Asianet News TeluguAsianet News Telugu

ఇక కళ్లద్దాలతో పనిలేదు... ఈ ఐ డ్రాప్ వేసుకుంటే చాలట...

ఇకపై కళ్లద్దాలు కనుమరుగు కానున్నాయా? అంటే అవును అనేలా సరికొత్త మెడిసిన్ మార్కెట్ లో వచ్చింది. ఈ మెడిసిన్ వాడితే కళ్ళద్దాల అవసరమే వుండదట...

Say Goodbye to Glasses: New Eye Drops Offer Clear Vision Without Lenses AKP
Author
First Published Sep 6, 2024, 11:33 PM IST | Last Updated Sep 6, 2024, 11:46 PM IST

కంటి చూపు సరిగ్గా లేనివారు కళ్లద్దాలు వాడుతుంటారు. అయితే ఎలాంటి కళ్లద్దాలు లేకుండానే నిశ్చితంగా చదువుకునే సరికొత్త మెడిసిన్ వస్తోంది. కళ్లద్దాల బదులుగా ఉపయోగించేలా ఐ డ్రాప్ ను రూపొందించింది ముంబైకి చెందిన ఎన్టోడ్ ఫార్మా కంపనీ. 

ఇలా కళ్లద్దాలు వాడకుండానే మంచి చూపును పొందేలా PresVu అనే ఐ డ్రాప్ ను లాంచ్ చేసింది ఎన్టోడ్ ఫార్మా. ఇలాంటి మెడిసిన్ దేశంలోనే మొదటిసారిగా అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే దీనికి డ్రగ్స్ రెగ్యులేటరీ ఏజన్సీ ఆమోదం లభించింది. అమ్మకాలు చేపట్టేందుకు కూడా సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆమోదం కూడా లభించింది. 

ఈ ఐ డ్రాప్ కంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కాదని నిపుణులు చెబుతున్నారు. ఒక్క డ్రాప్ కంట్లో వేసుకుంటే 15 నిమిషాల తర్వాత పని ప్రారంభిస్తుందని... దాదాపు 6 గంటలవరకు ప్రభావం వుంటుందని చెబుతున్నారు.

''అప్పటికప్పుడు ఇలాంటి ఐ డ్రాప్స్ ఉపయోగపడవచ్చు. కానీ వీటిని ఎక్కువ కాలం ఉపయోగించలేం. ఎక్కువగా వాడటం వల్ల ఇతర సమస్యలు ఉత్పన్నం కావచ్చు. కాబట్టి ఇలాంటి మందుల కంటే కళ్లద్దాలే ఉత్తమం'' అనేది నిపుణుల అభిప్రాయం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios