ఉన్నారని వారికి అనిపిస్తుంది. ఈ భావన వారి అభ్యాస సామర్థ్యాన్ని పెంచుతుంది.