MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • వీళ్లు ఆపిల్ పండ్లను తినొద్దు

వీళ్లు ఆపిల్ పండ్లను తినొద్దు

రోజుకో ఆపిల్ పండును తింటే హాస్పటల్ కు వెళ్లాల్సిన అవసరం రాదని ఆరోగ్య నిపుణులు చెప్తారు. కానీ కొంతమంది ఆపిల్స్ ను తినకూడదు. వాళ్లు ఎవరంటే 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Sep 17 2024, 05:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

పండ్లు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. వీటిలో ఆపిల్ పండు ఒకటి. ఈ పండు మనకు ఎన్నో వ్యాధులను రాకుండా కాపాడుతుంది. అందుకే అంటారు రోజుకో ఆపిల్ తింటే హాస్పటల్ కు దూరంగా ఉంటారని. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27
Fruits

Fruits

ఆపిల్ పండ్లలో విటమిన్-సి, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఆపిల్ పండ్లు మన ఆరోగ్యానికి దివ్య ఔషదం లాంటివి. ఆపిల్ పండ్లు మన ఆరోగ్యానికి మేలు చేసేటివే అయినా.. కొంతమంది వీటిని పొరపాటున కూడా తినకూడదు. వాళ్లు ఎవరు? ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

37
apple

apple

డయాబెటిస్ 

డయాబెటీస్ పేషెంట్లు కొన్ని రకాల పండ్లను తినకూడదు. వీటిలో ఆపిల్ పండ్లు కూడా ఉన్నాయి. అవును ఆపిల్ పండ్లలో షుగర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. వీటిని తింటే షుగర్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. ఇది తెలియక డయాబెటీస్ ఉన్నవారు ఆపిల్ పండ్లను కూడా తింటుంటారు. కానీ షుగర్ ఉన్నవారు ఆపిల్ పండ్లను తినకూడదు. 
 

47

ఊబకాయం 

బరువు తగ్గాలనుకునేవారు కూడా ఆపిల్ పండ్లను ఎక్కువగా తింటుంటారు. కానీ ఆపిల్ పండ్లను తింటే మీరు అస్సలు బరువు తగ్గరు. మరింత బరువు పెరిగిపోతారు. అవును ఆపిల్ పండ్లలో కేలరీలు, షుగర్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని తింటే మీ బరువు మరింత పెరుగుతుంది. 

57

గుండె జబ్బులు 

గుండె జబ్బులతో వ్యాధులతో బాధపడే వారికి ఆపిల్ పండ్లు మంచివి కావు. వీరు ఈ పండ్లను తినకపోవడమే మంచిది. ఎందుకంటే దీనిలో షుగర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మీకు గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. 

67

జీర్ణ సమస్యలు

జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా ఆపిల్ పండ్లను తినకూడదు. ఎందుకంటే దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని అతిగా తింటే గ్యాస్ సమస్య వస్తుంది. ఇది కడుపు నొప్పి, తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి. 

అలెర్జీ సమస్యలు

ఒక అధ్యయనం ప్రకారం..  ఆపిల్స్ లో పురుగు మందులుకూడా ఉంటాయి. వీటిలో డిఫెనిలామైన్ అనే రసాయన సమ్మేళనం ఉంది. దీనిని యూరోపియన్ యూనియన్ నిషేధించింది. దీనివల్ల అలెర్జీ సమస్య వస్తుంది. 

77

నోటి ఆరోగ్యం

మీకు తెలుసా? సోడా కంటే ఆపిల్స్ యే ఎక్కువ ఆమ్లంగా ఉంటాయి. అంటే వీటిని తినడం వల్ల నోటి ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం పడుతుంది. రోజుకు రెండు నార్మల్  సైజు యాపిల్స్ తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకంటే ఎక్కువ ఆపిల్స్ తింటే లాభాలకు బదులుగా నష్టాలు కలుగుతాయి. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangoes: అతిగా మామిడి పండ్లు తింటే లావవుతారా?
Recommended image2
Mangoes: మామిడి పండ్లు తింటే ఒంట్లో వేడి చేస్తుందా? ఎక్కువ తింటే ఏమవుతుంది?
Recommended image3
Sugar: శరీరంలో చక్కెర మోతాదు పెరిగితే పేగుల్లో జరిగేది ఇదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved